విక్రమ్ ధృవ నక్షత్రమ్ నుంచి కమల్ విశ్వరూపం వరకు.. థియేటర్లలో రిలీజ్ కష్టాలు ఎదుర్కొన్న తమిళ సినిమాలు

First Published Nov 25, 2023, 11:27 AM IST

టాలీవుడ్ తో పోటీగా అటుతమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోలంతా రిలీజ్ లకు రెడీ అవుతున్నారు. ప్రతీ వారం  కొత్త సినిమాలు రిలీజ్ కు వస్తుండగా.. కొన్ని సినిమాలు రిలీజ్ కోసం సవాళ్లు ఎదురుకోక తప్పడం లేదు. ప్రస్తుతం ఆ లిస్ట్ లో చియాన్ విక్రమ్ దృవ నక్షత్రం వచ్చి చేరింది. ఇంతకీ రిలీజ్ అడ్డంకులు ఫేస్ చేసిన ఐదు తమిళ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. 
 

రిలీజ్  ఇబ్బందులు ఎదుర్కొంటుంది చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం మూవీ.  మొదటి నుంచి మంచి అంచనాలతో తెరకెక్కిన ఈసినిమా.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. ప్రమోషన్లు  కూడా జోరుగా సాగించింది సినిమా. ఈనెల 24న సినిమాను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాని సడెన్ గా ఈమూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అని చెప్పి..ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చారు. ఈసినిమాకు దర్శకుడైన  గౌతమ్ మీనన్ ఆర్థిక సమస్యలు సినిమా రిలీజ్ కు కి సమస్యగా మారాయి. ఆ సమస్యను పరిష్కరించేందుకు దర్శకుడు మరో 2 కోట్లు చెల్లించాల్సి ఉంది. దాంతో ఈమూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిది.
 

తమిళనాట రిలీజ్ కష్టాలు ఫేస్ చేసిన వారిలో శింబు అలియాస్ సిలంబరసన్ కూడా ఉన్నాడు. ఆయన నటించిన  టైమ్ ట్రావెల్  సినిమా మానాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా 2018లో స్టార్ట్ అయ్యింది. కానీ శింబుకు  సినిమా నిర్మాతలకు మధ్య వచ్చిన విభేదాల కారణంగా కొంత కాలం వాయిదా వేయక తప్పలేదు. అంతే కాదు ఇలా వాయిదా పడటం వల్ల నిర్మాత ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలా ఎన్నో ఇబ్బందులు పేస్ చేసి.. భారీ ప్రయత్నాల తరువాత ఎట్టకేలకు.. సినిమాను పూర్తి చేసి..  నవంబర్ 2021లో రిలీజ్ చేశారు. 

Latest Videos


శింబు నటించిన మరో సినిమాకు కూడా ఇలంటి ఇబ్బంది తప్పలేదు.  ఆయన  టైటిల్ రోల్ చేసిన రొమాంటిక్ కామెడీ 'వాలు.  విజయ్ చందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా కూడా రిలీజ్ కష్షాలు ఫేస్ చేయక తప్పలేదు. గతంలో  నిర్మించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాకపోవడంతో నిర్మాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాంతో ఈసినిమాపై ఆ ప్రభావం గట్టిగా పడింది. అయితే 3 ఏళ్ళ పోరాటం తరువాత ఈసినిమా  2015లో  రిలీజ్ అయ్యింది. 
 

ఈ రిలీజ్ కష్టాలను తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఫేస్ చేశాడు. విజయ్ మలయాళ సినిమా బాడీ గార్డ్ ను తమిళంలో రీమేక్ చేశారు. ఈ రీమేక్ ను దర్శకుడు సిద్దిక్ కావలన్ తెరకెక్కించారు.  కావలన్' బాక్సాఫీస్ వద్ద 'ఆడుకాలం', 'సిరుత్తై' చిత్రాలతో ఢీకొంది. అయితే విజయ్ నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టకపోవడంతో, 'కావలన్' కంటే ఇతర రెండు చిత్రాలకు పంపిణీదారులు ప్రాధాన్యతనిచ్చారు. అయితే, నిర్మాతలు సినిమా విడుదల కోసం తీవ్రంగా పోరాడారు మరియు 'కావలన్' ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా  అంటే జనవరి 14, 2011 రిలీజ్ అయ్యింది.

vishwaroopam

ఇక తమిళనాట రిలీజ్ కష్టాలు గట్టిగా ఫేస్ చేసిన హీరో కమల్ హాసన్.  తన సొంత దర్శకత్వం వహించిన 'విశ్వరూపం'లో  లీడ్ రోల్ చేసి మెప్పించాడు. అయితే ఈ సినిమా ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని వివాదం చెలరేగింది. 'విశ్వరూపం' సినిమాపై బెదిరింపు కారణంగా తమిళనాడు ప్రభుత్వం సినిమాపై నిషేధం జారీ చేయడంతో.. వివాదం ఇంకా పెద్దది అయ్యింది. దాంతో మూవీ రిలీజ్ గురించి పెద్ద పోరాటం చేశారు కమల్ హాసన్. తాను సంపాదించిన మొత్తం సినిమాపై పెట్టాడు కమల్.  చాలా పోరాటం తరువాత ఈసినిమా రిలీజ్ అయ్యింది. అది కూడా జనవరి 25, 2011న సొంత రాష్ట్రం మినహా ఇతర లొకేషన్లలో విడుదలైంది. ఆతరువాత  2011 ఫిబ్రవరి 3న తమిళనాడులో విడుదలయ్యింది సినిమా. 

click me!