తమిళ నటి, అందాల భామ వాణి భోజన్ సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది. బుల్లితెరపై కెరీర్ మొదలు పెట్టిన వాణి భోజన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తోంది. హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. కానీ వాణి భోజన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది.
కుర్రాళ్ళ మతులు చెడగొట్టేలా వాణి భోజన్ చేస్తున్న గ్లామర్ విధ్వంసం అంతా ఇంతా కాదు. వాణి భోజన్ తెలుగులో మీకు మాత్రమే చెప్తా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడం వల్ల వాణికి ఎలాంటి గుర్తింపు లభించలేదు. వాణి భోజన్ కి సూపర్ హిట్స్ అయితే లేవు కానీ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా రాణిస్తోంది.
తాజాగా వాని భోజన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో నటీమణులకు వేధింపులు ఎదురవుతున్న సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉంటున్నాం. అదే విధంగా నటీమణులపై కొందరు ఏం చెప్పినా చేయాల్సిందే అన్నట్లుగా బలవంతం చేస్తుంటారు. డబ్బుతోనో, అవకాశాల పేరుతోనో లోబరుచుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి.
వాణి భోజన్ కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైందట. తాను నటించడానికి అంగీకరించిన ఒక చిత్రంలో అనవసరంగా ఒక సీన్ క్రియేట్ చేశారు. కథకు ఆ సన్నివేశానికి ఎలాంటి సంబంధం లేదు. అది బెడ్ రూమ్ లో సాగే శృంగార భరిత సన్నివేశం. ఈ చిత్రంలో ఆ సన్నివేశం ఉందని నాకు ముందుగా చెప్పనేలేదు. సెట్స్ కి వెళితే ఉన్నపళంగా బెడ్ రూమ్ సీన్ లో నటించాలని అడిగారు.
నటించను అని చెప్పినా బలవంతం చేశారు. దీనితో నాకు కోపం వచ్చింది. ఆ సీన్ లో నటించే ప్రసక్తే లేదు.. డబ్బు కోసం దిగజారను.. మీ డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పి వచ్చేశానని వాణి భోజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నెటిజన్లు వాణి భోజన్ చేసిన పనిని అభినందిస్తూ ఆమెకి మద్దతు తెలుపుతున్నారు. వాణి భోజన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. వెండి తెరపై గ్లామర్ గా కనిపించేందుకు సిద్దమే కానీ.. కథకు ఏమాత్రం సంబంధం లేని విధంగా రొమాన్స్ చేయాలంటే ఒప్పుకోను అని వాణి అంటోంది.