నిర్మాతలు కావాలనే నా బాత్రూమ్ వీడియో లీక్ చేసారు

Published : Jan 22, 2025, 07:29 AM IST

ఊర్వశీ రౌతేలా బాత్రూమ్ వీడియో లీక్ వార్తతో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ వీడియో లీక్ కాదని, సినిమా ప్రమోషన్ కోసం ప్లాన్ ప్రకారం చేసినదేనని ఊర్వశీ చెప్పుకొచ్చింది.

PREV
15
 నిర్మాతలు కావాలనే నా బాత్రూమ్ వీడియో లీక్ చేసారు
Urvashi Rautela, Ghuspaithiya, BALAKRISHNA


కొత్త సంవత్సరంలో  బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఏదో ఒక కారణంతో గత పదిహేను రోజులుగా ట్రెండింగ్ లో ఉంది. ఆమె ట్వీట్స్, బాత్రూమ్ వీడియో లీక్  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

అసలు  ఊర్వశీ రౌతేలా బాత్రూం వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్త రాగానే హైలెట్ అయ్యిపోయింది. ఆ వీడియో కోసం తెగ వెతికారు. ఆ వీడియోలో ఊర్వశీ రౌతేలా అయితే కనిపిస్తోంది. కానీ ఇది లీక్ అయిన వీడియో కాదని, కావాలనే ప్లాన్ ప్రకారం  వదిలిన వీడియో అని తేలింది. ఈ విషయాన్ని ఊర్వశీ సైతం ఖరారు చేసింది.

25


ఊర్వశీ రౌతేలా అంటే మనవాళ్లకి కేవలం ఐటం సాంగ్స్ గుర్తుకు వస్తాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి, తాజాగా బాలయ్య వంటి స్టార్స్ తో కలిసి స్టెప్పులు వేసింది. వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్ సహా పలు మూవీలోనూ స్పెషల్ సాంగ్ చేసింది అలాగే బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా ఊర్వశీ మెరిసింది.

ఈ బ్యూటీకి తెలుగు పరిశ్రమపై మీద మోజు ఎక్కువ. కానీ హీరోయిన్‌గా ఇక్కడ ఆమెకు అవకాశాలే రావడం లేదు.  రీసెంట్ గా డాకూ మహారాజ్ లో కొద్దిపాటి క్యారక్టర్ చేసింది కానీ ఆమె చేసిన స్పెషల్ సాంగ్ దబిడి దబిడికే ఎక్కువ పేరు వచ్చింది.
 

35


ఇదిలా ఉంటే ఊర్వశి కు చెందిన ఓ వీడియో క్లిప్ ఎక్స్ లో వైరల్ అయ్యింది.  అయితే అవి ఓ సినిమాలో సీన్ అని తేలింది.  Ghuspaithiya అనే మూవీ నుంచి లీకైన బాత్రూమ్ సన్నివేశం అని తెలిసింది. అయితే ఈ లీక్ తనకు తెలుసు అని ఊర్వశి.. ఇది ప్లానింగ్ ప్రకారం చేసిన చర్య అని చెప్పుకొచ్చింది. సీన్ లీక్ కావడంతో గుస్పైథియా నిర్మాతలు కావాలనే చేసారని అంది.

45


బాలీవుడ్ మీడియాతో ఊర్వశి మాట్లాడుతూ...Ghuspaithiya నిర్మాతలు అప్పుల్లో ఉన్నారని తమ సినిమాకు బజ్ క్రియేట్ చేయటం కోసం బాత్రూం వీడియో సీన్ లీక్ చేస్తామని తనను అడిగారని తను ఓకే చెప్పానని అంది. అలా లీక్ చేసి సినిమాకు బజ్ వస్తే తాము ఒడ్డున పడతామని, ప్రస్తుతం ఈ సినిమా అప్పులు తీర్చటం కోసం ల్యాండ్ అమ్మే పరిస్దితుల్లో ఉన్నారని, అందుకే ఓకే చేసానంది.
 

55


ఊర్వశి ఊహించినట్లే ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. అయితే అది బిజినెస్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియని సిట్యువేషన్. కానీ ఈ వీడియోను, ఊర్వశి వివరణను చూసిన సోషల్ మీడియా జనం..ఇలాంటి చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ వాడటానికి సిగ్గులేదా అని నిలదీస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఎలా ఉన్నా నెట్టింట్లో ఈ వీడియో మాత్రం ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతోంది.

click me!

Recommended Stories