అజిత్ వర్సెస్ విజయ్.. తొమ్మిదేండ్ల తర్వాత తమిళంలో మరో బిగ్గెస్ట్ క్లాష్!

Published : Oct 28, 2022, 05:37 PM IST

తమిళ స్టార్స్ విజయ్, అజిత్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వీరి అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ఫ్యాన్స్ తోపాటు ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలకు సిద్ధం అవుతున్న అజిత్, విజయ్ సినిమాలు రెండు ఒకేసారి వచ్చే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

PREV
16
అజిత్ వర్సెస్ విజయ్.. తొమ్మిదేండ్ల తర్వాత తమిళంలో మరో బిగ్గెస్ట్ క్లాష్!

తమిళ స్టార్స్ విజయ్ దళపతి, అజిత్ కుమార్ కు ఎంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి చిత్రాలు కేవలం తమిళం వరకే కాకుండా.. ఇతర భాషల్లోనూ డబ్ కావడంతో ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 

26

ప్రస్తుతం అజిత్, విజయ్ తమ కేరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో వీరి పాపులారిటీ మరింతగా పెరగడంతో పాటు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. దీంతో ఈ స్టార్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

36

దీంతో... కోలీవుడ్ లో తొమ్మిదేండ్ల తర్వాత మరోసారి ఎపిక్ క్లాష్ జరగబోతోంది. నువ్వా నేనా అంటూ అజిత్, విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే హంగామా క్రియేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికే అజిత్  నటిస్తున్న Thunivu మరియు విజయ్ నటిస్తున్న Varisu ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

46

ఇప్పటికే విజయ్ నటిస్తున్న తెలుగు చిత్రం ‘వారసుడు’ తమిళంలో ‘వరిసు’గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తమిళంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘తునివి’ కూడా సంక్రాంతికే రానున్నట్టు గట్టి రాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్లపై మరింత ఆసక్తి నెలకొంది.
 

56

తొమ్మిదేండ్ల కింద సంక్రాంతి కానుకగా వచ్చిన విజయ్, అజిత్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో బిగ్ క్లాష్ ఏర్పడింది. ప్రస్తుతం సినిమాల పోటీ ఏర్పడటం.. అందులోనూ కోలీవుడ్ స్టార్స్ సినిమాలు ఒకే మూమెంట్ లో విడుదల కాబోతుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. 
 

66

2014లో వచ్చిన విజయ్ ‘జిల్లా’, అజిత్ ‘వీరం’ జవనరి 10నే విడుదలయ్యాయి. ప్రస్తుతం ‘వరిసు’,‘తునివు’ కూడా జనవరి లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ‘వారసుడు’ చిత్రాన్న జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఇక అదే రోజున ‘తునివు’ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

click me!

Recommended Stories