మీరు ప్రచారం చేసే కంపెనీలు దేశాన్ని, ప్రజలని ముంచేస్తున్నాయి.. అమితాబ్ పై సజ్జనార్ షాకింగ్ కామెంట్స్

First Published Mar 31, 2023, 10:39 AM IST

దిశా ఎన్కౌంటర్ తో దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ సంచలనం సృష్టించారు. దిశా ఎన్కౌంటర్ తో సజ్జనార్ కి అభిమానులు లక్షల్లో ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఆయన్ని ఫాలో అవుతున్నారు. 

దిశా ఎన్కౌంటర్ తో దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ సంచలనం సృష్టించారు. దిశా ఎన్కౌంటర్ తో సజ్జనార్ కి అభిమానులు లక్షల్లో ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఆయన్ని ఫాలో అవుతున్నారు. అప్పటి నుంచి సజ్జనార్ ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 

ప్రస్తుతం సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ సేవలని క్వాలిటీని పెంచుతూ సజ్జనార్ ప్రయాణికుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చారు. సోషల్ మీడియా వేదిక ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రాముఖ్యతని తెలియజేస్తున్నారు. 

తరచుగా సజ్జనార్ సామాజిక అంశాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా సజ్జనార్ బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ అందరికి తెలిసిందే. పదుల సంఖ్యలో కంపెనీలకు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. 

అమితాబ్ ప్రచారం చేస్తే ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా జనాల్లోకి బాగా వెళుతుంది. అమితాబ్ కి ఉన్న క్రేజ్ అది. దీనితో అధిక మొత్తం పారితోషికం ఆఫర్ చేసి కంపెనీలు అమితాబ్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. 

అయితే అమితాబ్ ప్రచారం చేస్తున్న ఆమ్వే అనే కంపెనీపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ మేరకు అమితాబ్ కి రిక్వస్ట్ చేశారు. 'సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి, ఇతర సెలెబ్రెటీలకు నేను ఒక విన్నపం చేస్తున్నా. ప్రజలని మోసం చేసే, దేశ ఆర్థిక వ్యవస్థని ముంచేసే ఫ్రాడ్ కంపెనీలకు ప్రచారం కల్పించవద్దు' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి అమితాబ్ ఆమ్వే కంపెనీకి ప్రచారం చేస్తున్న పిక్ పోస్ట్ చేశారు. 

మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీగా ఉన్న ఆమ్వేపై 2022లో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ పలు మోసాలకు పాల్పడుతుండటంతో ఈడీ.. ఆ కంపెనీ ఆస్తులని జప్తు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. అమితాబ్ బచ్చన్ ఈ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నారు. బాలీవుడ్ తారలు చేస్తున్న పలు యాడ్స్ తరచుగా వివాదం అవుతూ ఉంటాయి. 

అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు చేస్తున్న యాడ్స్ గతంలో వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోలు ప్రజలకు నష్టం చేసే కంపెనీలకు దూరంగా ఉండాలని చాలా కాలంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Latest Videos

click me!