Guppedantha Mansu 15th December Episode: అనుపమకు వసు బాధ్యతలు, శైలేంద్రను చంపడానికి సిద్ధమైన మహేంద్ర..!

Published : Dec 15, 2023, 08:10 AM IST

మరోవైపు శైలేంద్ర ఇంట్లో హాయిగా బెడ్ మీద పడుకొని పగటి కలలు కంటూ ఉంటాడు. తన కండిషన్స్ కి వసుధార కచ్చితంగా ఒప్పుకుంటుందనది, అతి త్వరలోనే తాను ఎండీ కాబోతున్నానని, డీబీఎస్టీ కాలేజీ కి తాను ఎండీ అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటాడు. 

PREV
18
Guppedantha Mansu 15th December Episode: అనుపమకు వసు బాధ్యతలు,   శైలేంద్రను చంపడానికి సిద్ధమైన మహేంద్ర..!
Guppedantha Manasu

Guppedantha Mansu 15th December Episode:అనుపమ కారులో వెళ్తూ ఉంటుంది. మహేంద్ర ఓ చోట దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. వెంటనే అతని దగ్గరకు అనుపమ వెళ్తుంది. ‘ఏంటి మహేంద్ర ఇక్కడేం చేస్తున్నావ్? ఏం ఆలోచిస్తున్నావ్? రిషి గురించేనా? రిషికి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు’ అని చెబుతుంది.

28
Guppedantha Manasu

 ‘ అనుపమ.. శైలేంద్ర దుర్మార్గుడు అని తెలిసినా, వాడిని ఏం చేయలేకపోతున్నాం. వాడు ఎన్నిసార్లు బుసలు కొడుతున్న కూడా ఊరికే ఉండాల్సి వస్తోంది. ఇది నా చేతకాని తనమే కాదు. శైలేంద్ర విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. వాడు నీచుడు. పదవి కోసం రిషిని మాకు దూరంగా చేశాడు అని తెలిసిన క్షణమే వాడిని చంపేయాల్సింది. వాడు ఎన్ని ఆటలు ఆడుతున్నా, మేం ఏసే ఎత్తులకు పై ఎత్తులు వేసి, అందరి ముందు మాదే తప్పు అని చెబుతున్నా కూడా ఏరోజు నోరు విప్పి మాట్లడలేదు. వాడి ప్రవర్తనలో ఇంకా మారింది. రోజు రోజుకీ రాక్షసుడు లా మారిపోతున్నాడు. జగతి నా ప్రాణం. అలాంటి నా జగతిని నాకు దూరం చేశాడు. ఆ నేరం చేసింది వాడేనని, సాక్ష్యాలతో సహా రిషి ముందు నిలపెట్టాలని , రిషి వాడిని దండిస్తుంటే చూడాలని అనుకున్నాను. కానీ, ఇప్పుడు నా ఆశ నెరవేరలేదు.  రిషికి ఏదైనా అయితే, నేను తట్టుకోలేను అనుపమ’ అంటూ మహేంద్ర తన బాధ మొత్తం బయటపెడతాడు. రిషికి ఏమీ కాదని అనుపమ ధైర్యం చెబుతుంది. నువ్వే అలా అధైర్య పడితే వసుధారకు ఎవరు ధైర్యం చెబుతారు అని అంటుంది.

38
Guppedantha Manasu

వెంటనే మహేంద్ర..‘నాకు ఓ మాట ఇస్తావా’ అని అడుగుతాడు. ఏంటి అని అనుపమ అడిగితే‘ వసుధార బాధ్యత నువ్వు తీసుకుంటావా? తనను కంటికి రెప్పలా చూసుకో’ అని చెప్పి బాధ్యతులు అప్పగిస్తాడు. తర్వాత నా వ్యక్తిత్వం ఎలాంటిది అని అడుగుతాడు. నువ్వు మంచివాడివి మహేంద్ర అని అనుపమ అంటుంది. దానికి మహేంద్ర, అయితే నేనం చేసినా నాకు నువ్వు సపోర్ట్ గా ఉంటావా అని అడుగుతాడు. వెంటనే అనుపమ... నువ్వు ఏ మంచి పనిచేసినా తాను అండగా ఉంటానని చెబుతుంది. అలా చెప్పిన వెంటనే అనుపమకు ఓ అనుమానం వస్తుంది. నువ్వు ఏ పిచ్చి పనీ చేయడం లేదు కదా అని అడుగుతుంది. దానికి మహేంద్ర..నేనేం చేస్తాను.. నేనేం చేయడం లేదు, అయినా నేనేం చేయగలను జరిగేది చూడటం తప్ప అని తప్పించుకుంటాడు. తర్వాత అనుపమ ఏదో పని ఉందని బయటకు వెళ్లి, వెంటనే వస్తాను అంటుంది. మహేంద్రను వసు ఇంట్లో ఒంటరిగా ఉందని, అక్కడికి వెళ్లమని చెబుతుంది. తర్వాత మహేంద్ర.. నాకు సపోర్ట్ గా ఉండకపోయినా పర్వాలేదు కానీ, వసుధరకు అండగా ఉండు అని అడుగుతాడు. పదే పదే వసుధార గురించి జాగ్రత్తలు చెప్పడంతో, మహేంద్ర ఏదైనా పిచ్చి నిర్ణయం తీసుకుంటున్నావా అని కూడా అడుగుతుంది. ఏమీ లేదు అంటాడు. కానీ, ఆల్రెడీ మహేంద్ర.. శైలేంద్ర ను ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం తీసేసుకున్నాడని తెలుస్తోంది.

48
Guppedantha Manasu


మరోవైపు శైలేంద్ర ఇంట్లో హాయిగా బెడ్ మీద పడుకొని పగటి కలలు కంటూ ఉంటాడు. తన కండిషన్స్ కి వసుధార కచ్చితంగా ఒప్పుకుంటుందనది, అతి త్వరలోనే తాను ఎండీ కాబోతున్నానని, డీబీఎస్టీ కాలేజీ కి తాను ఎండీ అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక నుంచి తనను ఈ రోజు నుంచి ఎవరూ ఏం చేయలేరు అని అనుకుంటూ.. శైలేంద్ర.. కాఫీ అంటూ అరుస్తాడు. ధరణి కాఫీ తేవడం లేదని మళ్లీ ధరణి కాఫీ అని అరిచిలేచి చూసే సరికి మహేంద్ర కనిపిస్తాడు.

58
Guppedantha Manasu


‘బాబాయ్ నువ్వు ఎందుకు వచ్చావ్? డాడ్ ఇంట్లో లేరుకదా? మీరెందుకు వచ్చారు..?’ అని అడుగుతాడు. నీ కోసమే అని మహేంద్ర బదులిస్తాడు. ‘నాతో ఏం పని బాబాయ్’ అని శైలేంద్ర అడగగా, నా మైండ్ లో చాలా ప్రశ్నలకు నీ దగ్గరే సమాధానాలు ఉన్నాయి అంటాడు. టాపిక్ డైవర్ట్ చేయడానికి కాఫీ కావాలా? టీ కావాలా అని అడుగుతాడు. అంత ప్రేమ నటించకు రా అని మహేంద్ర అంటాడు. బాబాయ్ ఏంటి.. ఇంత కోపంగా ఉన్నాడు అని శైలేంద్ర భయపడిపోతాడు. తర్వాత.. మహేంద్ర గది డోర్ క్లోజ్ చేస్తాడు. ఎందుకు డోర్ క్లోజ్ చేశారు బాబాయ్ అని అడుగుతాడు. వెంటనే మహేంద్ర.. ‘ నీ నాటకలు ఆడకు రా, నీ గురించి అంతా తెలిసినవాడిని నేను. అలాంటిది నా దగ్గర మంచి వాడిలా నటించాలని ప్రయత్నించకు.’ అంటాడు. దానికి శైలేంద్ర.. నేను నిజంగా మారిపోయాను బాబాయ్ పాత శైలేంద్రను కాదు అంటాడు. అవునా అయితే, రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతాడు. దానికి శైలేంద్ర.. తనకు ఏమీ తెలియనట్లుగా, రిషి ఎక్కడ ఉన్నాడో నాకు ఎలా తెలుస్తుంది బాబాయ్ అని అడుగుతాడు. అంతే ఆ మాటకు మహేంద్రకు పిచ్చి కోపం వస్తుంది. లాగిపెట్టి ఒక్కటి ఇస్తాడు. ఆ దెబ్బకు శైలేంద్ర కింద పడిపోతాడు.

తర్వాత మర్యాదగా అడుగుతున్నాను.. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతాడు. దానికి శైలేంద్ర.. నిజంగా రిషి ఎక్కడ ఉన్నాడో తనకు తెలీదని, ఇదంతా మీ భ్రమ అంటాడు. ఇక, మహేంద్ర కొడుతూనే ఉంటాడు.  శైలేంద్ర ఎం చెప్పినా, మహేంద్ర వినిపించుకోడు. శైలేంద్ర ఏదో చెప్పాలని ప్రయత్నించినా మహేంద్ర వినిపించుకోడు. దీంతో, ఆవేశంగా మహేంద్ర.. తన దగ్గర ఉన్న తుపాకీ బయటకు తీస్తాడు. అది చూసి భయపడిన శైలేంద్ర.. మమ్మీ, ధరణి అంటూ అరుస్తాడు. వాళ్లిద్దరూ ఆ అరుపులకు అక్కడకు వచ్చేస్తారు. ఏమైంది అని అడుగుతారు. బాబాయ్ నన్ను చంపేస్తున్నాడు మమ్మీ అని శైలేంద్ర అరుస్తాడు. బాబాయ్ అంటే మహేంద్ర నా అని దేవయాణి అడుగుతుంది. 

68
Guppedantha Manasu

‘ఇంకెవరు వదిన గారు,నేనే ’ అంటాడు మహేంద్ర. కిటికీలో నుంచి లోపలికి చూస్తారు. మహేంద్ర.. శైలేంద్రకు తుపాకీ గురి పెట్టి ఉంటాడు.  శైలేంద్రను వదిలేయ్ మహేంద్ర అని దేవయాణి ప్రాధేయపడుతూఉంటుంది. మహేంద్ర మాత్రం‘ ఎండీ సీటు నీకు ఇచ్చి, రిషిని తీసుకువెళ్లమని వసుధారతో చెప్పావ్ , నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ  ఇంటికి శని పట్టుకుంది. నీ పదవి మీద కాంక్ష, నువ్వు ఎంతకైనా దిగజారతావని తెలిసినప్పుడే ఆరోజే చంపేయాల్సింది. తప్పు చేశాను. మా అన్నయ్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టాను. ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటావ్ అని అనుకున్నాను. కానీ, నీ బుద్ధి మారలేదు. పదవి దక్కించుకోవడం కోసం స్వార్థంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నావ్. నీకు నేను ఏం అన్యాయం చేశాను రా. 20ఏళ్లు జగతి నాకు దూరం అయ్యేలా చేసింది మీ అమ్మ. నవ్వేమే నువ్వు నాకు శాశ్వతంగా దూరం చేశావ్’ అని తిడతాడు.

78
Guppedantha Manasu

అప్పటికీ శైలేంద్ర.. తన తప్పు ఏమీ లేదని కవర్ చేసుకోవాలని చూస్తాడు. దాంతో, మహేంద్ర. తుపాకీతో కొడతాడు. నా కొడుకు నాకు దూరం కావడానికి కారణం నువ్వే అంటూ.. తుపాకీతో కాల్చబోతాడు. ఈలోగా, దేవయాణని.. ధరణిని బతిమిలాడుతుంది. నా కొడుకును కాపాడు ధరణి.. నువ్వు అడిగితే, మహేంద్ర కాల్చకుండా ఉంటాడు.. అడుగు అంటుంది. కానీ, ధరణి ఊరుకోదు. రిషి ఎక్కడ ఉన్నాడో చెబితే మామయ్యను నేను ఆపుతాను అంటుంది.  ఇక్కడ ధరణి చేసిన పనికి ఫ్యాన్స్ నుంచి విజిల్స్ రావడం ఖాయం.

దేవయాణి మాత్రం.. నా కోసం కాదు, నీ పసుపు కుంకుమల కోసం అయినా, నువ్వు కాపాడుకోవాలి అంటుంది. అయినా ధరణి కొంచెం కూడా చలించదు. రిషి గురించి చెబితేనే మామయ్యను అడుగుతాను అంటుంది. దీంతో, దేవయాణి.. శైలేంద్రను చంపితే మహేంద్ర జైలుకు వెళతాడు.అసలే రిషి కనిపించడం లేదు, ఇప్పుడు మహేంద్ర కూడా జైలుకు వెళితే, వసుధార తట్టుకోగలదా అని ఎమోషల్ డైలాగులు కొడుతుంది. దీంతో, ధరణి ఆలోచనలో పడిపోతుంది. మహేంద్ర కోసం ఆలోచించి, శైలేంద్రను ఏమీ చేయవద్దని అడుగుతుంది. కానీ, ధరణి మాటలను కూడా మహేంద్ర పట్టించుకోడు, నిన్ను దీవించిన చేతులతోనే నీ పసుపు కుంకుమలు తీసేయబోతున్నాను అని చెబుతాడు.
 

88
Guppedantha Manasu

ప్రాణం మీదకు వచ్చినా, శైలేంద్ర నిజం చెప్పడానికి సముఖత చూపించడు. ఈలోగా ధరణి..వసుధారకు ఫోన్ చేస్తుంది. ధరణి చెప్పింది విని, వసుధార షాకౌతుంది. వెంటనే, వసుధార.. మహేంద్రకు ఫోన్ చేస్తుంది. వసు ఫోన్ ని మహేంద్ర కట్ చేస్తాడు. మళ్లీ చేస్తుంది. దీంతో, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మహేంద్రను చంపుతున్నాను అని వసుధారతో చెబుతాడు. పొరపాటు చేయకండి అని వసుధార బతిమిలాడుతుంది. కానీ, నేను ఎవరి మాట విననను అని, శైలేంద్రను కాల్చి పారేస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని, అందుకే  ఈనిర్ణయం తీసుకున్నాను అని చెబుతాడు. 

వసు వెంటనే.. అక్కడకు వెళ్లి గొడవ ఆపాలని అనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర.. ప్రాణం మీదకు వచ్చినా నిజం చెప్పడు. రిషి కనిపించకుండా పోయినప్పుడు తాను హాస్పిటల్ లో ఉన్నానని, నిజంగా తనకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలీదని చెబుతుంటాడు. కానీ, మహేంద్ర నమ్మడు. నా జగతిని చంపి నా జీవితాన్ని శూన్యం చేశావ్, ఇప్పుడు రిషిని దూరం చేశావ్ అంటూ కాల్చడానికి రెడీ అవుతాడు. జగతి.. ఈ పాపాత్ముడిని నీ దగ్గరకే పంపుతున్నాను అంటూ కాల్చడానికి రెడీ అవుతాడు. వెంటనే శైలేంద్ర.. మహేంద్రను పక్కకు తోసేసి, బయటకు పరుగులు తీస్తాడు. మహేంద్ర.. ఆ తుపాకీ అందుకొని శైలేంద్ర వెంట పరగుులు తీస్తాడు.ఆ క్రమంలో ఏదో తగిలి శైలేంద్ర కింద పడిపోతాడు. దీంతో, మహేంద్ర పట్టుకుంటాడు. అడ్డొచ్చిన దేవయాణి, దరణిలను తోసేస్తాడు. తర్వాత కాల్చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ, ఇది నిజంగా జరిగిందో, ఎవరైనా ఊహించుకున్నారో చూడాలి.

click me!

Recommended Stories