BrahmaMudi 17th January Episode: వామ్మె అనామికతో కష్టమే.. ఫస్ట్ నైట్ రోజునే కవికి చుక్కలు చూపించింది..!

First Published Jan 17, 2024, 10:51 AM IST

అందరూ వచ్చి చూసేసరికి.. హాల్ లో అనామిక నిద్రపోతూ కనపడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. అనామికను లేపుతుంది.

Brahmamudi

BrahmaMudi 17th January Episode: శోభనం గదిలో అనామిక, కళ్యాణ్ కూర్చొని ఉంటారు. అప్పుడు కళ్యాన్.. అనామికు తాను తెచ్చిన గిఫ్ట్ ఇస్తాడు. ఆ నక్లెస్ చూసి అనామిక మురిసిపోతుంది. చాలా బాగుందని చెబుతుంది. దీంతో.. కళ్యాణ్... మా వదిన టేస్ట్ అంటే అలానే ఉంటుంది అని చెబుతుంది. అంతే అనామికకు చిర్రున కోపం వస్తుంది. కావ్య టాపిక్ ఎందుకు తెచ్చావ్ అంటుంది. తనకు సెలక్షన్ రాకపోతే.. వదినను అడిగానని చెబుతాడు. అంతే.. ప్రతి విషయంలోనూ కావ్య, అప్పూల ప్రస్తావన ఎందుకు తెస్తున్నావ్ అంటుంది. పూజ మధ్యలో కూడా నన్ను వదిలేసి అప్పూ కోసం వెళ్లావ్  అని అంటుంది. తన ఫ్రెండ్ ప్రమాదంలో ఉంటే.. రక్తం ఇవ్వడానికి వెళ్లానని.. అందులో తప్పేంటి అని అడుగుతాడు. తప్పే అని చిరాకు పడుతుంది. వాళ్లు ఎక్కడ చస్తే నాకేంటి.. శోభనం గదిలో మన గురించి మనం ఆలోచించాలి కానీ అని అంటుంది. దానికి కళ్యాణ్ కి కూడా కోపం వస్తుంది. అలా మాట్లాడతావేంటి అని, వచ్చిన దగ్గర నుంచి తాను ఎంత కూల్ గా ఉండాలని చూసినా, తనను రెచ్చగొడుతున్నావ్ అని సీరియస్ అవుతాడు. నేను గొడవ పడ్డానా అని అనామిక అంటుంది. అవును అని కవి కూడా అంటాడు. మళ్లీ సర్దిచెప్పాలని చూస్తే.. నీతో నాకు శోభనం వద్దంటే వద్దు అని.. డెకకరేషన్ మొత్తం పాడు చేస్తుంది. బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంది.  వద్దని, బయటకు వెళితే.. అందరికీ తెలిసిపోతుందని కళ్యాణ్ సర్ది చెప్పాలని చూసినా వినకుండా.. వెళ్లి బయట హాల్ లో పడుకుంటుంది.
 

Brahmamudi

తెల్లారేసరికి.. స్వప్న కు మెళకువ వస్తుంది.. లేవడం లేవడం.. రుద్రాణికి ఫోన్ చేస్తుంది. కానీ.. రుద్రాణి లేవదు. లిఫ్ట్ చేసే వరకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక.. తప్పక రుద్రాణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏం కావాలి అని అడిగితే.. ఉదయాన్నే కాఫీ తాగుతాను అని తెలీదా తీనుకొని రా అంటుంది. ఇది ఎప్పటి నుంచి అని రుద్రాణి అంటే.. ఈ రోజు నుంచే.. లేచి తీసుకొని రా అంటుంది. రుద్రాణి పడుకొని లేవకుండానే.. లేచాను...వెళ్తున్నాను అని చెబుతుంది. నమ్మని స్వప్న.. నేను డోర్ దగ్గరే ఉన్నాను అని చెబుతుంది. దీంతో.. ఇక తప్పక కాపీ తేవడానికి రుద్రాణి లేచి కిందకు వెళ్తుంది.

Latest Videos


Brahmamudi

అలా రుద్రాణి వెళ్లే సరికి హాల్ లో అనామిక పడుకొని కనపడుతుంది. అంతే.. ఇక.. రుద్రాణి సంబరపడిపోతుంది. వీళ్ల కాపురం కూడా కొల్లేరు అయ్యిందని.. దుగ్గిరాల ఇంటికి వారుసుడు వచ్చే సూచనలు ఏమీ కనపడట్లేదు అని ఆనందపడుతుంది. ఈ విషయం అందరికీ చూపించాలి అని.. అందరినీ లేపుతుంది. అందరూ వచ్చి చూసేసరికి.. హాల్ లో అనామిక నిద్రపోతూ కనపడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. అనామికను లేపుతుంది.

Brahmamudi

అనామిక లేవడం లేవడం.. ఆంటీ అంటూ ఏడుస్తుంది. ఏమైందమ్మా.. రాత్రంతా హాల్ లోనే పడుకున్నావా అని అడుగుతారు. అవును అనిచెబుతుంది. అప్పుడే కళ్యాణ్ నిద్రలేచి కిందకు దిగుతాడు. అందరూ అనామిక, కళ్యాణ్ లను ఏం జరిగింది అని అడుగుతారు. కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడరు. కళ్యాన్.. తాను అనామికను ఏమీ అనేదని.. గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు.

Brahmamudi

అయితే.. రాహుల్ మాత్రం తాను ఏదైనా తప్పు చేస్తే తన అత్త ధాన్యలక్ష్మి దెప్పి పొడుస్తుందని..మరి తన కొడుకు తప్పు చేస్తే ఏం తీర్పు ఇస్తుందో చూడాలి అని అంటాడు. వెంటనే.. స్వప్న.. కళ్యాణ్ తో నీకు పోలిక ఏంటి అని అంటుంది. కళ్యాన్ ఏ రోజూ ఎవరినీ బాధపెట్టడు అని సపోర్ట్ చేస్తుంది. ఇందిరాదేవి కూడా.. నిజమే అని..  కళ్యాణ్ ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదని.. ప్రేమించిన అమ్మాయిని శోభనం రోజు బాధపెట్టే మనిషి అస్సలు కాదని అంటుంది. సో.. ఏం జరిగిందో అనామిక చెప్పాలి అని అని అంటుంది.

అనామిక నోరు తెరవకపోవడంతో.. కళ్యాణ్.. ఆమెను గదిలోకి తీసుకువెళ్తుంటాడు. కానీ రుద్రాణి ఆపుతుంది. తన కొడుకు, కోడలు విషయంలో మాత్రం రచ్చబండ దగ్గర రచ్చ చేసినట్లు చేస్తారు.. కళ్యాణ్ విషయం మాత్రం లోపల మాట్లడుకుంటారా..వీల్లేదు.. రాత్రి ఏం జరిగిందో చెప్పాల్సిందే అని పట్టుపడుతుంది. ఇక అపర్ణ, ధాన్యలక్ష్మి కూడా ఏమైందో చెప్పమని అనామికను అడుగుతారు.

Brahmamudi

అప్పుడు అనామిక చెప్పడం మొదలుపెడుతుంది. ‘ కళ్యాణ్ నన్ను కొట్టినా, తిట్టినా ఆ గదిలోనే భరించేదానిని అని, కానీ.. మా ఇద్దరి పర్సనల్ విషయాల్లో అప్పూ, కావ్యల ప్రసక్తి తెస్తున్నాడు. ఈయనకు వదిన దేవత, ఆ అప్పూ ప్రేమ దేవత.’ అని అంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదారా నీకు అని సుభాష్.. కళ్యాణ్ పై అరుస్తాడు. వెంటనే కళ్యాన్.. మా వదిన టాపిక్ ఎందుకు తెస్తున్నావ్ అనామిక అని కళ్యాణ్ అనగానే.. చూశారా అత్తయ్య.. కనీసం వాళ్ల వదిన పేరు కూడా నేను ఎత్తకూడదు అని మళ్లీ ఏడుపు మొదలుపెడుతుంది.

అది వినడం ధాన్యలక్ష్మి.. కావ్యను తిట్టడం మొదలుపెడుతుంది. నీ చెయ్యి పడితే ఏదైనా నాశనమే.  వ్రతంలో చెయ్యి పెట్టావ్..వ్రతం ఆగిపోయింది. శోభనం గది అలంకరించావ్.. అది కూడా ఆగిపోయింది.. మహా తల్లి.. నా కొడుకు, కోడలు విడిపోతే కానీ నీకు సంతోషం ఉండదా అని అంటుంది. ఆ మాటకు రాజ్ కి కోపం వస్తుంది. కళ్యాణ్, అనామిక గొడవల్లో కళావతిని లాగొద్దని, తాను కూడా అనామిక లాగా బయట నుంచి వచ్చిన అమ్మాయేనని చెబుతాడు.
 

Brahmamudi

అంతే.. రాజ్ ని కూడా కావ్య మార్చేసిందని. . ఈ పిన్ని గయ్యాళిలా కనపడుతోందని మళ్లీ రచ్చ చేస్తుంది. కావ్యను అనకూడని మాటలన్నీ అనేస్తుంది. కావ్యను నువ్వు ఎందుకు బాధపెడుతున్నావ్ అని ప్రకాశం కూడా ధాన్యలక్ష్మికి సర్ది చెప్పాలని చూస్తాడు. కళ్యాణ్ కూడా.. వదిన తప్పేమీ లేదు అని చెప్పగానే.. అనామిక అందుకుంటుంది. అంటే తప్పంతా నాదేనా.. నేను ఎంత బాధపడకపోయి ఉంటే.. బయటకు వచ్చి హాల్ లో పడుకుంటాను అని అంటుంది.

Brahmamudi

ఇక ధాన్యలక్ష్మి కూడా కోడలి తరపున వత్తాసు పలుకుతుంది. ప్రేమించి, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నావ్ కదా.. మరి ఎందుకు అడ్డమైన వాళ్ల ప్రస్తావ తెచ్చి బాధపెడుతన్నావ్ అని కొడుకును అడుగుతుంది. ఆ మాటకు కావ్యకి కూడా కోపం వస్తుంది. ‘ చిన్నత్తయ్య, అడ్డమైన వాళ్లు అనే మాట కరెక్ట్ కాదు. కవి గారికి ఇంట్లో అందరూ సమానమే. నామీద అభిమానంతో ఓ చిన్న మాట ఎత్తి ఉండొచ్చు. అంత మాత్రాన  నేను చెయ్యని తప్పుకు నన్ను ఎందుకు నిందిస్తున్నారు? నా చెయ్యి మంచిది కాదు అని నిందలు వేస్తున్నారు. నేను కూడా మనిషినే. నా తప్పు లేకుండా మీరు నింద వేస్తుంటే.. ఇది పద్దతి కాదు’ అని చెబుతుంది.

‘పద్దతులు నువ్వు నాకు నేర్పుతున్నావా..? నా కొడుకు అనామికు ప్రేమిస్తున్నాడని తెలిసి  కూడా నీ చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదా?’ అని ధాన్యలక్ష్మి ప్రశ్నిస్తుంది. ‘ అనుకోలేదు. మీరు అలా అనుకుంటే దానికి ఎవరూ ఏమీ చెయ్యలేరు. మీరు నన్ను సాధించడమే పనిగా పెట్టుకుంటే నేను ఏమీ చెయ్యలేను’ అని కావ్య బదులిస్తుంది. ఏమన్నావ్ అని ధాన్యలక్ష్మీ సిరియస్ అయితే.. కరెక్ట్ గానే అంది అని స్వప్న బదులిస్తుంది. వెంటనే ధాన్యలక్ష్మి ‘ ఏయ్ స్వప్న నువ్వు మాట్లాడకు. పెళ్లికి ముందే రాహుల్ తో లేచిపోయిన నువ్వు, ముసుగు వేసుకొని రాజ్ ని పెళ్లి చేసుకున్న నీ చెల్లెలు.. మీరంతా కరెక్టా..? నా కోడలు అలా రాలేదు. సంప్రదాయబద్దంగా పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుంది’ అని అనామిక గురించి గొప్పగా చెబుతుంది. ఆ మాటలకు రాజ్ కి విపరీతంగా కోపం వస్తుంది. ‘ కళ్యాణ్...’ అని అరుస్తాడు.
 

click me!