నమ్రతని మహేష్‌ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కృష్ణ వ్యక్తం చేసిన డౌట్ అదేనా..? కొడుకుని ఎందుకు నమ్మాడంటే?

Published : Mar 22, 2024, 01:05 PM ISTUpdated : Mar 23, 2024, 07:09 AM IST

మహేష్‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి ప్రేమ పెళ్లిని కృష్ణ ఒప్పుకోలేదనే టాక్‌ ఉంది. కానీ వాస్తవం ఏంటనేది మహేష్‌ బాబు తెలిపారు.   

PREV
17
నమ్రతని మహేష్‌ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కృష్ణ వ్యక్తం చేసిన డౌట్ అదేనా..? కొడుకుని ఎందుకు నమ్మాడంటే?

మహేష్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బాలనటుడిగానే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నటించిన సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నాడు మహేష్‌ బాబు. సూపర్ స్టార్‌గా తండ్రి కృష్ణ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. 

Survey: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

27

మహేష్‌ బాబు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌ నమ్రతని ఆయన ప్రేమించి పెళ్లాడాడు. నమ్రత `వంశీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆమె హిందీలో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. `వంశీ`లో మహేష్‌ బాబు హీరో. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ మహేష్‌, నమ్రతల ప్రేమకి పునాది వేసింది. ఈ మూవీ నుంచి ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగైదేళ్లు ప్రేమించుకున్నారు. 
 

37

ఆ తర్వాత ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మహేష్‌ బాబు. ఆ విషయాన్ని తండ్రి కృష్ణతో చెప్పాడు. ఈ విషయం చెప్పగానే చాలా సింపుల్‌గా రియాక్ట్ అయ్యాడట. నిజంగానే చెబుతున్నావా? (ఆర్‌ యూ ష్యూర్‌) అన్నాడట. క్లారిటీతోనే ఉన్నావా? అని అడిగాడట. అందుకు మహేష్‌ ఎస్‌ చెప్పాడట. తాను స్ట్రాంగ్‌గానే ఉన్నట్టు తెలిపాడట. దీంతో ఆయన వెంటనే ఓకే అన్నాడట. నీకు ఓకే అయితే తనకు ఓకే అని చెప్పాడట. 
 

47

అయితే తనని అంతగా నమ్మడానికి కారణం ఏంటో చెప్పాడు మహేష్‌. చిన్నప్పట్నుంచి నాన్న నన్ను చూస్తూ వచ్చాడు. నేను ఎలా ఉంటానో తెలుసు. ఎంత డెడికేషన్‌తో, ఎంత సిస్టమాటిక్‌గా, ఎంత డిసిప్లెయిన్‌గా ఉంటానో ఆయనకు తెలుసు. అందుకే నాపై నాన్నకి నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే ఓకే చెప్పారని ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో తెలిపారు మహేష్‌బాబు. ఇది గతంలో చేసిన ఇంటర్వ్యూ. ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఇందులో నమ్రతతో ప్రేమ విషయాన్ని, నాన్న కృష్ణ రియాక్షన్‌ని వెల్లడించారు మహేష్‌ బాబు. 
 

57

ఈ సందర్భంగా ప్రేమ ఎలా ప్రారంభమైందని అడగ్గా, కలిసి పనిచేశామని(వంశీ సినిమాతో). ఆ సమయంలో ఇద్దరం కనెక్ట్ అయ్యామని, ఇద్దరి మధ్య బాండింగ్‌ పెరుగుతూ వచ్చిందని, ఇది నాలుగైదేళ్ల జర్నీ అని, ఒకరినొకరం అర్థం చేసుకున్నామని, తమ బాండింగ్‌ని ముందుకు తీసుకెళ్లాలని భావించి పెళ్లికి సిద్ధమైనట్టు చెప్పాడు మహేష్‌. నమ్రత విషయంలో నాన్నగారు హ్యాపీగా ఉన్నారని తెలిపారు. నేనుమాట్లాడకపోయినా నాన్నతో నమ్రత మాట్లాడుతుందని, రెస్పాన్సిబిలిటీస్‌ చూసుకుంటుందని వెల్లడించారు.
 

67

మహేష్‌బాబు, నమ్రతలకి కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేని, కూతురు సితార ఉన్నారు. సితార చిచ్చరపిడుగులా రాణిస్తుంది. ఇప్పటికే ఆమె సెలబ్రిటీ హోదాని అనుభవిస్తుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఓ కమర్షియల్‌ యాడ్‌ చేసి రికార్డ్ క్రియేట్‌ చేసింది. ఆమె మున్ముందు సినిమాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు గౌతమ్‌ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాడు.
 

77

మహేష్‌ బాబు ఇటీవల `గుంటూరు కారం` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీ మిశ్రమ ఫలితాన్ని చవిచూసింది. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటించబోతున్నాడు. దీని కోసం ప్రిపరేషన్‌ జరుగుతుందట. ఉగాదికి ఈ మూవీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories