వరుణ్-లావణ్య ప్రేమ కహానీ... ఐదేళ్ల క్రితమే మొదలై, ఆపై రహస్య ప్రయాణం చేసి!

Sambi Reddy | Updated : Jun 09 2023, 08:32 PM IST
Google News Follow Us

నేడు లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం. కాగా వీరి ప్రేమ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. వరుణ్, లావణ్య ప్రేమ కథలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 
 

18
వరుణ్-లావణ్య ప్రేమ కహానీ... ఐదేళ్ల క్రితమే మొదలై, ఆపై రహస్య ప్రయాణం చేసి!
Lavanya Tripathi - Varun Tej Engagement

హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుక నేడు ఘనంగా జరుగుతుంది. రామ్ చరణ్ దంపతులతో పాటు మెగా కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.  లావణ్య మెగా కోడలు కావడం బిగ్ సర్ప్రైజ్. గత రెండేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం చక్కర్లు కొడుతున్నా... ఆసక్తికర విషయాలు అనేకం ఉన్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం లావణ్య-వరుణ్ తేజ్ ల ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం...

28
Image: Instagram

లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2017లో విడుదలైంది. ఆ చిత్ర సెట్స్ లోనే వీరికి పరిచయం ఏర్పడింది. మొదట అది స్నేహంగా మారింది. తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారట. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కావడంతో ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. 
 

38
Lavanya Tripathi - Varun Tej Engagement

2018లో అంతరిక్షం మూవీ కోసం మరోసారి కలిశారు. అప్పుడు మరింత దగ్గరయ్యారట. వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి చేసుకుందామా? అని అడిగేశాడట. వరుణ్ ప్రపోజల్ ని లావణ్య త్రిపాఠి ఒప్పుకున్నారు. ఎస్ అని చెప్పారట. అప్పటి నుండి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. వీరి రిలేషన్ చాలా కాలం గోప్యంగా ఉంది. మీడియాలో కానీ చిత్ర వర్గాల్లో కానీ చర్చకు రాలేదు. 
 

Related Articles

48
Varun Tej- Lavanya Tripathi


2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరిగింది. మెగా కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పెళ్ళికి ఆహ్వానం దక్కింది. పరిశ్రమ నుండి లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. మహామహులకు దక్కని ఆహ్వానం లావణ్య త్రిపాఠికి దక్కడమేంటనే అనుమానాలు మొదలయ్యాయి. 
 

58

ఇక తరచుగా కలిసి కనిపించడం, ప్రైవేట్ పార్టీల్లో సందడి చేయడం చూసి పరిశ్రమ వర్గాలు కూపీలాగాయి. అలా రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్-లావణ్య అఫైర్ నడుపుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ వార్తలను లావణ్య త్రిపాఠి ఖండించడం విశేషం. ఒక ప్రక్క పీకల్లోతు ప్రేమలో ఉండి, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అబద్దం చెప్పారు. ఒక సందిగ్ధం కొనసాగుతుండగా ఏకంగా ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించి షాక్ ఇచ్చారు. 
 

68
Varun Tej- Lavanya Tripathi


ఆ విధంగా లావణ్య-వరుణ్ ల పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. నేడు హైదరాబాద్ లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుంది. రామ్ చరణ్, ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారని సమాచారం. 
 

78


కాగా లావణ్య త్రిపాఠి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్లో లావణ్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం విశేషం. అలాగే ఆమె చివరి చిత్రం హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది. ఇకపై ఆమె నటనకు గుడ్ బై చెప్పే అవకాశం కలదు. 
 

88

ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో మరో చిత్రం చేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
 

Recommended Photos