తెలుగులో టాప్ లో అదరగొడుతున్న సీరియల్స్ ఇవే..!

Published : Dec 12, 2023, 12:36 PM ISTUpdated : Dec 12, 2023, 12:39 PM IST

అందుకే, చాలా తెలుగు సీరియల్స్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి, ఈ 2023లో అన్ని ఛానెల్స్ లోనూ టాప్ దూసుకుపోతున్న టీవీ సీరియల్స్ ఏంటో ఓసారి చూద్దాం..  

PREV
110
 తెలుగులో టాప్ లో అదరగొడుతున్న సీరియల్స్ ఇవే..!
Telugu Serials


తెలుగు ప్రేక్షకులు  సినిమాలను ఎంతగా ఆదరిస్తారో... సీరియల్స్ ని కూడా అంతే ఆదరిస్తారు. టీవీ సీరియల్స్ లోని నటీనటులను సైతం తమ సొంత వాళ్లలాగా అభిమానిస్తూ ఉంటారు. అందుకే, చాలా తెలుగు సీరియల్స్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి, ఈ 2023లో అన్ని ఛానెల్స్ లోనూ టాప్ దూసుకుపోతున్న టీవీ సీరియల్స్ ఏంటో ఓసారి చూద్దాం..

210
Brahmamudi

1.బ్రహ్మమూడి..
స్టార్ మా లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మ ముడి ఒకటి. ఈ సీరియల్ ఇఫ్పటికీ అన్ని సీరియల్స్ లోనూ టాప్ గా నిలుస్తోంది. ముగ్గురు ఆడపిల్లలు.. ఒకే ఇంటికి కోడళ్లు ఎలా వెళ్లారు.. అక్కడ వారి జీవితం ఎలా ఉంటుంది అనే యాంగిల్ లో ఈ కథ సాగుతుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగుతుండటంతో, ఎక్కువ మందికి కథ ఆకట్టుకుంటోంది. తెలుగు ప్రేక్షకులు జేజేలు కొడుతున్నారు.

310
Naga Panchami

2.నాగ పంచమి..
ఈ సీరియల్ కూడా స్టార్ మాలోనే ప్రసారం అవుతుంది. ఇది కూడా టాప్ రేటుతో సాగిపోతోంది. ఓ నాగ కన్య పంచమి మనిషి రూపంలో పెరుగుతుంది. ఆమె ఓ పాము అని తెలియక ఓ యువకుడు పెళ్లి చేసుకుంటాడు. అయితే, పాముగా ఆమె తన తల్లిని చంపినవారిపై పగ తీర్చుకోవాలి. మరోవైపు భర్త ని కాపాడుకోవాలి. ఈ రెండింటిలో పంచమి ఏం చేస్తుంది అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

410
nuVVu nenu prema

3. నువ్వు, నేను ప్రేమ..

ఒకప్పుడు హిందీలో వచ్చిన పాపులర్ సీరియస్ ఇస్ పార్యా కో క్యా నామ్ ధూ ని తెలుగులో నువ్వు, నేను ప్రేమ పేరిట రీమేక్ చేస్తున్నారు. అయితే, తెలుగు నేపథ్యంలో ఈ కథ సాగుతుండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
 

510
Krishna Mukunda Murari

4. కృష్ణ ముకుంద మురారి..

ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతోంది. కృష్ణ, ముకుంద, మురారి.. ఈ ముగ్గురి  మధ్యే కథ సాగుతుంది. కృష్ణ, మురారి ని దూరం  చేసి, మురారిని ముకుంద పెళ్లాడాలని అనుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
 

610
Mamagaru

5.మామగారు..
ఇది కూడా స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్ కావడం విశేషం.  రీసెంట్ గానే స్టార్ అయినా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కోడళ్లను కంట్రోల్ చేసే ఓ మామగారికథ ఇది.

710
trinayani


6.త్రినయని..
ఈ త్రినయని సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఏ సీరియల్ లో చూడని వింతలు ఈ సీరియల్ లో కనపడతాయి. రియాల్టీ కి దూరంగా తీసినా, ఈ సీరియల్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

810
Gundeninda Gudi Gantalu

7.గుండె నిండా గుడి గంటలు..
స్టార్ మాలో కొత్తగా మొదలైన సీరియల్ ఈ గుండె నిండా గుడి గంటలు. కార్తీక దీపంలో పెద్ద శౌర్యలా ఆకట్టుకున్న అమ్మాయే ఈ సీరియల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాధ్యతగల అమ్మాయికీ, బాధ్యతలేని అబ్బాయికి పొత్తు ఎలా కుదిరింది. వారి బంధం ఎలా కొనసాగుతుంది అనే నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతోంది.

910
padamati sandhya ragam

8.పడమటి సంధ్యారాగం..
జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్ ఇది. అక్కాచెల్లెళ్ల కథ గా ఈ సీరియల్ సాగుతుంది. ఒకరు అమెరికాలో పెరగగా, మరొకరు అమాయకంగా పల్లెటూరిలో పెరుగుతారు. ఈ అక్కాచెల్లెళ్ల జీవితం ఎలా సాగుతుంది అనే నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది.

1010
Guppedantha Manasu

9.గుప్పెడంత మనసు..
స్టార్ మా లో సాగే మరో సీరియల్ ఈ గుప్పెడంత మనసు. ఒకప్పుడు టాప్ వన్ లో ఉండే ఈ సీరియల్ ఇప్పుడు 9వ స్థానానికి చేరుకుంది. అయినా, ఇప్పటికీ ఈ సీరియల్ బాగానే ఆకట్టుకుంటోంది.

 

10.జగధాత్రి..
జీ తెలుగులో వస్తున్న సీరియల్ ఇది. సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గా ఓ అమ్మాయి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే ఈ సీరియల్ మొదలవ్వగా... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

click me!

Recommended Stories