మోక్ష మాత్రం.. తాను పంచమి లేకుండా బతకలేనని.. మీరు ఇఛ్చిన జన్మ ఎప్పుడో పోయిందని.. తాను మిగిలింది కేవలం పంచమి పోసిన ప్రాణంతోనే అని అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లు కూడా అసహనంతో వెళ్లిపోతారు. అయితే.. మేఘన మాత్రం.. మోక్ష ప్రాణం పోయినా.. పంచమిని దూరం చేయలేమేమో అని అనుకుంటుంది.
శబరి కూడా.. మోక్ష, పంచమి విషయంలో తాము తప్పు చేస్తున్నామా అని ఫీలౌతుంది నిజంగా పంచమి అమాయకురాలు అయితే.. ఆ దేవుడు తనకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది,