Chiranjeevi
టాలీవుడ్ ని దశాబ్దాల పాటు ఏలారు మెగాస్టార్ చిరంజీవి. నెంబర్ వన్ హీరోగా బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో చిరంజీవి ఒకరు. టాలీవుడ్ లో కోటి రూపాయల పారితోషికం మొదటిసారి తీసుకున్న హీరో కూడా ఆయనే.
చిరంజీవి నట ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా మీద చెరగని ముద్ర వేసిన చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ మీద అతి పెద్ద బాధ్యత ఉంది. ఏమాత్రం తేడా వచ్చిన అబాసుపాలు కావల్సి వస్తుంది. కానీ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
2007లో చిరుత చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రామ్ చరణ్.. రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మగధీర ఇండస్ట్రీ రికార్డ్స్ తుడిచి పెట్టింది. రామ్ చరణ్ నటనకు జనాలు ఫిదా అయ్యారు. ధ్రువ, రంగస్థలం వంటి హిట్స్ తో రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన చేరాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్ చరణ్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ సక్సెస్ లో చిరంజీవి పాత్ర ఎంతో ఉంది. కథలతో పాటు దర్శకుల ఎంపికలో చిరంజీవి కీలకంగా వ్యవహరిస్తారు.
ఇక చిరు-చరణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు. తండ్రి కొడుకులకు మించిన ప్రేమానురాగాలు మనం వారి మధ్య చూడొచ్చు. అయితే చిరంజీవిని చరణ్ మోసం చేశాడట. ఈ విషయాన్ని చిరంజీవి ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించాడు. ఓ టెలివిజన్ షోలో సాయి పల్లవి, రానా, చిరంజీవి పాల్గొన్నారు.చిరంజీవిని ఉద్దేశించి రానా మాట్లాడుతూ.. నేను అప్పుడు 10 లేక 11వ తరగతిలో ఉన్నాను. నాకు బాగా గుర్తు. చిరంజీవి అంకుల్ వాళ్ళ ఇంట్లో టెలీస్కోప్ ఉండేది.
Rana Daggupathi
నక్షత్రాలు చూడటం కోసం దాన్ని ఏర్పాటు చేశారు. ఒక రోజు నేను టెలిస్కోప్ చూస్తున్నాను. వెనక నుండి నెత్తి మీద ఎవరో కొట్టారు. అది చిరంజీవి అంకుల్. ముందు దానికున్న క్యాప్ తీయరా... అన్నాడు. అది బాగా గుర్తుండి పోయే ఫన్నీ మూమెంట్, అన్నాడు.
చిరంజీవి కొనసాగిస్తూ... నేను టెలిస్కోప్ క్యాప్ తీయమంటే రానా.. మా ఇంటి కిటికీ తలుపులకు ఉన్న గ్రిల్ తీశాడు. చరణ్, రానా గదిలో రాత్రంతా చదువుకుంటున్నారని మేము అనుకునేవాళ్లం. కానీ వీరిద్దరూ కిటికీ గ్రిల్ తీసేసి బయటకు వెళ్ళిపోయేవారు. ఇష్టం వచ్చినట్లు తిరిగి వచ్చేవారు. మరలా గ్రిల్ తీసేసి గదిలోకి వెళ్ళిపోయేవారు. వీరిద్దరూ చేస్తున్న మోసం తెలుసుకోవడానికి నాకు రెండు నెలల సమయం పట్టింది... అన్నారు. రానా, చిరంజీవి మాటలకు షోలో ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు.
రానా, రామ్ చరణ్, శర్వానంద్ క్లాస్ మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. చరణ్, రానా, శర్వానంద్ తరచుగా కలుస్తుంటారు. చిరంజీవి నివాసానికి వెళుతుంటారు. టీనేజ్ లో రామ్ చరణ్ కూడా అల్లరి వేషాలు వేశాడట.
ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?
ఇక రామ్ చరణ్, చిరంజీవి అప్ కమింగ్ చిత్రాలు పరిశీలిస్తే... సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ విడుదల చేస్తున్నాడు చరణ్. విశ్వంభర మూవీ సమ్మర్ కి షిఫ్ట్ కావడంతో గేమ్ ఛేంజర్ తో సంక్రాంతి బరిలో రామ్ చరణ్ దిగుతున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్ తో విశ్వంభర రూపొందిస్తున్నారు.