ఏంటది అని అడుగుతాడు విశ్వనాథం. ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ సార్ అని వసుధార చెప్పేసరికి ఏంజెల్, విశ్వనాథం ఇద్దరు షాక్ అవుతారు. స్పృహలోకి వచ్చిన రిషి కారు సడన్గా ఆపుతాడు. ఇంతసేపు నేను బ్రమలో ఉన్నానా అనుకుంటాడు. నేను ఆ వసుధారతో మాట్లాడకపోతే తను ఇంటికి వచ్చినా వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళందరికీ గతాన్ని చెప్పేస్తుంది అనుకుంటూ వసుధార ఇంటికి వెళ్తాడు.