Jabardasth : ‘జబర్దస్త్’లో కొత్త రూల్స్... టీం లీడర్లను బౌన్సర్లతో కొట్టిస్తున్న జడ్జీలు!

First Published | Feb 19, 2024, 6:43 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షో Jabardasth Comedy Show పదేళ్లకు పైగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా షోలో కొన్ని రూల్స్ పెట్టినట్టు జడ్జీలు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది.

తెలుగు ప్రేక్షకుల ఇంట్లో దశాబ్ద కాలంగా నవ్వులు పూయిస్తున్న ‘జబర్దస్త్’ (Jabardasth) షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా  కొనసాగుతూనే వస్తోంది. ఈ షోకు లేడీ జడ్జీగా సీనియర్ నటి ఇంద్రజా (Indraja) వ్యవహరిస్తున్నారు. 
 

మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ లో షో విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోకు మేల్ జడ్జీగా కృష్ణ భగవాన్ (Krishna Bhagavan) వ్యవహరిస్తున్నారు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. 
 


ఇన్నేళ్లుగా ఈ కామెడీ షో విజయవంతంగా రన్ అవుతోంది. ఇక కృష్ణ భగవాన్, ఇంద్రజా జడ్జీలుగా వచ్చాక షో మరోమలుపు తిరిగింది. కొత్త కంటెంట్ తో అలరిస్తున్నారు. తాజాగా Jabardasth Latest Promo విడులైంది. 

ప్రోమో ప్రారంభంలోనే ‘జబర్దస్త్’లో కొత్త రూల్స్ పెట్టినట్టుగా జడ్జీలు షాకిచ్చారు. పేలని పంచులు, నీరసంగా ఉండే స్కిట్లు చేస్తే బౌన్సర్లతో కొట్టించబోతున్నామని చెప్పారు. అయితే ఇది స్కిట్ లో భాగంగానే చేసినట్టు కనిపిస్తోంది. 

రాకెట్ రాఘవ (Rocket Raghava) స్కిట్ లో బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది నిజమా? లేక స్కిట్ వరకేనా? అనేది తెలియాలంటే ఫిబ్రవరి 22న వచ్చే ఫుల్ ఎపిసోడ్ కోసం వేచి ఉండాల్సిందే.

ప్రస్తుతం ఈ షోకు మంచి రేటింగే వస్తోంది. సీనియర్ ఆర్టిస్టులతో పాటు యంగ్ కమెడియన్స్ ఈ షోలో అలరిస్తున్నారు. కామెడీ షోకు బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు (Siri Hanumanth) యాంకర్ గా వ్యవహరిస్తోంది. 
 

Latest Videos

click me!