4వ తరగతి చదివిన ఏఎన్నార్.. హీరోగా మారడానికి కారణం ఎవరో తెలుసా? అక్కినేని జీవితాన్ని మార్చింది ఎవరు?

Published : Mar 26, 2026, 12:21 PM IST

టాలీవుడ్ మొదటి తరం హీరోలలో ఏఎన్నార్ ది ప్రత్యేకమైన స్థానం. తెలుగు పరిశ్రమ హైదరాబాద్ రావడానికి మొదటి పిల్లర్ వేసిందే అక్కినేని. ఎక్కువగా చదువుకోకపోయినా.. హీరోగా, వ్యాపారవేత్తగా ఎదిగిన ఏఎన్నార్ జీవితాన్ని మార్చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

PREV
15
తెలుగు పరిశ్రమ దశ మార్చిన హీరో..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ కొనసాగారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ముందడుగు వేసిన వ్యక్తిగా ఏఎన్నార్ చరిత్రలో నిలిచిపోయారు. 70వ దశకంలోనే ఏఎన్నార్ ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు. ఇక్కడి నుంచే సినిమాలు చేశారు.. అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి.. పరిశ్రమను ఇక్కడే డెవలప్ చేశారు. హీరోగా వ్యాపార వేత్తగా ఎదిగిన అక్కినేని పెద్దగా చదువుకోలేదు.. డిగ్రీలు చేయలేదు. కానీ తన తెలివితేటలతో అద్భుతం చేశారు. 4వ తరగతి మాత్రమే చదివిని ఏఎన్నార్ ఇవన్నీ సాధించడానికి పునాది వేసింది ఎవరో తెలుసా?

25
అక్కినేని సినిమాల్లోకి ఎలా వచ్చారు..

అక్కినేని నాగేశ్వరరావు.. నాటకాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఏదో నాటకం కోసం గుడివాడ వెళ్తూ.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అనుకోకుండా ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య కంటపడి.. ఆయన ద్వారా.. సినిమాల్లోకి వచ్చారు. నాగేశ్వరావులోని హావభావాలు, మనిషి తీరును చూసిన నిర్మాత.. సినిమాలకు సరిపోతాడు అన్ననమ్మకంతో అక్కినేనికి అవకాశం ఇచ్చాడు. 1941లో 'ధర్మపత్ని'తో తెరంగేట్రం చేసి, ఆపై 'సీతా రామ జననం' (1944)తో హీరోగా నిలదొక్కుకున్నారు.

35
చిన్న వయసులోనే నాటకాలు..

అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువుకోలేదు. ఆయన 4వ తరగతి వరకే చదివారట. ఆయనకు అప్పటికే 5 ఎకరాల భూమి ఉంది. పెద్దగా చదువుకోలేదు.. వ్యావసాయం చేసుకుని బ్రతుకుతాడు అని ఇంట్లో వాళ్లు అనుకున్నారట. అక్కినేని తల్లి కూడా ఆభూమిని ఏఎన్నార్ కోసం అలా ఉంచారట. ఆతరువాత కాలంలో నాటకాల మీద ఆసక్తితో, 10 ఏళ్ల వయసులోనే అక్కినేని తిరగడం మొదలుపెట్టారు. అప్పట్లో మహిళలు స్టేజ్ ఎక్కేవారు కాదు.. దాంతో మహిళా పాత్రలు కూడా మగవారే వేసేవారు. అక్కినేని కూడా స్త్రీ వేషాలు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

45
నాగేశ్వరరావు జీవితాన్ని మార్చేసిన తల్లి నిర్ణయం..

ఇక ఏఎన్నార్ ఇంట్రెస్ట్ ను గమనించిన ఆయన తల్లి.. నాటకాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు కదా.. నాలుగు రాళ్లు సంపాదించుకుంటాడని ప్రోత్సహించింది. అన్నలతో చెప్పి.. అక్కినేనిని నాటకబృందాలతో తిసుకెళ్లమని పురమాయించిందట. అలా తన తల్లి ప్రోత్సహించడం వల్లే.. ఎక్కడో 5 ఎకరాల భూమిని సాగుచేయసుకోవలసిన తాను... నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చి హీరోగా స్థిరపడ్డానని అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. తన జీవితాన్ని మార్చింది తన తల్లి నిర్ణయమే అని ఆయన అన్నారు.

55
70 ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగిన ఏఎన్నార్..

ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య, విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఒక నాటక ప్రదర్శన కోసం వచ్చిన నాగేశ్వరరావును చూశారు. ఆయన హావభావాలు నచ్చి, తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అనుకున్నట్టుగానే 1941లో విడుదలైన 'ధర్మపత్ని' సినిమాలో చిన్న పాత్రతో అక్కినేని సినీ ప్రస్థానం మొదలైంది. 1944లో వచ్చిన 'సీతా రామ జననం' చిత్రంలో సీతారాముడిగా ఆయన అద్భుత ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, నటుడిగా స్థిరపడ్డారు. దాదాపు 70 ఏళ్ల పాటు సినిమానే ఊపిరిగా జీవించారు ఏఎన్నార్.

Read more Photos on
click me!

Recommended Stories