శివాజీతో కోల్డ్ వార్... అలా అయితే టైటిల్ నాకు ఇవ్వాలిగా, అమర్ దీప్ సెన్సేషనల్ కామెంట్స్ 

Published : Jan 16, 2024, 12:11 PM IST

బిగ్ బాస్ షో ముగిశాక కూడా అమర్ దీప్, శివాజీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అమర్ దీప్ ని హైలెట్ చేసి చూపించారని శివాజీ పరోక్ష కామెంట్స్ చేయగా అమర్ రెస్పాండ్ అయ్యాడు.   

PREV
17
శివాజీతో కోల్డ్ వార్... అలా అయితే టైటిల్ నాకు ఇవ్వాలిగా, అమర్ దీప్ సెన్సేషనల్ కామెంట్స్ 
Bigg Boss Telugu 7

శివాజీ, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా గొడవలు ఆడుకుంటున్నారు. శివాజీ ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి పేరు నేను చెప్పను.బిగ్ బాస్ అతన్ని  హైలెట్ చేసి చూపించాడు. చిన్న చిన్న విషయాలకు కూడా బిగ్ బాస్ అతన్ని పొగిడేవాడు. 

27
Amar Deep

అతనికి రన్నర్ అయ్యే అర్హత లేదన్నాడు. అదే సమయంలో ఎడిటింగ్ ద్వారా తనను విలన్ చేశారని శివాజీ అన్నాడు. అలాగే స్టార్ మా వాళ్ళు సీరియల్ బ్యాచ్ అయిన అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలను సపోర్ట్ చేసి నెట్టుకొచ్చారనే వాదనలు వినిపించాయి. 

 

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

37

ఈ కామెంట్స్ పై అమర్ దీప్ ఓపెన్ అయ్యాడు. మేము ముగ్గురమే(అమర్ దీప్, శోభ, ప్రియాంక) కనిపిస్తున్నామా? ఇంకా ఏ ముగ్గురు(శివాజీ, యావర్, ప్రశాంత్) కనిపించడం లేదా?. 

47

స్టార్ మా నన్ను సపోర్ట్ చేస్తే.. నేను బ్యాడ్ అవుతుంటే ఎందుకు చెప్పలేదు. టైటిల్ నాకు ఎందుకు ఇవ్వలేదు. నేను ప్రశాంత్ ని తోసుకుంటూ వెళుతుంటే ఎందుకు కట్ చేసి చూపించలేదు?

57

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదు. వెనుక మాట్లాడటం కాదు. ముందు స్ట్రెయిట్ గా మాట్లాడాలి. శివాజీ చేసిన కామెంట్స్ కి అమర్ దీప్ కౌంటర్ ఇచ్చాడు. అదే సమయంలో తనపై జరిగిన దాడి మీద కూడా స్పందించారు. 

 

67

కారు అద్దాలు పగలగొట్టారు. బూతులు తిట్టారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళను అసహ్యంగా తిట్టారు. బూతు సందేశాలు, ఫోటోలు మా అమ్మకు భార్యకు, చెల్లికి పంపారు. అప్పుడు కారు దిగితే ఏం చేసేవాళ్ళు.. అంటూ అమర్ దీప్ కీలక కామెంట్స్ చేశారు. 

77
Amar Deep

హౌస్లో ప్రధానంగా శివాజీ వెర్సెస్ అమర్ దీప్ అన్నట్లు సాగింది. బయటకు వచ్చాక కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. శివాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టు గెదర్స్ లో కనిపించడం లేదు. ఇంటర్వ్యూలలో శివాజీ, అమర్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 
 

 

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

click me!

Recommended Stories