రకుల్ ఇలా మారిపోయిందేంటీ.. థైస్ షోతో మతులు పోగొడుతున్న ఢిల్లీ భామ.. స్టన్నింగ్ స్టిల్స్..

First Published | May 4, 2023, 10:05 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూపోతున్నట్టు కనిపిస్తోంది. తన లేటెస్ట్ లుక్ తో మతులు పోగొడుతోంది. పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెలుగు వెలిగింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రేక్షకుల్లోనూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే  కొద్ది కాలంగా ఈ భామ తెలుగు  సినిమాలకు దూరంగానే ఉంటోంది.
 

సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ  యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. సినిమా అప్డేట్స్ ను అందిస్తుండటంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.  ఈక్రమంలో తాజాగా ముంబైలోని FICCI ఈవెంట్ కు హాజరైంది. కార్యక్రమానికి అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. 
 


లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతోనూ షేర్ చేసుకుంది. సెమీ-ఫార్మల్ లుక్‌తో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. క్రీమ్, బ్లాక్ బ్లేజర్ ను ధరించింది. అవుట్ ఫిట్ ను మ్యాచ్ చేస్తూ బ్లాక్ లోఫర్స్ ధరించింది. మరోవైపు పొట్టి నిక్కరులో థైస్ షోతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఇక  గతేడాది బాలీవుడ్ లో వరుస చిత్రాలతో సందడి చేసింది రకుల్. ఏకంగా హిందీలో ఐదు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ ‘ఛత్రీవాలీ’ సినిమాతో అలరించే ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ ఆశించిన మేర రకుల్ కు రిజల్ట్ ను అందించలేకపోయాయి.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ కేరీర్ ఆందోళనకరంగానే కనిపిస్తోందంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సౌతో చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకున్న రకుల్.. ప్రస్తుతం మళ్లీ దక్షిణాది చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. 
 

రకుల్ ప్రస్తుతం మంచి హిట్ కోసం చూస్తోంది. ఈ సందర్భంగా తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’పైనే ఆశలు పెట్టుకుంది.  దర్శకుడు శంకర్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతోంది. అలాగే శివ కార్తీకేయ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. తెలుగులో చివరిగా ‘కొండపొలం’లో మెరిసింది.
 

Latest Videos

click me!