Prabhas: ప్రభాస్ పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. అతడితో సినిమాలు చేస్తే నిర్మాతల పని అంతే..

Published : Apr 03, 2022, 10:12 AM IST

ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. బాలీవుడ్ ఖాన్స్ కి సైతం సాధ్యం కాని విధంగా ప్రభాస్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ స్వరూపమే మారిపోయింది.

PREV
16
Prabhas: ప్రభాస్ పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. అతడితో సినిమాలు చేస్తే నిర్మాతల పని అంతే..
Prabhas

ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. బాలీవుడ్ ఖాన్స్ కి సైతం సాధ్యం కాని విధంగా ప్రభాస్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ స్వరూపమే మారిపోయింది. ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ రావడంతో నిర్మాతలు అతడి కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్ వెంట పడుతున్నాయి. 

26
Prabhas

ఇదిలా ఉండగా ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అయింది. దీనితో టాలీవుడ్ హీరోల జాతకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో పలువురు జ్యోతిష్యులు ప్రభాస్ జాతకాన్ని తిరగేస్తూ వారికి తోచిన విధంగా ప్రిడిక్షన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా వేణు స్వామి తన వివాదాస్పద ప్రిడిక్షన్స్ తో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. 

36
Prabhas

నాగ చైతన్య, సమంత విడిపోతారని కూడా వేణు స్వామి గతంలో తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. 

 

46
Prabhas

ప్రభాస్ తో సినిమాలు నిర్మించాలనుకునే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభాస్ నటించబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారబోతున్నాయి. నిర్మాతలు చాలా నష్టపోతారు అని వేణు స్వామి అన్నారు. ప్రభాస్ తో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించవద్దని వేణు స్వామి అన్నారు. 

56
Prabhas

దీనితో వేణు స్వామిపై ప్రభాస్ అభిమానులు ట్రోలింగ్ షురూ చేశారు. వేణు స్వామి చెప్పిన జాతకం నమ్మాల్సిన అవసరం లేదని.. ఆయన చెప్పిన జాతకాలు ఖచ్చితంగా జరగలేదని అంటున్నారు. కేవలం పబ్లిసిటీ, అటెన్షన్ కోసమే వేణు స్వామి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. 

66
Prabhas

ఇటీవల ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. 

click me!

Recommended Stories