`తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీకి మధ్య చిన్న అవరోధం ఉంది. తెలుగమ్మాయిలు సినిమాలకు సరిగ్గా సపోర్ట్ చేయరు. ఆటిట్యూడ్ చూపిస్తారు అనే ముద్ర మాపై ఎప్పటినుంచో ఉంది. దాని వల్ల అవకాశాలు రావడం కష్టమవుతోంది` అని అంటోంది `వకీల్‌సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల.
పవన్ కళ్యాణ్ హీరోగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన `వకీల్‌సాబ్` చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం అనన్య మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

215
ఈ సినిమా కోసం ఆడిషన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అని ముందు తెలియదు. మూడు రౌండ్లు ఆడిషన్ చేశారు. తెలిశాక సర్ ప్రైజ్ అయ్యాను. జీవితంలో ఊహించని ఆనందం ఎదురైతే మనం వెంటనే దాన్ని నిజం అనుకోము. ఇదోదే కల అనిపిస్తుంటుంది. `వకీల్ సాబ్` చిత్రంలో నా సెలెక్షన్ జరిగిన తర్వాత కూడా అదే ఫీలింగ్ కలిగింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో రిజెక్షన్స్ చూసి వచ్చాను కాబట్టి, కొన్ని రోజులు అయ్యాక గానీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటిస్తున్నాను అనే నమ్మకం కలగలేదు.

315
తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావు, ముందు తమిళం లాంటి లాంగ్వేజ్ చిత్రాలు చేసి తర్వాత ఇక్కడికి వస్తే గౌరవం ఉంటుందని మాలాంటి కొత్త హీరోయిన్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతుంటాయి. కానీ `వకీల్ సాబ్` తెలుగు అమ్మాయిలకు ఒక హోప్ ఇచ్చింది.

415
పవన్ కళ్యాణ్ గారితో సెట్ లో గడిపిన సమయం మర్చిపోలేను. పవన్ గారు చెప్పే విషయాలు ఇన్ స్పైరింగ్ గా ఉండేవి. సరదాగా మనం మాట్లాడుకునే విషయాలు మాట్లేందుకు ఆయన ఆసక్తి చూపించరు. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఏపీ లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఆ విషయం గురించి పవన్ గారు నాతో మాట్లాడారు. దిశ ఇన్సిడెంట్ లాంటివి అమ్మాయిల మీద జరిగినప్పుడు `నేనేమీ చేయలేను, నాకేమీ శక్తి లేదు అనుకోవద్దు నీ ప్రార్థనను యూనివర్స్ కు పంపించు. అది కూడా ప్రభావం చూపిస్తుంద`ని చెప్పేవారు. ఆయనతో జరిగిన ఇలాంటి రెండు మూడు డిస్కషన్స్ మర్చిపోలేను.

515
పవన్ కళ్యాణ్ తో మొదట్లో భయంగానే ఉండేది. కోర్టు సీన్స్ జరిగేప్పుడు నేను భయపడుతున్నాను అనే విషయం తెలుసుకుని నాతో మాట్లాడారు. ``మల్లేశం` సినిమా గ్లింప్స్ లా చూశాను. బాగా నటించవు` అని చెప్పారు. నేను ఎక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. ఏం చదివాను, ఏ సినిమాలు చేస్తున్నాను అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సార్ తో నటించడం కంఫర్ట్ గా అనిపించింది.

615
కోర్ట్ సీన్ చేసేప్పుడు పవన్ గారితో కాంబినేషన్ లో నటించాను. అప్పుడు నా నటన చూసి, మీ యాక్టింగ్ లో ఎమోషన్ బాగా ఉంది. సీన్ రిపీట్ చేసినా అదే ఎమోషన్ లో ఉంటున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ ప్రశంసకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

715
తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీకి మధ్య చిన్న అవరోధం ఉంది. తెలుగమ్మాయిలు సినిమాలకు సరిగ్గా సపోర్ట్ చేయరు. ఆటిట్యూడ్ చూపిస్తారు అనే ముద్ర ఉంది. దాని వల్ల అవకాశాలు రావడం కష్టమవుతోంది. అంతకుమించి ఇండస్ట్రీలో మాకేం ఇతర సమస్యలు లేవు. సినిమా నచ్చితే నటించడానికి హద్దులేం పెట్టుకోలేదు. ఇలాగే కనిపించాలనే రూల్స్ నాకు లేవు.

815
వకీల్ సాబ్ సినిమా సమాజం మీద ప్రభావం చూపించాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక మార్పు తేవాలి, తెస్తుంది. మన ముందు తరంలో అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలనే తేడా స్పష్టంగా ఉండేది. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరైన దారిలో వెళ్తే చాలు అనుకుంటున్నారు. ఈ టైమ్ లో `వకీల్ సాబ్` సినిమా మహిళలకు మరింత సపోర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు.

915
అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా సరైన విధంగా పెంచాలని చెబుతుందీ సినిమా.- ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయని నేనూ విన్నాను. కానీ నాకెప్పుడూ అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. నేను ఇండస్ట్రీలోకి రావడం కష్టమయ్యింది కానీ ఇక్కడికొచ్చాక చేదు సంఘటనలు ఎదురుకాలేదు` అని చెప్పింది అనన్య. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పింది.