భరతనాట్యం నేర్చుకోవడానికి మతం అడ్డు.. తిరస్కారాలు దాటుకుని గొప్ప డాన్సర్‌గా వహీదా రెహమాన్‌..

క్లాసికల్‌ హీరోయిన్‌గా, లెజెండరీ నటిగా ఎదిగిన వహీదా రెహమాన్‌.. అద్భుతమైన నటి మాత్రమే కాదు, ఆమె అత్యద్భుతమైన డాన్సర్‌ కూడా. కానీ దాని వెనకాల అనేక అవమానాలు, తిరస్కారాలున్నాయి. 
 

waheeda rehman faced hurdles for practice bharatanatyam arj

ఆరు దశబ్దాలుగా నటిగా రాణిస్తున్న వహీదా రెహ్మాన్‌(Waheeda Rehman)... బాలీవుడ్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్‌ చిత్రాల్లో నటించింది. ప్రేమ కథలకు కేరాఫ్‌గా నిలిచింది. దీంతోపాటు ప్రేమలోని సంఘర్షణతో కూడిన పాత్రలకు ప్రతిరూపంగా నిలిచింది. నటిగా ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసింది. బాలీవుడ్‌ని కొన్నాళ్లపాటు శాషించింది. అప్పటి ఆడియెన్స్ ని మాత్రమే కాదు, స్టార్స్ ని సైతం అందంతో ఫిదా చేసింది. గురుదత్‌, దేవ్‌ ఆనంద్‌ వంటి స్టార్స్ ఆమెకి ఫిదా అయిన విషయం తెలిసిందే. 
 

waheeda rehman faced hurdles for practice bharatanatyam arj

వహీదా రెహ్మాన్‌ తన సినిమాల్లో నటనతో అదరగొట్టడమే కాదు, డాన్సులతోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. అయితే హీరోయిన్‌గా ఎంట్రీకి ముందే ఆమె అనేక స్టేజ్‌షోస్‌ చేసింది. డాన్సర్‌గా అదరగొట్టింది. కానీ ఆ అద్భుతమైన టాలెంట్‌ వెనక చాలా బాధ ఉంది. ఎన్నో తిరస్కారాలున్నాయి, అవమానాలున్నాయి. మతపరమైన వ్యత్యాసాలున్నాయి. వాటిని దాటుకుని వచ్చింది. అనేక స్ట్రగుల్స్ అనుభవించింది. 
 


వహీదా రెహ్మాన్‌ ది డక్కన్‌ ముస్లీంకి చెందిన ఫ్యామిలీ. తన పేరెంట్స్ కి నలుగురు సంతానంలో చిన్న అమ్మాయి. తాను 6,7 ఏళ్లవయసులో డాన్సు నేర్చుకోవాలనుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి చెన్నైలోని భరతనాట్యం నేర్పించే గురువు వద్దకు వెళ్లింది. ఆయన వహీదాని చూసి మొదట తిరస్కరించాడు. తను ముస్లీం అమ్మాయి కావడంతో ఆయన మొదట తిరస్కరించాడు. తాను నేర్పించనంటూ అవమానించాడట. అయినా డాన్స్ పై తన కోరికని చంపుకోలేకపోయింది. అందుకోసం పోరాడింది. నిత్యం తన పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ద్వారా గురువుని రిక్వెస్ట్ చేస్తూనే వచ్చింది.

కొన్నాళ్లకి ఆ గురువు ఓకే చెప్పాడు. కానీ జాతకం ప్రకారం చెబుతానని వెల్లడించారు. ఆమె జాతకం ఏంటో ఎవరికీ తెలియదు, దీంతో బర్త్ డే డేట్ ఆధారంగా తానే జాతకం రాస్తానని కండీషన్‌ పెట్టాడు. అలా పుట్టిన రోజు తేదీ ఆధారంగా వహీదా జాతకాన్ని రాశాడు. అది రాసిన తర్వాత వహీదా రెహ్మాన్‌ జాతకం అద్భుతంగా వచ్చిందట. తాను డాన్స్ నేర్పించే చివరి, బెస్ట్ స్టూడెండ్‌ అని ఆ గురువు తెలిపారు. తను గొప్ప స్థాయికి వెళ్తుందని చెప్పాడట. ఆ విషయంలో ముంబయిలో ఓ డాన్స్ షోలో తెలిపింది వహీదా రెహ్మాన్‌. మాధురీ దీక్షిత్‌ అడగ్గా ఈవిషయాలు బయటపెట్టింది. 
 

అలాంటి అవమానాలు, తిరస్కారాలు దాటుకుని ఆమె ఈ స్థాయికి వచ్చింది. తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. గొప్ప నటిగా అవతరించింది. వందకు పైగా చిత్రాల్లో నటించింది. తను నటించిన చిత్రాల్లో చాలా వరకు సక్సెస్‌ కావడం విశేషం. ఐదు దశాబ్దాలకుపైగానే సినిమా పరిశ్రమకి విశేష సేవలందించినందుకుగానూ వహీదా రెహ్మాన్‌ని భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో గౌరవించారు. ఇప్పుడు సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. 
 

Latest Videos

vuukle one pixel image
click me!