Ghani Review: వరుణ్ తేజ్ 'గని' ప్రీమియర్ షో టాక్.. బాక్సింగ్ పంచ్ అదిరింది, కానీ..

Published : Apr 08, 2022, 06:25 AM IST

డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చితం 'గని'.  ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు.

PREV
16
Ghani Review: వరుణ్ తేజ్ 'గని' ప్రీమియర్ షో టాక్.. బాక్సింగ్ పంచ్ అదిరింది, కానీ..
Ghani

డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చితం 'గని'.  ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటించింది. 

26
Ghani

మంచి అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా యూఎస్ లో గని ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తోందో తెలుసుకుందాం. గని చిత్రం 157 నిమిషాల నిడివితో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ప్రారంభం డీసెంట్ గా ఉంటుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా ఎంట్రీ ఇస్తాడు. 

36
Ghani

ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయంకే ఎక్కువ టైం పడుతుంది. దీనితో అసలైన కథ మొదలు కావడానికి బాగా ఆలస్యం అవుతుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సో సో గా సాగుతుందని ప్రేక్షకులు అంటున్నారు. 

46
Ghani

ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని బలమైన సన్నివేశాలు పడ్డాయి. దీనితో సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. కానీ కథ ఫ్లాట్ గా వెళుతున్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంటుంది. వరుణ్ తేజ్ బాక్సింగ్ ఫైట్స్, బాక్సింగ్ కోసం వరుణ్ తేజ్ తీసుకునే శిక్షణ బావుంటాయి. 

56
Ghani

కానీ ఒక స్పోర్ట్స్ డ్రామాకు కావలసిన కొత్తదనం లేదని అంటున్నారు. ఓవరాల్ గా రొటీన్ స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. వరుణ్ తేజ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. 

 

66
Ghani

సెకండ్ హాఫ్ లో స్పోర్ట్స్ తెరవెనుక జరుగుతున్న బెట్టింగ్ బాగోతం, క్రీడలపై బెట్టింగ్ చూపుతున్న ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేసారు. అలాగే ఇది బాక్సింగ్ కథ అయినప్పటికీ కాస్త రివేంజ్ మిక్స్ అయి ఉంటుంది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ ఈ చిత్రానికి కీలకం అని, గని చిత్ర బాక్సాఫీస్ భవిష్యత్తు సెకండాఫ్ మీదే డిపెండ్ అయి ఉందని ప్రేక్షకులు అంటున్నారు. 

click me!

Recommended Stories