అమితాబ్‌తో ఎఫైర్‌.. సంచలన విషయాలు చెప్పిన రేఖ

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌, గ్లామర్‌ క్వీన్ రేఖల మధ్య నడిచిన ప్రేమ కథ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎఫైర్ గురించి అమితాబ్ బహిరంగంగా ఎప్పుడూ కామెంట్ చేయకపోయినా, రేఖ మాత్రం తమ మధ్య సమ్‌ థింగ్ సమ్ థింగ్ అంటూ హింట్‌ ఇచ్చింది.

అమితాబ్‌, రేఖ, జయా బచ్చన్‌ల ట్రయాంగులర్‌ లవ్ స్టోరి బాలీవుడ్ లో ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అప్పట్లో ఈ వార్తే న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచింది.
బిగ్‌ బీ ఈ వార్తలను పలు సందర్భాల్లో ఖండించినా,రేఖ మాత్రం మా మధ్య సమ్‌ థింగ్ సమ్‌ థింగ్ అంటూ చెబుతూ వచ్చింది.

1984 నవంబర్‌లో ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమితాబ్ తమ రిలేషన్‌ను ఖండించడం గురించి రేఖ స్పందించింది.
`అమితాబ్ అలా చెప్పటంలో తప్పేముంది..? ఆయన తన కుటుంబాన్ని, పిల్లలను కాపాడుకోవడానికి అలా చెప్పి ఉంటాడు. అమితాబ్ తో నా రిలేషన్‌ గురించి ప్రజలకు ఎందుకు తెలియాలి. నేను ఆయన్ను ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అంతే.. మిగతా వారికి దానితో ఏం సంబంధం` అంటూ రియాక్ట్ అయ్యింది రేఖ.
అదే అమితాబ్ తాను డైరెక్ట్‌గా మా రిలేషన్ గురించి మాట్లాడితే నేను స్పందిస్తాను. కానీ అలా చేయలేదు కదా. బహిరంగంగా చేసిన కామెంట్‌ గురించి ఏం చెపుతాం. బచ్చన్‌కు ఎవరినీ బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే ఆయన భార్య కోసం మా మధ్య ఏం లేదని చెప్పి ఉండొచ్చు` అంటూ కామెంట్ చేసింది రేఖ.
నా రియాక్షన్ అంత టిపికల్ ఏం కాదు. మా మధ్య ఉన్న రిలేషన్‌ గురించి మాకు తెలుసు. మేం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మా జీవితంలో కష్టాలకంటే ఆనందమే ఎక్కువగా ఉందని చెప్పింది రేఖ.
ఇంత కన్నా మాకేం కావాలి. నేను ఆయనతో ఉన్నంత కాలం ఎవరి గురించి పట్టించుకోలేదు. కానీ ఆయన మా రిలేషన్‌ను ఖండించాడు. అయినా నాకు బాధలేదు. ఆయన పరిస్థితుల కారణంగానే అలా చేశాడు. ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్‌ గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. అమితాబ్‌ తో నా రిలేషన్‌ నాకు ముఖ్యంగా అందరికీ కాదు` అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంది రేఖ.

Latest Videos

click me!