`వైల్డ్ డాగ్` భామ దియా మీర్జా ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ అని తెలిసి పెళ్లి చేసుకున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై దియా మీర్జా స్పందించింది. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ఇటీవల నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్` చిత్రంతో టాలీవుడ్‌లో మెరింది దియా మీర్జా. ఈ అమ్మడు రెండు నెలల క్రితం ముంబయికి చెందిన వ్యాపార వేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది.

29
ఆ వెంటనే ఈ జోడి మాల్డీవులకు హనీమూన్ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులపాటు రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. మరోవైపు `వైల్డ్ డాగ్` ప్రమోషన్‌లో పాల్గొని ఆ వెంటనే మళ్లీ మాల్దీవులకు వెళ్లారు.

39
అక్కడి నుంచే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించింది దియా మీర్జా. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంది. మాతృత్వాన్ని ఆస్వాదించే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది దియా.

49
ఇదిలా ఉంటే పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కానేలేదు. అప్పుడే ప్రెగ్నెంట్ అని ప్రకటించడంతో అభిమానుల్లో సందేహం నెలకొంది. పెళ్లి తర్వాతే ప్రెగ్నెంట్ అయ్యిందా ? లేక ప్రెగ్నెంట్ అని తెలిసి పెళ్లి చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

59
అయితే ఓ నెటిజన్ ఇదే విషయాన్ని ఏకంగా ఆమెనే ప్రశ్నించాడు. `లైఫ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు మీకు శుభాకాంక్షలు. మహిళా పూజారి సమక్షంలో, ఆమె చదువుతున్న వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని అనాదిగా ఆచరిస్తున్న కట్టుబాట్లను తెంచుకుని పురోగమిస్తున్నానని చెప్పిన ఓ మహిళ, పెళ్లికి ముందే గర్భవతినని ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలనే కట్టుబాటును ఆమె అనుసరిస్తున్నారా? మ్యారేజ్‌కి ముందే అమ్మతనాన్ని పొందితే తప్పేంటి? అని స్ట్రెయిట్‌గా ప్రశ్నించాడు.

69
దీనికి దియా మీర్జా స్పందించింది. `మంచి ప్రశ్న అడిగారు. మా ఇద్దరికి బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మేం పెళ్లి చేసుకోలేదు. వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచించుకుంటూనే ఉన్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని కాబట్టి హడావుడిగా పెళ్లిచేసుకోలేదు.

79
ఈ విషయాన్ని మ్యారేజ్‌కి ముందే ప్రకటించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అప్పటికే నాకు కొన్ని అరోగ్య సమస్యలున్నాయి. వాటిని అధిగమించి అంతా అనుకున్నట్టుగా జరుగుతుందా? లేదా? అనే సందేహాలున్నాయి. అందుకే చెప్పలేదు.

89
నిజానికి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు నా కల నెరవేరింది. మీరనుకుంటున్నట్లుగా తల్లికాబోతున్న విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో మరే ఇతర ఉద్దేశాలు లేవు` అని స్పష్టం చేసింది.

99
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించిన దియా మీర్జా మొదట నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖీతో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది. వీరిద్దరు ప్రేమించుకుని ముంబయిలో ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు.