తోటి కంటెస్టెంట్ తో లవ్ ఆపై బ్రేకప్, డిప్రెషన్ లో బిగ్ బాస్ రన్నర్!

Published : Jan 13, 2024, 10:33 AM IST

బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ డిప్రెషన్ కి గురయ్యాడట. ఈ విషయాన్ని నేరుగా చెప్పాడు. లవ్ బ్రేకప్ వలనే అఖిల్ మనోవేదనకు గురయ్యాడని వార్తలు వస్తుండగా ఆయన క్లారిటీ ఇచ్చాడు.   

PREV
17
తోటి కంటెస్టెంట్ తో లవ్ ఆపై బ్రేకప్, డిప్రెషన్ లో బిగ్ బాస్ రన్నర్!
Akhil Sarthak

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ సార్థక్ పాల్గొన్నాడు. అఖిల్ కి అంతకు ముందు పెద్దగా ఫేమ్ లేదు. అయితే బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. హౌస్లో మనోడు లవ్ స్టోరీ నడిపాడు. 

 

27

హీరోయిన్ మోనాల్ గజ్జర్-అఖిల్ సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. మోనాల్ గజ్జర్ కి అభిజీత్ కూడా లైన్ వేశాడు. కానీ ఆమె అఖిల్ ని ఇష్టపడింది. అప్పుడప్పుడు అభిజీత్ తో కూడా మాట్లాడేది. అది అఖిల్ కి నచ్చేది కాదు. అభిజీత్ తో మాట్లాడితే మోనాల్ మీద అలిగేవాడు. 

37

తాము లవర్స్ అని దాదాపు కన్ఫర్మ్ చేశారు. బయటకు వచ్చాక కూడా వీరు సన్నిహితంగా ఉన్నారు. మీరు స్నేహితులా ప్రేమికులా అని అడిగితే... చెప్పలేం. స్నేహానికి మించి మా మధ్య ఏదో ఉందని చెప్పారు. మెల్లగా వీరు కలవడం మానేశాడు. 

 

47

మోనాల్ తో లవ్ బ్రేకప్ వలన అఖిల్ డిప్రెషన్ కి గురయ్యాడని వార్తలు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను డిప్రెషన్ కి గురైన మాట వాస్తవమే. కానీ అందుకు కారణం లవ్ ఫెయిల్యూర్ కాదు అన్నాడు. స్నేహితులే నన్ను కెరీర్ లో తొక్కేయాలని చూశారు. అది నన్ను వేదనకు గురి చేసింది అన్నారు. 

57


మోనాల్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికీ టచ్ లో ఉంది. గతంలో మేము కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళం. దాని వలన మేము లవర్స్ అనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఫోటోలు షేర్ చేయడం లేదని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చాడు. 

67
Bigg Boss Nonstop

అభిజీత్, బిందు మాధవి కూడా నాతో టచ్ లో ఉన్నారు. కొందరి కంటే వాళ్లే మంచివాళ్ళు అనిపిస్తుంది. వారిద్దరి కారణంగా నేను చాలా నేర్చుకున్నాను, అని చెప్పుకొచ్చాడు.

 

 

77

అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కాగా అభిజీత్ రన్నర్. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న అఖిల్ అక్కడ కూడా రన్నర్ గా నిలిచాడు. బిందు మాధవి టైటిల్ విన్నర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అఖిల్ సపోర్ట్ చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories