BrahmaMudi 21st March Episode:నా రక్తం, నా కొడుకు.. బిడ్డను పరిచయం చేసిన రాజ్, షాక్ లో దుగ్గిరాల ఫ్యామిలీ..!

First Published | Mar 21, 2024, 10:07 AM IST

ఆ బాబు ఎవరు..? అనాథా..? పెంచుకుంటున్నావా? అమ్మా, నాన్న లేరా అని అపర్ణ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. కానీ.. ఒక్క ప్రశ్నికి కూడా రాజ్ సమాధానం ఇవ్వడు.
 

Brahmamudi


BrahmaMudi 21st March Episode:కలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యను ఇందిరాదేవి ఫంక్షన్ జరిగే దగ్గరకు తీసుకొని వస్తుంది. కావ్య చాలా అందంగా రెడీ అవుతుంది. దీంతో.. లక్ష్మీ దేవిలా ఉన్నావ్ అని కనకం మురుసుకుంటుంది. మహాలక్ష్మిలా ఉన్నావ్ అని మూర్తి అంటాడు. అయితే.. అల్లుడు గారు వస్తే ఏం చెబుతారా అని భయంగా ఉంది అని కనకం అంటే... అంతా మంచే జరుగుతుంది అని ఇందిరాదేవి అంటుంది. అంతలోనే రాజ్ వచ్చేస్తాడు. నా మనవడుకి నిండు నూరేళ్లు అని ఇందిరాదేవి అంటుంది.

Brahmamudi

ఇక.. రాజ్ కారు దిగి.. మరో వైపు డోర్ తీయడానికి వెళ్తూ ఉంటాడు. ఏదో పెద్ద గిష్టే తెచ్చి ఉంటాడు అని రుద్రాణి అంటుంది. అయితే.. రాజ్.. ఒక చిన్నబాబుని ఎత్తుకొని వస్తాడు. అది చూసి కావ్య సహా అందరూ షాకౌతారు. ఎవరు ఆ బిడ్డ అని అందరూ అడుగుతూ ఉంటారు. బాబు అనుకుంట అని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే.. ఆ బాబు ఎవరు..? అనాథా..? పెంచుకుంటున్నావా? అమ్మా, నాన్న లేరా అని అపర్ణ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. కానీ.. ఒక్క ప్రశ్నికి కూడా రాజ్ సమాధానం ఇవ్వడు.

Latest Videos


Brahmamudi

కావ్య వైపు చూసి.. అందరూ ప్రశ్నలు అడిగారు.. నువ్వు ఏమీ అడగవా అంటాడు. కావ్య షాక్ లోనే ఉండి చూస్తూ ఉండిపోతుంది. నువ్వు అడకగపోయినా.. నేను చెబుతాను నాతో రా కళావతి అంటూ.. కావ్య చెయ్యి పట్టుకొని స్టేజీ మీదకు వెళతాడు. ‘ కాసేపట్లో ఈ వేదిక మీద వేడుక జరుగుతుందని నువ్వు ఎదురుచూస్తున్నావని నాకు తెలుసు.కానీ, ఇదే వేధిక మీద నేను ఇప్పుడు ఒక నిజాన్ని చెప్పదలుచుకున్నాను. అది విని తట్టుకునే శక్తి నీలో ఉందనే అనుకుంటున్నాను. అందరిలా నువ్వేమీ అడగలేదు. ఎందుకంటే..  ఇంకా నీలో ఏదో మూల నమ్మకం. ఆ నమ్మకం నిజం కాదు. ఈ నిజం నమ్మక తప్పదు. వీడు నా రక్తం. నా బిడ్డ.’ అని రాజ్ చెప్పగానే అందరూ షాకౌతారు. కావ్య పరిస్థితి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

Brahmamudi

‘ ఏం మాట్లాడుతున్నాడ్రా వీడు’ అని రుద్రాణి అంటే.. నాకు మాత్రం ఏం తెలుసు అని రాహుల్ అంటాడు. అయితే.. రాజ్ మాత్రం తాను చెప్పాలి అనుకున్నది చెబుతాడు. ‘ వీడు ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. దుగ్గిరాల వారసుడిగానే పెరుగుతాడు’ అని చెబుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రాజ్.. నీ బిడ్డ ఏంటి? ఈ ఇంటి వారసుడేంటి? ఇక్కడ పెరగడం ఏంటి? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని అపర్ణ సీరియస్ అవుతుంది. ఇందిరాదేవి కూడా సీరియస్ అవుతుంది.

Brahmamudi

కావ్యను ఏడిపించాలని ఇలా చేస్తున్నావా? తమాషా చేస్తున్నావా? నీ బిడ్డేంటి? ఈ నెలల బిడ్డతో ఇంటికి రావడం ఏంటి? అని ఇందిరాదేవి అడుగుతుంది. వదినను ప్రాంక్ చేస్తున్నావ్ కదా అని కళ్యాణ్ అడుగుతాడు. రాజ్ నువ్వు అబద్ధం చెప్పవురా..కానీ నిజం దాచి పెడుతున్నావ్, నువ్వు చెబుతున్నది నిజం కాదు, నీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ చీకటి కోణం ఉంది అంటే.. ఎవరు నమ్మినా నేను నమ్మను  అని ధాన్యలక్ష్మి అంటుంది.

Brahmamudi

రాహుల్ తప్పు చేశాడంటే నమ్ముతాం కానీ.. నవ్వు తప్పు చేశావని నువ్వే  చెప్పినా మేం నమ్మం అని ప్రకాశం అంటాడు. ఇదంతా నిజం కాదని, ఏదో మాయలా ఉందని.. నా మనసు ఒఫ్పకోవడం లేదని మూర్తి అంటాడు. మీరు వస్తారని ఇద్దరూ కలిసి పెళ్లిరోజు వేడుకగా చేసుకుంటారని, కళ్లారా మీ జంట ను చూసి.. మనసారా దీవించాలని వెర్రి ఆశతో మేం వస్తే.. మా గుండెలు ముక్కలు చేసే మాట చెబుతున్నారేంటి? మాకే ఇలా ఉంటే.. నా బిడ్డ పరిస్థితి ఏంటి? మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.. దాని ముఖం చూసి అయినా నిజం చెప్పండి అని కనకం అడుగుతుంది

Brahmamudi

కానీ.. అబద్దాన్ని నిజం అని చెప్పలేని తాను.. నిజాన్ని అబద్ధం అని కూడా చెప్పలేను అని.. ఇది నిజం, ఇదే నిజం.. నిజంగా ఈ బిడ్డ నా బిడ్డే, ఇక నుంచి ఈ ఇంటి వారసుడు అని మరోసారి చెబుతాడు. కావ్య మాటలు రాకుండా నిలపడిపోయి చూస్తూ ఉంటుంది. ఇక.. ఇందిరాదేవి రాజ్ ని తిట్టడం మొదలుపెడుతుంది. మనిషిలా మాట్లాడు.. ఒక అమ్మాయి గొంతు కోస్తావా? మరో ఆడదానితో బిడ్డని కంటావా అని ప్రశ్నిస్తుంది. కావ్యను నువ్వు మోసం చేయలేవని.. అది నీకు చేతకాదని ఇందిరాదేవి అంటుంది.

Brahmamudi

కానీ.. రుద్రాణి మాత్రం.. రాజ్ స్వయంగా తాను తప్పు చేశాను అని చెబుతుంటే.. నిజం కాదుు అంటారేంటి అని అడుగుతుంది.  ఇక.. ఛాన్స్ దొరికిందని వాళ్ల వదినను ప్రశ్నిస్తుంది.  ఇన్నాళ్లు నా కొడుకు సరిగా పెంచలేదు అన్నారు కదా.. మీరు నీ కొడుకు భార్య ఉండగా.. మరో ఆడదానితో బిడ్డను కని ఏకంగా బిడ్డను ఇంటికి తీసుకువచ్చాడుు అని.. ఇదేనా నీ పెంపకం.. ఇన్నాళ్లు నా కొడుకు రాజు, రారాజు అన్నావ్.. నీ కొడుకు ఇప్పుడు బిడ్డను తీసుకువచ్చాడు.. నీ పెంపకం గురించి మా ముందు గొప్పలు చెప్పకు అని రుద్రాణి చివాట్లు పెడుతుంది.

Brahmamudi

ఇక.. తన పెంపకాన్ని తక్కువ చేస్తున్నారని.. దానికి కారణం నువ్వే అని..  ఇలాంటి పాపిస్టి పని ఎలా చేశావ్? నీ భార్య గుర్తు రాలేదా? నేను గుర్తుకు రాలేదా? ఈ వంశం గుర్తుకు రాలేదా అని గట్టిగా తిడుతుంది.  భర్తను పిలిచి.. రాజ్ ని ఎందుకు నిలదీయడం లేదేంటి అని అడుగుతుంది. వాడికి  అన్నీ తెలిసినా తప్పు చేశాడని.. తల్లిగా నువ్వు ఓడిపోయినట్లే.. తండ్రిగా నేను ఓడిపోయినట్లే అని.. కాకపోతే.. నా కోడలికి ఎవరు సమాధానం చెప్పగలరు అని సుభాష్ అంటాడు. ఒకరి తర్వాత ఒకరుుగా ప్రశ్నిస్తూనే ఉంటారు. కళ్యాణ్, ఇంటి పెద్ద సీతారామయ్య, మూర్తి ఎవరు ఏం అడిగినా రాజ్ మాట్లాడడు.

Brahmamudi

అయితే.. మాకు సమాధానం చెప్పకపోయినా,.. కావ్య కు సమాధానం చెప్పమని ఇందిరాదేవి అడుగుతుంది. కానీ.. తన దగ్గర సమాధానం లేదని.. ప్రతిసారీ కావ్య పై గెలవాలనే అనుకున్నాను అని... కానీ ఓడిపోయాను అని అంటాడు. ఇద్దరం ఓడిపోయాం అని.. ఎవరిని ఎవరు ఓదార్చాలో తెలియడం లేదని రాజ్ అంటాడు. అందరినీ క్షమించమని అడగడం తప్ప తానేమీ చేయలేను అనేసి  రాజ్ బాధగా చెబుతాడు. కానీ ఆ బిడ్డ మాత్రం తన బిడ్డే అని.. అందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి రాజ్  అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Brahmamudi

రాజ్ వెనకే వెళ్లిన కావ్య... ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. తాను విడాకుల కాగితాలు ఇచ్చాను కదా.. దానికి సమాధానం ఏంటి అని అడుగుతుంది. మీ జీవితానికి సంబంధించిన ఓ విషయం చెబుతా అన్నారు అది ఇదేనా అని అడుగుతుంది. అందరూ బిడ్డ గురించే ప్రశ్నించారు.. ఆ బిడ్డ తల్లి గురించి ఎవరూ అడగలేదు.. అసలు ఆ బిడ్డకు తల్లి ఎవరు అని కావ్య అడుగుతుంది. మరి రాజ్ ఆ ప్రశ్నకు సమాధానం చెబుతాడో లేదో చూడాలి.

click me!