Jana Nayagan Censor: 'జననాయగన్' సినిమా సెన్సార్ బోర్డుతో పెద్ద యుద్ధమే చేసింది. చివరికి 'A' సర్టిఫికెట్ దక్కించుకుంది. క్లైమాక్స్‌తో సహా 12 కీలక మార్పులు చేసినా, సినిమా నిడివి 3 గంటలు ఉండటం విశేషం.
తమిళ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ 'జననాయగన్'(జన నాయకుడు) సినిమా సెన్సార్ అడ్డంకులను దాటి 'A' సర్టిఫికెట్ పొందింది. కానీ ఈ సర్టిఫికెట్ కోసం చిత్ర బృందం సెన్సార్ బోర్డు (CBFC)తో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. సినిమాలోని రాజకీయ అంశాల తీవ్రత చూసి, కథాగమనాన్ని మార్చే స్థాయిలో సెన్సార్ బోర్డు చాలా సన్నివేశాలను తొలగించింది.
26
జననాయకుడు మూవీలో మేజర్ కట్స్
తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలను గుర్తుచేసే పదాలు, చిహ్నాలను పూర్తిగా మ్యూట్ చేశారు. ప్రస్తుత రాజకీయాలను విమర్శిస్తూ విజయ్ చెప్పే కొన్ని పదునైన డైలాగ్స్ ఆడియోను తొలగించారు. ఎన్నికల కుట్రలను బయటపెట్టే కొన్ని భావోద్వేగ సంభాషణలను కూడా తీసేశారు. నిజమైన రాజకీయ నాయకుల పేర్లను పోలిన పేర్లు వచ్చినప్పుడు ఆడియో కట్ చేశారు.
36
జననాయకుడులో కట్ అయిన సీన్లు ఇవే
సినిమాలో జాతీయ జెండాను తప్పుగా చూపించారని సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. దీంతో ఆ సన్నివేశం నేపథ్యాన్ని, వివరాలను పూర్తిగా మార్చేశారు. చట్టం, పోలీస్, ప్రభుత్వ భద్రతా దళాల పనితీరును ప్రశ్నించే కొన్ని వివాదాస్పద సన్నివేశాలను కూడా మార్చారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను తప్పుగా చూపించే డైలాగ్స్‌ను సైతం సెన్సార్ బోర్డు తొలగించింది.
సినిమాలోని భారీ రాజకీయ నిరసనలు, పోరాట సన్నివేశాల నిడివిని శాంతిభద్రతల కారణాలతో తగ్గించారు. ఫైట్ సీన్స్‌లో హింస ఎక్కువగా ఉండటంతో, థియేటర్లలో టెన్షన్ పుట్టించే చాలా షాట్స్‌ను కత్తిరించారు. రక్తపు మరకలు, క్రూరమైన దాడుల నిడివిని సగానికి తగ్గించారు. పాత్రలు మాట్లాడే పరుషమైన మాటలన్నింటినీ మ్యూట్ చేసి మ్యూట్ చేశారు.
56
జన నాయకుడు నిడివి
సినిమాకు కీలకమైన క్లైమాక్స్‌లో కూడా సెన్సార్ బోర్డు జోక్యం చేసుకుంది. రాజకీయంగా ప్రభావం చూపే కొన్ని డైలాగ్స్, సంకేతాలను బోర్డు ఆదేశాల మేరకు మార్చారు. సెన్సార్ బోర్డు ఏకంగా 12 మార్పులు చేసి, చాలా సీన్లు కట్ చేసినా సినిమా నిడివి తగ్గలేదు. సెన్సార్ తర్వాత 'జననాయగన్' అధికారిక రన్నింగ్ టైమ్ 3 గంటల 3 నిమిషాలు (183 నిమిషాలు)గా ఖరారైంది.
66
జన నాయకుడికి అన్ని అడ్డంకులు క్లీయర్
సుదీర్ఘ పోరాటం తర్వాత సెన్సార్ సమస్యలు ముగిశాయి. దీంతో 'జననాయగన్' కొత్త రిలీజ్ డేట్ ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని కోలీవుడ్ వర్గాలు, విజయ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే పైరసీకి గురయ్యింది. మిలియన్‌కిపైగా జనం చూశారని టాక్. మరి ఇప్పుడు థియేటర్లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.