గెటప్‌ శ్రీను భార్యతో వెంకీ లవ్‌.. ఇదేం దారుణం సామి.. `సైంధవ్‌`పై ట్రోల్స్..

First Published Jan 13, 2024, 1:29 PM IST

విక్టరీ వెంకటేష్‌ నటించిన `సైంధవ్‌` చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా నేడు విడుదలైంది. ఈ మూవీపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్రకి సంబంధించి ఇప్పుడు రచ్చ అవుతుంది. 
 

వెంకటేష్‌ ప్రతిష్టాత్మకంగా నటించిన మూవీ `సైంధవ్‌`. ఇది తన 75వ మూవీ కావడం విశేషం. దీంతో ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. `హిట్‌` చిత్రాల దర్శకుడు శైలేష్‌ కొలను రూపొందించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నెగటివ్‌ రోల్‌ చేశాడు. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రీయా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నేడు శనివారం సంక్రాంతి పండగ స్పెషల్‌గా విడుదలైంది. 

ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. చాలా వరకు నెగటివ్‌ టాక్‌ ఉంది. సంక్రాంతికి.. పండగ లాంటి సినిమాని కోరుకుంటారు. కానీ ఇది పూర్తి యాక్షన్‌ మూవీ. కూతురు సెంటిమెంట్‌తో రూపొందించారు. ఎమోషన్స్ వర్కౌట్‌ కాలేదని, శైలేష్‌ సినిమాని సరిగా డీల్‌ చేయలేదని, చాలా లాజిక్‌లు వదిలేశారని అంటున్నారు. యాక్షన్‌ సీన్లు కూడా తేలిపోయాయి. ఏమాత్రం ఫీల్‌ లేదు. వీడియో గేమ్‌ని చూసినట్టే ఉన్నాయి.

Latest Videos


చివర్లో క్లైమాక్స్ లో కూతురు సెంటిమెంట్‌ కాస్త ఓకే అనిపించినా, అది మరీ ఓవర్‌గా అనిపించింది. దీంతో వెంకీకిది రాంగ్‌ ఛాయిస్‌ అంటున్నారు. అదే సమయంలో సంక్రాంతికి ఇలాంటి సినిమా రాంగ్‌ అంటున్నారు. పైగా వెంకీ మార్క్ ఫన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిస్‌ కావడంతో చాలా వరకు డిజప్పాయింట్‌ అవుతున్నారు. అసలే సినిమాకి బజ్‌ లేదు, ఇప్పుడు ఈ నెగటివ్‌ టాక్‌ సినిమాపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. 
 

ఇదిలా ఉంటే సినిమాలో వెంకీ పాత్రని సరిగా చూపించలేదు శైలేష్‌. ఆయన గతాన్ని సరిగా చెప్పలేకపోయాడు. ఏదో చిన్న క్లిప్స్ లతో ఎలివేషన్‌ ఇచ్చినా, దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పలేదు. దీంతో ఇంకా వస్తుందేమో అని వెయిట్‌ చేసే ఆడియెన్‌కి నిరాశే ఎదురవుతుంది. చాలా పాత్రలను సగంలో వదిలేశాడు, ప్రధానమైన కోర్‌పాయింట్‌ ఏరియాని చూపించలేదు, ఎంత సేపు కంటెనర్ల గురించే రచ్చ. అది చాలా చిరాకు పెడుతుంది. 
 

దీనికితోడు ఇందులో ఒక బ్లండర్‌ చేశాడు దర్శకుడు. వెంకీకి పెయిర్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ని పెట్టాడు. కానీ ఆమెని కమెడియన్‌ గెటప్‌ శ్రీనుకి వైఫ్‌గా చూపించాడు. ఆయనతో ఆమె విడిపోతుంది. చిత్ర హింసలు పెడితే అతన్నుంచి దూరంగా ఉంటుంది. వెంకటేష్‌కి దగ్గరగా ఉంటుంది. వెంకీ కూతురుకి సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా పొద్దున లేస్తే వెంకీ ఇంట్లోనే ఉంటుంది. ఆయనపై ఆమెకి ప్రేమ ఉంటుంది, ఆమెపై ఆయనకు ప్రేమ ఉంటుంది. కానీ ఆమె నేపథ్యం పెట్టిన విధానంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

వెంకీ ఫ్యాన్స్ సైతం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ని సింగిల్‌గా చూపించినా ఓకే, లేదంటే భర్త చనిపోయినట్టు చూపించినా ఓకే, కానీ ఇలా కమెడి నటుడి పాత్రకి వైఫ్‌గాచూపించడం, ఆమెతో వెంకీ క్లోజ్‌గా ఉండటం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్‌ లేకపోయినా ఫర్లేదుగానీ, వెంకీ లాంటి పెద్ద స్టార్‌, ఓ కమెడియన్‌ వైఫ్‌తో లవ్‌ ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇలాంటి సిల్లీ సీన్లు ఈ మూవీలో చాలా ఉన్నాయి. ఆర్య పాత్రని ఎందుకు పెట్టాడో తెలియదు, రుహానీ పాత్రకి కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. పైగా దీనికి పార్ట్ 2 ప్రకటించడం గమనార్హం. 

click me!