Vijay Trisha: విజయ్.. హీరోయిన్ త్రిషతో కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరయ్యారు. దీంతో వీరి బంధం బహిర్గతమయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు సీనియర్ నటుడు రామరాజన్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. విజయ్‌పై సెటైర్లు వేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ పెట్టాక వివాదాలు ఎక్కువయ్యాయి. తాజాగా, విజయ్ భార్య సంగీత చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టు కోర్టులో కేసు వేశారని వార్తలొచ్చాయి. పెళ్లి బంధాన్ని మీరి విజయ్ ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని సంగీత ఆ పిటిషన్‌లో చెప్పినట్లు సమాచారం.
26
2021లోనే విజయ్ వ్యవహారంపై ఆరోపణలు చేసిన సంగీత
2021 ఏప్రిల్‌లో విజయ్‌కి ఉన్న ఆ సంబంధం గురించి తనకు తెలిసిందని, తెలిశాక కూడా అది కొనసాగిందని సంగీత తన పిటిషన్‌లో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల తాను మోసపోయానని, 2021 నుంచి ఒకే ఇంట్లో ఉన్నా వేర్వేరుగా జీవిస్తున్నామని ఆమె పేర్కొన్నారట. ఈ పరిస్థితి తనను, తన పిల్లలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని కూడా చెప్పినట్లు సమాచారం.
36
త్రిషతో పెళ్లి రిసెప్షన్‌కి వెళ్లి విజయ్
ఈ వివాదం నడుస్తుండగానే, నిన్న చెన్నైలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, నటి త్రిషాతో కలిసి కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఇది ఆయన రాజకీయ, సినిమా కెరీర్‌పై ప్రభావం చూపుతుందని చర్చ జరుగుతోంది.
ఈ ఫంక్షన్‌లో తీసుకున్న ఫొటోను త్రిషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎప్పుడూ నా వాళ్లుగా ఉన్నందుకు థ్యాంక్స్' అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టులో తన మేకప్, డ్రెస్సింగ్‌కు సాయం చేసిన వాళ్లను కూడా ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ వివాదాన్ని మరింత పెంచింది.
56
తన భార్యతో రామరాజన్ విడాకుల ప్రస్తావన
ఇదే సమయంలో, సీనియర్ నటుడు రామరాజన్‌కు సంబంధించిన ఓ సంఘటన సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆయన తన భార్య నళినితో విడాకుల కోసం కోర్టుకు వచ్చినప్పుడు, రిపోర్టర్లు ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు అడిగారు. దానికి రామరాజన్, 'నళిని నా భార్య. నా భార్య గురించి మీతో మాట్లాడటం పద్ధతి కాదు' అని చెప్పి వెళ్లిపోయారు.
66
రామరాజన్‌కి ఉన్న సంస్కారం విజయ్‌కి లేదా?
విడాకుల తర్వాత కూడా రిపోర్టర్లు అదే ప్రశ్న అడిగితే, 'ఇప్పుడు ఆమె వేరే వ్యక్తి, నేను వేరే వ్యక్తి. ఇంకొకరి కుటుంబం గురించి మాట్లాడటం సంస్కారం కాదు' అని ఆయన సమాధానమిచ్చారట. ఈ సంఘటనను చూపిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా, కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవడమే నిజమైన మనిషి లక్షణమని అంటున్నారు. అదొక సంస్కారం అని చెబుతున్నారు. ఇదే విషయంపై నెటిజన్లు విజయ్‌పై సెటైర్లు వేస్తున్నారు. రాజరాజన్‌ని చూసి నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు.