Guppedantha Manasu Serial 18th December:ఇంటికి చేరిన రిషి కారు, రిషి ఆలోచనల్లో వసు, ఏడిపించేసింది..!

First Published Dec 18, 2023, 8:21 AM IST

‘నేనే ఫోన్ చేసి రమ్మన్నాను మామయ్య. నాకు విషయం తెలిసిన తర్వాత  మీరు నాకు కంట్రోల్ అవ్వరని తెలుసుకాబట్టి, మేడమ్ కి ఫోన్ చేసి రమ్మన్నాను ’ అని వసుధార చెప్పడంతో మహేంద్ర కాస్త చల్లపబతాడు.

Guppedantha Manasu

Guppedantha Manasu Serial 18th December:శైలేంద్రపై ఎటాక్ చేయాలని మహేంద్ర ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే, అనుపమ, వసుధారలు అడ్డుకుంటారు. బలవంతంగా మహేంద్రను తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో వాళ్లు కారులో ఇంటికి చేరుకుంటారు. మహేంద్ర చాలా చిరుకుగా ఉంటాడు. వెంటనే అనుపమ.. ‘ఎందుకు మహేంద్రా నీకు అంత ఆవేశం’ అని అడుగుతుంది. దానికి మహేంద్ర.. ‘అసలు నువ్వు ఎందుకు వచ్చావ్ అక్కడికి ? ఎవరు రమ్మన్నారు అక్కడికి? బుల్లెట్ సరిగ్గా వాడి గుండెల్లోకి దూరుతోంది అనగా మధ్యలో వచ్చావ్. ఆ పాపిస్టోడి కి ప్రాణం పోయడానికి వచ్చావా? వాడికి ఆయుష్షు పోయడానికి వచ్చావా? పానకంలో పుడకలాగా’ అని సీరియస్ అవుతాడు. అనుపమ కూడా అంతే ఆవేశంగా‘ నువ్వు కోపంతో వణికిపోతున్నావనే, నేను పానకంలో పుడకలాగా రావాల్సి వచ్చింది. నువ్వు ఫ్రస్టేషన్ తో పీక్స్ కి, పిచ్చి పరాకాష్టకు చేరుకొని, ఏం చేస్తున్నావో  అర్థంకాని స్టేజీలో ఉన్నావ్ కాబట్టే, రావాల్సి వచ్చింది’ అని బదులిస్తుంది.

Guppedantha Manasu

మహేంద్ర మాత్రం చాలా కోపంగా ఉంటాడు.‘ నేను ఏం చేస్తున్నానో అర్థం కాని స్టేజ్ లో లేను.’ అని అరుస్తాడు. దానికి అనుపమ‘ ఎందుకు మహేంద్ర అరుస్తున్నావ్? ముందు కొంచెం వాటర్ తాగు, కూల్ అవుతావ్’అంటుంది. మహేంద్ర కోపంతో ఆ బాటిల్ పక్కకు నెట్టేస్తాడు. తర్వాత ‘నువ్వు చేసినదానికి మంచినీళ్లు కాదు, ఫుల్ బాటిల్ మందు తాగినా నేను కూల్ అవ్వను’ అంటాడు. ‘ఎందుకు మామయ్య మేడమ్ మీద అరుస్తున్నావ్’ అని వసుధార అడుగుతుంది. ‘ ఈ అనుపమ రావడం వల్లే కదా, వాడు బతికిపోయింది లేదంటే వాడి శవాన్ని  పాడె మీద పడుకోపెట్టేవాడిని’ అని మహేంద్ర అంటే.. ‘ నువ్వు కూడా జైల్లో ఊచలు లెక్కపెడుతూ ఉండేవాడివి’అని అనుపమ అంటుంది. ‘అయినా పర్వాలేదు. వాడిలాంటివాళ్లు మాత్రం బతికి ఉండకూడదు చెబుతున్నాను. అనుపమ నీకు ఇంకోసారి చెబుతున్నా. నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకూడదు. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను అక్కడికి? ఎవరైనా ఫోన్ చేసి రమ్మన్నారా?’అని అడుగుతాడు. అయితే, ‘నేనే ఫోన్ చేసి రమ్మన్నాను మామయ్య. నాకు విషయం తెలిసిన తర్వాత  మీరు నాకు కంట్రోల్ అవ్వరని తెలుసుకాబట్టి, మేడమ్ కి ఫోన్ చేసి రమ్మన్నాను ’ అని వసుధార చెప్పడంతో మహేంద్ర కాస్త చల్లపబతాడు.

Latest Videos


Guppedantha Manasu

ఇక అనుపమ అందుకుంటుంది. ‘ ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నావ్? ఇప్పటిదాకా నన్ను తిట్టినట్లు  వసుధారను తిట్టవే? నామీద విరుచుకుపడినట్లు వసుధార మీద విరుచుకుపడవే? మీ మంచి కోసం, మీ శ్రేయస్సు కోసం నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి అలుసు అయిపోయాను. అందుకే నా మీ ద ఒంటి కాలు మీద లేస్తున్నావ్ . ముందు వెనకా  ఆలోచించకుండా అంత ఆవేశంగా వెళితే ఎవరికి నష్టం? మీకే కదా. నువ్వు వాడిని  చంపితే ఏం అవుతుందో ఆలోచించావా? వాడు ఒక్క బులెట్ తో నొప్పి లేకుండా సుఖంగా చచ్చిపోతాడు. తర్వాత జైలుకు వెళ్లేది నువ్వు. బాధపడేది మేము. నువ్వు వెళ్లి జైల్లో కూర్చుంటే వసుధార నీ కోసం జైలుకు రావాలా? రిషి కోసం వెతకాలా? ఇప్పటికే రిషి కనిపించకపోయే సరికి  తను సగం చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా కనపడకపోతే పూర్తిగా పతనమౌతుంది.’ అని మహేంద్రకు అనుపమ బ్రెయిన్ వాష్  చేస్తుంది.

Guppedantha Manasu

అయితే, మహేంద్ర.. ‘ వసుధార బాధ చూడలేకే కదా ఈ ఆవేశం’ అంటాడు.‘ నువ్వు చేసే పని తన బాధ తీర్చేలా లేదు. రెట్టింపు చేసేలా ఉంది. నువ్వు అనుకున్నట్లు వాడిని చంపితే రిషి దొరుకుతాడా? కనీసం ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా?’ అని అనుపమ అడుగుతుంది. దానికి వసు ‘ మేడమ్ చెప్పింది నిజమే మామయ్య. మీరు ఇప్పుడు ఆవేశంలో  శైలేంద్రను ఏమైనా చేస్తే మనకే నష్టం. ఓపికతో  ఉండాలి. తొందరపడి రాంగ్ స్టెప్ వేస్తే,రిషి సర్ గురించి తెలిసే అవకాశమే ఉండదు. ఆ శైలేంద్ర చావడానికి అయినా సిద్ధపడ్డాడు కానీ, నోరు తెరిచి నిజం చెప్పడానికి ఇష్టపడలేదు అంటే, మనం ఆలోచించాల్సిందే.’అని వసుధార అంటుంది.

‘ వాడు కావాలనే నిజం చెప్పలేదమ్మా. మరి, నీతో ఎండీ సీటు ఇస్తే చెప్పాను అని ఎందుకు అన్నాడు?’ అని మహేంద్ర అనుమానం వ్యక్తం చేశాడు. దానికి అనుపమ  ‘ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆశకంటే భయం గొప్పది. నిజంగా వాడికి రిషి గురించి తెలిసి ఉంటే, చావుకు భయపడి చెప్పేవాడు కదా?’ అని అనుపమ అంంటుంది. ‘ మరి వసుధారకు అలా ఎందుకు చెప్పాడు ?’అని మహేంద్ర అడుగుతాడు. ‘ వసుధార బలహీనతను అడ్డం పెట్టుకొని, ఎండీసీటు కొట్టేద్దాం అనుకున్నాడేమో?’ అని అనుపమ అంటుంది. అయితే.. రిషి గురించి వాడికి నిజంగానే తెలీదా? అని మహేంద్ర అడిగితే.. ‘ కచ్చితంగా తెలీదు అని చెప్పలేం. కానీ మనం నిదానంగా  ఉండాలి అంటున్నాను. వాడు చేతికి మట్టి అంటకుండా అన్నీ చేసుకుంటూ పోతుంటే నువ్వు మాత్రం మూర్ఖంగా ఆలోచించవద్దు అని చెబుతున్నాను.’ అని అనుపమ సలహా ఇస్తుంది.
 

Guppedantha Manasu

‘ అవును మామయ్య, ఏ ఆధారం లేకుండా మనం తొందరపడకూడదు. ఏదైనా జరిగితే ఎక్కువ బాధపడేది ఫణీంద్ర సర్.’ అని వసు అనగానే, మహేంద్ర ఒక్క నిమిషం ఆగిపోతాడు. అతని కళ్లల్లో తన అన్నయ్యమీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనపడుతుంది.‘ ఇప్పుడు మనం శైలేంద్ర మీద పగ తీర్చుకోవడం కాదు, రిషి సర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు’ అని వసు బాధగా చెబుతుంది. అనుపమ ధైర్యం చెబుతుంది. కచ్చితంగా రిషి దొరుకుతాడు అని చెబుతుంది. తర్వాత.. మహేంద్ర వసుని ముకుల్ కి ఫోన్ చేయమని అడుగుతాడు. సరే అని వసు ఫోన్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే రిషి సర్ కారు వచ్చిన శబ్ధం వినపడుతుంది. వెంటనే వసు ఆనందంగా రిషి సర్ వచ్చారని సంతోషంగా ‘ రిషి సర్..’ అని పిలుస్తుూ పరుగులు తీస్తుంది. కానాీ, తీరా చూస్తే, అందులో రిషి ఉండడు. ముకుల్ దిగి వస్తాడు. అది చూసి వసు ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోతాయి.

Guppedantha Manasu


కారు ఇవ్వడానికి వచ్చానని, కారు కీ ఇస్తాడు ముకుల్. కారు అవుట్ స్కర్ట్స్ లో దొరికందని, ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి తీసుకువచ్చానని ముకుల్ చెబుతాడు. ‘ కారు అయితే దొరికింది కానీ, రిషి గురించి ఏమీ తెలియలేదు.  మా కానిస్టేబుల్స్ కూడా మొత్తం వెతికారు. కానీ లాభం లేదు’ అని ముకుల్ చెబుతాడు. వసు మాత్రం ఆ కారును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అనుపమ వచ్చి, వసుని లోపలికి తీసుకువెళుతుంది. తర్వాత ముకుల్ తో వారంతా కూర్చొని మాట్లాడతారు.

Guppedantha Manasu

‘ కాలేజీ ఎండీ సీటు అప్పగిస్తే, రిషి ఎక్కడ ఉన్నాడో చెబుతాను అని శైలేంద్ర అన్నాడు’ అని వసు ముకుల్ తో చెబుతుంది.  ‘ ఓ మై గాడ్ అలా అన్నాడా? దీనిని పట్టి చూస్తే మనం ఒక విషయంలోకి క్లారిటీకి రావచ్చు. నిజంగానే రిషి సర్ శైలేంద్ర కంట్రోల్ లో ఉన్నాడో లేదో తెలీదు కానీ, శైలేంద్రకు మాత్రం ఎండీ సీటు మీద ఆశ ఉంది.’ అని ముకుల్ అంటాడు. ‘ అవును ముకుల్., ఆ ఆశతోనే వాడు ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నాడు’ అని మహేంద్ర అంటాడు. ‘వసుధారను బెదిరించాడు కదా? ఈ కారణంతో మనం అరెస్ట్ చేయలేమా?’ అని అనుపమ అడిగితే.. చేయవచ్చు కానీ, ఆ తర్వాత నేను బెదిరించలేదు అని చెప్పి బయటకు వచ్చేస్తాడు అని ముకుల్ చెబుతాడు. పైగా తను ఇక్కడికి రాలేదు, వసుధార  అక్కడికి వెళ్లారు కాబట్టి, కేసు శైలేంద్రకు అనుకూలంగా ఉంటుంది. డైరెక్ట్ గా అతని వాయిస్ దొరికితేనే డైవర్ట్ చేసి తప్పించుకున్నాడు. అలాంటిది ఏ ఆధారం లేకుండా ఒక మాట అన్నాడని వదిలేయలేం’ అని ముకుల్ అంటాడు.

వెంటనే మహేంద్ర.. ‘ శైలేంద్ర పై ఎటాక్ చేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వడం వాడి భార్య ధరణి చూసిందట. మనకు ఆ వాయిస్ రికార్డు దొరికేసరికి, దాని నుంచి తప్పించుకోవడానికి వాడంతటవాడే ఎటాక్ చేయించుకున్నాడు’ అని మహేంద్ర చెబితే.. ముకుల్ కూడా షాకౌతాడు. తర్వాత.. ధరణి వచ్చి ధైర్యంగా చెప్పగలదా అంటే.. మేము అడిగితే చెబుతుందేమో అని మహేంద్ర అంటాడు. అయితే, ‘ఇవన్నీ జగతి కేసుకు ఉపయోగపడతాయి కానీ, రిషి గురించి తెలిసే అవకాశం లేదు. చాలా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయాలని, పొరపాటున కూడా రాంగ్ స్టెప్ వేయకూడదని, ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే, రిషి ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది . మిమ్మల్ని భయపెట్టాలని నేను ఈ మాట చెప్పడం లేదు. మీరు అలర్ట్ గా ఉంటారని చెబుతున్నాను. శైలేంద్ర కాకుండా, రిషి పై ఎటాక్ చేసేవాళ్లు ఇంకెవరైనా ఉన్నారా?’ అని ముకుల్ అంటే, శైలేంద్ర మీద మాత్రమే అనుమానం ఉందని వసు చెబుతుంది. అయితే, శైలేంద్ర మీదే తాను ఎక్కువ ఫోకస్ పెడతానని, ఎలాగైనా రిషిని కాపడతానని, ఈరోజు కారు తీసుకువచ్చినట్లు, రిషి సర్ ని తీసుకువస్తాను అని ముకుల్ హామీ ఇస్తాడు.
 

Guppedantha Manasu

ముకుల్ వెళ్తూ వెళ్తూ.. శైలేంద్ర మాటల్లో ఏదైనా క్లూ దొరుకుతుందా అని అడుగుతాడు. లేదని, ఎండీ సీటు ఇస్తే, రిషి గురించి చెబతాను అన్నాడని, ఎక్కడ ఉన్నాడు అనే విషయం చెప్పలేదు అని వసు అంటుంది.సరే అని చెప్పి ముకుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

ఇక, వసు.. ఆకారును చూసి రిషిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా, అప్పుడే రిషి వచ్చి కారు  ఎక్కమని చెప్పినట్లు, సీటు బెల్టు పెట్టుకోమని చెప్పినట్లు  అనిపించి, నిజంగానే పెట్టుకుంటుంది. కానీ, అందులో రిషి లేడని గ్రహించి.. ఏడుస్తుంది. ‘ మీతో కలిసి చాలా ప్రయాణాలు చేశాను. చాలా దూరం ప్రయాణించాను. ఎన్నో అనుభవాలను రుచి చూశాను. కానీ ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాను. ఉండలేకపోతున్నాను. మీరిలా మధ్యలో వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. కష్టంగా ఉంటోంది. నిద్రపోలేకపోతున్నాను, తినలేకపోతున్నా,ఊపిరి తీసుకోలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే,  మీరు లేకుండా బతకలేకపోతున్నాను సర్. ’ అని ఏడుస్తుంది. కారులో వినాయకుడి విగ్రహానికి దండం పెట్టుకుంటుంది.

తెల్లారితే, వసు కాలేజీకి వెళ్తుంది.  అక్కడ కూడా రిషి కుర్చీ చూసి బాధపడుతూ ఉంటుంది. గతంలో రిషి తనకు ఇచ్చిన బహుమతిని చూసుకొని మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. మీరు కనిపించడం లేదని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఎక్కడ ఉన్నారు సర్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే ఫణీంద్ర, మహేంద్ర ఇద్దరూ కలిసి వస్తారు. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాం అని అంటారు. ఏంటని వసు అడిగితే.. అర్జెంట్ గా బోర్డ్ మీటింగ్ పెట్టమని అడుగుతున్నారని మహేంద్ర చెబుతాడు. అంత అర్జెంట్ గా ఎందుకు పెట్టమని అడుగుతున్నారని వసు అడిగితే, కాలేజీ  యాజమాన్యం మీద, కాలేజీలో విధి విధానాల గురించి చెప్పడానికి అయ్యి ఉండొచ్చు అని మహేంద్ర అంటే.. సరే మీటింగ్ పెడదాం అని వసు అంటుంది. కానీ, రిషి లేడు కదా అని అంటాడు. రిషి లేకుండా మీటింగ్ ఎలా పెడతాం..? రిషి కనిపించడం లేదని బయటపడకూడదనే కదా సీక్రెట్ గా ముకుల్ కి చెప్పాం..మరి ఎలా అని  ముగ్గురూ చర్చించుకుంటారు. వసు బాగా ఆలోచించి.. రిషి సర్. మిషన్ ఎడ్యుకేషన్ మీద టూర్ వెళ్లారని అబద్ధం చెబుదాం అని అంటుంది.  భవిష్యత్తులో సమస్య వస్తుందేమో అని మహేంద్ర అంటే... పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుదాం అని ఫణీంద్ర ధైర్యం ఇస్తాడు.  వసుధార చెప్పిన ఐడియాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వసు మాత్రం.. మీకు తెలీకుండా మరో అబద్ధం చెబుతున్నాను అని తనలో తానే బాధపడుతుంది. 

click me!