పవన్ కి గుండు గీసిన పరిటాల రవి, నిజమెంత?... పరిటాల శ్రీరామ్ లేటెస్ట్ కామెంట్స్ తో పూర్తి క్లారిటీ!

First Published Dec 2, 2022, 4:45 PM IST

చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ఒక అవమానాన్ని మోస్తున్నారు. దివంగత పరిటాల రవితో చిరంజీవి ఫ్యామిలీకి భూ వివాదం తలెత్తింది. ఈ గొడవల్లో పవన్ కళ్యాణ్ కి గుండు గీసి పరిటాల రవి అవమానించాడు. కాగా పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ ఈ ప్రచారం పై స్పష్టత ఇచ్చారు. 
 

Pawan Kalyan

ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పరిటాల రవి. తెలుగుదేశం హయాంలో రాయలసీమను శాసించిన నేత. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎన్టీఆర్ పరిటాల రవిని వెలుగులోకి తెచ్చి పెంచి పోషించారనే వాదన ఉంది. దాదాపు రెండు దశాబ్దాలు పరిటాల రవి హవా నడిచింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పరిటాల రవి గెలిచాడు.

Pawan Kalyan

మంత్రి పదవులు అలంకరించాడు. ఎన్టీఆర్ కి... ఆయన కన్నుమూశాక నారా చంద్రబాబు నాయుడికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. పార్టీలో పరిటాల రవికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉండేది. ఆయన కోరుకుంది ఏదైనా దక్కాల్సిందే. అనంతపురం టు హైదరాబాద్ మొత్తం పరిటాల సామ్రాజ్యమే. సెటిల్మెంట్స్, దందాలు వెరీ కామన్. 
 

Pawan Kalyan

ఈ క్రమంలో పరిటాల రవి హైదరాబాద్ లో చిరంజీవికి చెందిన ఒక ఖరీదైన భూమిని కబ్జా చేశాడు. ప్రశ్నించిన చిరంజీవిని పరిటాల అవమానించి పంపాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో అన్నాడు.అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం. ఆయన ప్రభుత్వంలో పరిటాల మంత్రి.  చేసేది లేక చిరంజీవి గమ్మన ఉండిపోయారు. అన్నయ్యకు జరిగిన అవమానానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. 
 

Pawan Kalyan

నేరుగా పరిటాల ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. పరిటాల రవి అహం దెబ్బతినడంతో పవన్ ని కిడ్నాప్ చేశాడు. అనంతపురం తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశాడు. గుండు చేసి అవమానపరిచాడు. చిరంజీవి టీడీపీ పెద్దలను ప్రాధేయపడడంతో పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టాడు... ఇది ప్రచారంలో ఉన్న కథనం. 
 

Pawan Kalyan

ఖుషి మూవీ విడుదల తర్వాత ఈ పరిణామం జరిగినట్లు కొందరి వాదన. ఈ కారణంగానే పవన్ రెండేళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఆయన అవమానంతో బయటకు రాలేదంటారు.  అప్పట్లో కొన్ని పత్రికలు చిరు-పరిటాల భూవివాదం గురించి, పవన్ కళ్యాణ్ కిడ్నాప్ గురించి రాశాయి.

Pawan Kalyan


జనాలు ఆ విషయం మర్చిపోయారు. అయితే యాంటీ ఫ్యాన్స్ అప్పుడప్పుడు ఈ కోణంలో పవన్ ని అవమానించే ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్ధులు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. టీడీపీ నేత ఆయనను అవమానిస్తే వాళ్ళతోనే చేతులు కలిపాడని వైసీపీ వర్గాలు ఎద్దేవా చేస్తూ ఉంటాయి. పవన్ ఒకటి రెండు బహిరంగ సభల్లో దీన్ని ఖండించారు. 


నిజంగా ఈ సంఘటన జరిగిందా అనే సందేహం జనాల్లో ఉంది. దానికి పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఇవన్నీ అపోహలుగా కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఆయన ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని, కింద పరిచేందుకు చేసే కామెంట్స్ మాత్రమే అన్నారు. 

Pawan Kalyan


పవన్ కళ్యాణ్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అవన్నీ నిరాధార ఆరోపణలు మాత్రమే, అని తాజాఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ఆపేయాలని కోరుతున్నారు. పరిటాల శ్రీరామ్ చెప్పిన ఈ మాటలకు సంబంధించిన వీడియో పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 
 

click me!