కానీ రిజల్ట్ నిరాశపరిచింది. సమంత, సిద్దార్థ్ నటించిన జబర్దస్త్.. వాణి కపూర్, నాని నటించిన ఆహా కళ్యాణం రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. ఈ చిత్రం తర్వాత కొంత కాలానికి సమంత, సిద్ధార్థ్ విడిపోయారు. ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడనే కారణంతో సిద్ధార్థ్ నుంచి సమంత విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య విడిపోయాక సిద్దార్థ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడలేదు అంటూ పరోక్షంగా సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.