నయనతార సరోగసి వివాదం.. విగ్నేష్ శివన్ పరోక్ష వ్యాఖ్యలు, తన భార్య నాశనం కోరుకునేది ఎవరు ?

Published : Oct 12, 2022, 03:50 PM IST

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. 

PREV
16
నయనతార సరోగసి వివాదం.. విగ్నేష్ శివన్ పరోక్ష వ్యాఖ్యలు, తన భార్య నాశనం కోరుకునేది ఎవరు ?

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు.  నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.   

26

పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే సరోగసి ప్లాన్ చేసుకున్నారు. ఇండియాలో సరోగసి విధానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొందరు ఇది బ్యాన్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వివాదంగా మారింది. 

36

నయనతార, విగ్నేష్ శివన్ దంపతులపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు సమర్పించాలని ఇప్పటికే తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి కోరినట్లు వార్తలు వచ్చాయి. 

46

నయనతార సరోగసి వివాదంగా మారుతున్న సమయంలో విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లు ఆసక్తికరంగా మారాయి. పరోక్ష వ్యాఖ్యలతో విగ్నేష్ శివన్ కొన్ని పోస్ట్ లు పెట్టారు. నీ చుట్టూ ఉన్నవారిని గమనించు. నీకు తోడుగా ఉంటూ నీ క్షేమం కోరుకునే వారే నిజమైన నీవాళ్ళు. ఇది ఎప్పటికి వాస్తవం అంటూ విగ్నేష్ శివన్ పరోక్షంగా కామెంట్స్ పెట్టాడు. 

56

అంటే నయనతార చుట్టూ ఉన్న మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ? అనే నాశనం కోరుకునేది ఎవరు అంటూ అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. మరొక పోస్ట్ లో జరగాల్సిన అన్నీ సరైన సమయంలో జరుగుతాయి. కాస్త ఓపికగా ఉండు అంటూ కామెంట్స్ పెట్టాడు. 

66

విగ్నేష్ శివన్ సూటిగా ఏం చెప్పదలుచుకున్నాడు అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా సరోగసి వల్ల నయన్, విగ్నేష్ దంపతులకు చిక్కులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. సరోగసి ద్వారా నయనతారఎం విగ్నేష్ ఇద్దరు మగ కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. వారికి ఉయిర్, ఉలగన్ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories