Guppedantha Manasu 20th February Episode:రిషి ప్లేస్ పై మను కన్ను, , శైలేంద్రను బెల్టుతో కొట్టిన దేవయాణి..!

First Published | Feb 20, 2024, 9:16 AM IST

రేపు ఏకంగా ఎండీ సీటు కావాలని అంటాడని ఇచ్చేస్తారా అని అడుగుతాడు. అయితే.. శైలేంద్రకు ఇష్టం లేదు అనే విషయం అందరికీ అర్థమౌతుంది. అదే విషయం మనుకి  మినిస్టర్ చెబుతాడు. 
 

Guppedantha Manasu

Guppedantha Manasu 20th February Episode:శైలేంద్ర ఆట కట్టించడానికి మను కూడా కాలేజీలో ఒక భాగం కావాలని అనుకుంటాడు. దాని కోసం తనకు బోర్డు మెంబర్ గా ఉండే అవకాశం ఇవ్వమని అంటాడు. అయితే అందుకు అర్హత ఏంటో చెప్పమంటే అది కూడా చెబుతాడు. కానీ, మొదట పదవులు ఏవీ వద్దు అన్నావ్ కదా  వసుధార అడుగుతుంది. అయితే.. ఈ కాలేజీ బాగుపడటం కొందరు దుర్మార్గులకు ఇష్టం లేదని, కాలేజీని నాశనం చేయాలని చూస్తున్నారని, వాళ్ల ఆాట కట్టించడమే తన ప్రధాన కర్తవ్యం అని మను చెబుతాడు. మినిస్టర్ గారు కూడా మను తీసుకున్న నిర్ణయం కరరెక్ట్ అని పిస్తోందని, బోర్డు మెంబర్ గా ఉంటే బాగుంటుందని వసుధారతో చెబుతారు.  అలా ఎలా అంటారు అని శైలేంద్ర మధ్యలో దూరిపోతాడు. అయితే.. అది కేవలం తన అభిప్రాయం మాత్రమే అని మినిస్టర్ అంటాడు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోమని మహేంద్ర, ఫణీంద్రలకు కూడా చెబుతాడు. అయితే.. మను కి పోస్ట్ ఇవ్వడం వసుకి ఇష్టం ఉండదు. దీనిని ఎలా ఆపాలి అని అనుకుంటుంది.

Guppedantha Manasu

కానీ.. ఇతర బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ.. మను కి ఆ పోస్టు ఇవ్వడం తమకు ఇష్టమే అని చెబుతూ ఉంటారు. ఆయన కాలేజీకి మంచి చేశారు కదా అని వాళ్లు అంటారు. అయితే.. శైలేంద్ర మాత్రం ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. ఈ రోజు బోర్డు మెంబర్ గా ఉంటానన్నాడని, రేపు ఏకంగా ఎండీ సీటు కావాలని అంటాడని ఇచ్చేస్తారా అని అడుగుతాడు. అయితే.. శైలేంద్రకు ఇష్టం లేదు అనే విషయం అందరికీ అర్థమౌతుంది. అదే విషయం మనుకి  మినిస్టర్ చెబుతాడు. 

Latest Videos


Guppedantha Manasu

దానికి మను‘ మీకు అవసరం లేదంటే నాకు కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్న స్థితికంటే కాలేజీ మరింత దారుణంగా తయారైతే నేను ఇచ్చిన రూ.50కోట్లు తిరిగి నాకు ఎవరు ఇస్తారు..? చెప్పండి శైలేంద్ర గారు మీరు ఇస్తారా రూ.50కోట్లు.? మీరు ఇస్తానంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. రూ.50కోట్లు ఇస్తారా?’అని అడుగుతాడు. వాడి దగ్గర రూ.50 కూడా ఉండవు, ఇంక, రూ.50కోట్లు ఏం ఇస్తాడు? అని ఫణీంద్ర పరువు తీసేస్తాడు. అంతేకాదు.. కాలేజీ సమస్యలు తీర్చడం చేత కాదు కానీ.. తిక్క ప్రశ్నలు వేస్తున్నావ్ అని తిడతాడు.

Guppedantha Manasu

ఆ తర్వాత.. మను తమ కాలేజీకి చాలా మంచి చేశాడని, కొందరు తమ కాలేజీని నాశనం చేయాలని చూస్తున్నారని, ఒక సమస్య సాల్వ్ చేసేలోగా, మరో సమస్య సృష్టిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మాకు అండగా ఉండాలని ఫణీంద్ర అంటాడు. ఇది నా అభిప్రాయం అని చెబుతాడు. అయితే.. ఫణీంద్ర ఒప్పుకోవడంతో ఏమీ చేయలేని స్థితిలో వసు పడిపోతుంది. వసుధార మాత్రం ఒప్పుకోదు అని శైలేంద్ర అనుకుంటాడు.  ఆ తర్వాత మహేంద్ర కూడా తనకు ఇష్టమే అని, కానీ వసుధార ఏమంటుందో అంటాడు. దీంతో.. అందరూ వసుధార అభిప్రాయం అడుగుతారు. చాలా సేపు ఆలోచించి మీ ఇష్టం అని వసు అనేస్తుంది. వసు నిర్ణయానికి శైలేంద్ర షాకౌతాడు. అందరికీ అర్థమయ్యేలా చెప్పు అని స్ట్రెస్ చేసి మరీ అడుగుతాడు. అయితే.. వసు తనకు కూడా ఒకే అని మరోసారి క్లారిటీ ఇస్తుంది. మనుగారుు ఈ రోజు నుంచి డీబీఎస్టీ కాలేజీ బోర్డు మెంబర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అని చెబుతుంది. అందరూ చప్పట్లు కొట్టి సంతోషాన్ని తెలియజేస్తారు. మను కూడా వెంటనే థ్యాంక్స్ చెబుతాడు. తర్వత వసు తనకు పని ఉందని చెప్పి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu

అందరూ మనుకి కంగ్రాంట్స్ చెబుతూ ఉంటారు. శైలేంద్ర మాత్రం ఫుల్ ఫ్రస్టేట్ అవుతాడు. తాను ఏధో అనుకుంటే మరేదో అయిపోతుందని అనుకుంటాడు. ఆ తర్వాత వెళ్తున్న మనుని పిలిచి మరీ శైలేంద్ర మాట్లాడతాడు. నువ్విచ్చే షాకులకు తనకు స్ట్రెస్ పెరిగిపోతోందని చెబుతాడు. ఎవరు నువ్వు అసలు అని అడుగుతాడు. దానికి మను చెప్పాను కదా.. కాలేజీ కష్టాల్లో ఉంటే కాపాడటానికి వచ్చాను అని అంటాడు. ఎవడు పడితే వాడు రావడమేనా, ఇది తన కలల సామ్రాజ్యం అని, కాలేజీని తాను దక్కించుకోవాలని చూస్తుంటే, నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావ్? ఆ ఎండీ సీటులో కూర్చోవాలి అనేది తన కోరిక అని  దాని కోసం తాను చాలా చేశానని, నేరాలు, ఘోరాలు చేశానని, నా గురించి నీకు తెలీదని, ప్రతిసారి తన పనులకు అడ్డువస్తే తనలోని రాక్షసుడిని చూస్తావ్ అని వార్నింగ్ ఇస్తాడు.

Guppedantha Manasu

అయితే, మను కోపంగా చూడటం చూసి కొడతావా అని అడుగుతాడు. అవసరం అయితే కొడతాను అని  మను అంటాడు. తర్వాత.. అందరి ముందు రూ.50కోట్లు ఇఛ్చావ్, తర్వాత చెక్ చెంపేశావ్, ఇప్పుడు బోర్డు మెంబర్ అయ్యావ్.. ఏం కావాలి నీకు కూడా ఆ ఎండీ సీటు కావాలా లేక.. ఆ వసుధార కావాలా? అని అడుగుతాడు. ఆ మాటకు మనుకి మండిపోయి.. శైలేంద్రను లాగిపెట్టి మరీ కొడతాడు. వీరి మధ్య జరుగుతున్న వార్ ని అనుపమ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అయితే.. శైలేంద్ర మాత్రం తనతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ భూమ్మీద లేరని, నీ అంతు కూడా చూస్తాను అని  శైలేంద్ర అంటాడు. అయితే.. మను మాత్రం.. నువ్వు ఏం చేసినా ఆ ఎండీ సీటు నీకు దక్కకుండా చేస్తాను అని  బదులిస్తాడు. శైలేంద్ర కొట్టడానికి చెయ్యి ఎత్తితే.. ఆ చేతిని కూడా పట్టుకుంటాడు. సాఫ్ట్ ఉన్నాడు ఏమీ చెయ్యలేడు అనుకుంటున్నావేమో.. నేను బరిలోకి దిగితే మామూలుగా ఉండదు అని అంటాడు. నీ అంతు చూస్తాను అని శైలేంద్ర అంటే.. ఈ కాలేజీ నుంచే నిన్ను దూరం చేస్తాను అని మను కూడా వార్నింగ్ ఇస్తాడు.

Guppedantha Manasu

అక్కడి నుంచి మను వచ్చేస్తుంటే అనుపమ ఎదురౌతుంది. ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. అయితే... అనుపమ కాదు తాను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటుంది. ‘ ఏంటి ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావ్?బోర్డు మెంబర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావ్?’ అని అడుగుతుంది. దానికి మను.. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని, నిజాలు త్వరలో మీకే తెలుస్తాయి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

ఇక వసు లోపలికి వెళ్లి ఫ్రస్టేట్ అవుతూ ఉంటుంది. మను ని బోర్డు మెంబర్ ఉంచడం ఇష్టం లేదని.. కానీ ఎందుకు ఒప్పుకున్నానా అని తెగ చించుకుంటూ ఉంటుంది. అందరూ అడిగినప్పుడు నో అని చెప్పకుండా.. ఎలా ఒకే చెప్పాను అని.. అక్కడ ఉన్న పేపర్స్ అన్నీ విసిరేస్తుంది. అప్పుడే మను వస్తాడు. ఏం చేస్తున్నారు అని మను అడిగితే.. నా క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు అని వసు అడుగుతుంది. మీతో మాట్లాడటానికి అని మను చెబుతాడు. ఏం మాట్లాడతారు అని వసు అంటే.. మీరు మాట్లాడినదానిని బట్టి మాట్లాడతాను అని మను అంటాడు. ఉదయం ఫోన్ చేసి ఏదో మాట్లాడాలి అన్నారు కదా అని అంటాడు. నిజానికి ఆ విషయ ం వసు మర్చిపోతుంది కానీ. గుర్తుందని కవర్ చేస్తుంది.

Guppedantha Manasu

అప్పుడు తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, కానీ.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని చెబుతుంది. అయితే.. తన గురించి వసు తప్పుగా అనుకుంటోంది అనే విషయం మనుకి అర్థమౌతుంది. అలా తన గురించి ఒక అభిప్రాయానికి రావద్దు అని ఏదో చెప్పబోతున్నా వసు వినిపించుకోదు. మాట్లాడేదేమీ లేదు అని  చిరాకు పడుతుంది. మను మాత్రం వదలకుండా తాను కూర్చోని మాట్లాడాలి అని కూర్చుంటాడు. ఏంటో చెప్పమని వసు అంటే... వసు తన పక్కన ఎండీ కుర్చీని రిషి కోసం వదిలేసిన దాని గురించి అడుగుతాడు.  ఆ సీటులో రిషి సర్ మాత్రమే కూర్చోవాలని, ఆ సీటులో ఇంకెవరినీ కూర్చోనివ్వను అని వసు చెబుతుంది. 

Guppedantha Manasu

ఇక ఛాన్స్ దొరికిందని వసు.. మనుపై రిషితో పోలుస్తూ, సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. రిషి గురించి చాలా గొప్పగా చెబుతుంది. రిషి సర్ తన పక్కన కాదని, తన గుండెల్లో ఉంటారు అని, ఆయనే తన శ్వాస, ఆయన తన మాట అని చెబుతుంది. దానికి  మను అయితే.. ఇందాక నన్ను బోర్డు మెంబర్ గా ఒప్పుకున్నారు అంటే అది కూడా రిషి సర్ మాటే కదా  థాంక్యూ మేడమ్ అని చెప్పేసి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu


ఇక కాలేజీలో జరిగినదానిని తలుచుకొని శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. బెల్టు తీసుకొని తనను తాను పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటూ ఉంటాడు. అయితే..దేవయాణి వచ్చి కొడుకుని ఆపుతుంది. తన ఒంట్లో రోషం తగ్గిపోయిందని అందుకే కొట్టుకుంటున్నాను అని చెబుతాడు. తాను కొట్టుకోవడమే కాదు.. తల్లినే కొట్టమని అడుగుతాడు. మొదట కొట్టడానికి దేవయాణి సంకోచించినా..తర్వాత కొడుకు మాట కాదనలేక కొట్టడానికి ఒప్పుకుంటుంది. దేవయాణి కొడుతూ ఉంటుంది. అప్పుడే ధరని వచ్చి... ఎంత ధైర్యం ఉంటే మా ఆయన్నే కొడతారా అని.. అత్త నే కొట్టడానికి రెడీ అవుతుంది.

అయితే.. తాను కొట్టడం లేదని, శైలేంద్ర కొట్టమని అంటేనే కొట్టాను అని దేవయాణి చెబుతుంది. ఏమైంది..? ఒళ్లు తిమ్మిరి ఎక్కిందా అని ధరణి అడుగుతుంది. కాదు అని ఫ్రస్టేషన్ అని శైలేంద్ర చెబుతాడు. అయితే.. ధరని మాత్రం..వాళ్ల అత్త పై సీరియస్ అవుతుంది. కొట్టమంటే కొట్టేస్తారా అని అడుగుతుంది. తర్వాత.. దేవయాణి నా మీదకు బెల్ట్ ఎత్తావేంటి అని అడుగుతుంది. ఆయనను కొడుతున్నారని కోపంలో అలా చేశాను అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!