సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అనసూయ. యాంకర్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతూ.. వెండితెరపై కూడా తన మార్క్ నటనతో దూసుకుపోతోంది. అంతేనా.. సోషల్ మీడియాలో కూడా అనసూయ దడదడలాడిస్తుంది. ఈక్రమంలోనే కాట్రవర్సీలతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తోంది బ్యూటీ.
ఈ మధ్య వివాదాల సుడిగుండంలో తిరుగుతుంది అనసూయ. అయినా సరే ఎక్కడా తగ్గేది లేదు అంటోంది. తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తోంది. ఈ క్రమంలో ఎంత దూరం వెళ్లడానికైనా రెడీ అంటోంది.
ప్రతీ విషయంలో తన మార్క్ స్పందన చూపిస్తుంది అనసూయ. సమాజంలో జరిగే వాటి గురించి ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది బ్యూటీ. అంతే కాదు ఈ విషయంలో ఎవరు ఏన్ని రకాలుగా తనను ట్రోల్ చేసినా డోంట్ కేర్ అంటుంది. రివర్స్ గేర్ లో వాళ్ల పని పట్టడంతో పాటు.. పోలీస్ కేసుల వరకూ వెళ్తోంది.
Anasuya Bharadwaj
ముఖ్యంగా తనను ఆంటీ అని కామెంట్ చేసి.. ఆ విషయాన్ని పెద్దది చేసిన నెటిజన్లపై ఏకంగా పోలీస్ కేసు పెట్టి షాక్ ఇచ్చింది . అయితే ఈ క్రమంలో అనసూయ పై సోషల్ మీడియాలో హ్యూజ్ నెగెటివిటీ క్రియేట్ అయింది . అసలే పొట్టి బట్టలు వేసుకుంటుంది అనసూయ అంటూ మండిపడే జనాలను ఇంకొంచెం రెచ్చగొట్టింది అనసూయ. అయితే ఇప్పటికే అనసూయ అందం విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు .
ఎవరు ఏమననా సరే నా పని నాదే అంటుంది అనసూయ. హాట్ హాట్ గా ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్ తో ఫోటోషాప్ చేసి.. అందాల విందును వడ్డిస్తూనే ఉంటుంది బ్యూటీ. అయితే అనసూయకు సంబందించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తే అనసూయ జాతకంలో ఓ దోషం ఉందని ఆ కారణంగానే అనసూయ అలాంటి ట్రోలింగ్ కి గురవుతుందని న్యూస్ వైరల్ గా మారింది .
అనసూయ జాతకంలో ఒక దోషం ఉందని .. అందుకే ఇలా రకరకాల నిందలు పడుతుందని.. దీని కోసం తగ్గ పరిహార పూజలు చేయించుకుంటే ఆమెకు మళ్ళి ప్రశాంత జీవితం గడపవచ్చు అంటూ.. పండితులు చెప్పారట. ఈ విషయంలో ఆమె జాగ్రత్త పడకపోతే రానున్న రోజుల్లో అనసూయ గట్టుకాలం ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
అటు ఆమె ఫ్యాన్స్ కూడా పూజలు చేయింకోమ్మ.. మాకు పాత అనసూయ కావాలి.. ఈ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడతావు అంటున్నారట. ఇది వరకూ తనను ట్రోల్స్ చేసేవారికి ఘాటుగా సమాధానం మాత్రమే చెప్పేది అనసూయ. కాని ఈమధ్య నోటి దూకుడు పెంచేసింది. దాంతో అనసూయపై నెగెటీవ్ టాక్ నడుస్తోంది.
Anasuya Bharadwaj
ఈ రకంగా సినిమాలలో కూడాఅవకాశాలు తగ్గాయట అనసూయకు. అంతే కాదు పుష్ప2 నుంచి కూడా తీసేసారని రూమర్స్ నడుస్తున్నాయి. దాంతో అనసూయ ఫ్యాన్స్ కు భయం పట్టుకుందని టాక్. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.