Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!

Published : May 04, 2026, 10:49 AM IST

Vijay-Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంయలో.. త్రిష తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. కాగా, అక్కడ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ కి త్రిష ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

PREV
13
తిరుపతిలో త్రిష...

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఓ వైపు ఓట్ల లెక్కింపు జోరుగా జరుగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల మేరకు విజయ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. సరిగ్గా.. విజయ్ టాప్ లో ఉన్న సమయంలోనే.. త్రిష తిరుపతిలో దర్శనానికి రావడం  హాట్ టాపిక్ గా మారింది. త్రిష తన పుట్టిన రోజు సందర్భంగానే తిరపతి వెళ్లినా.. ఇదే సమయంలో.. ఎన్నికల ఫలితాలు ఉండటం ఇప్పుడు  చర్చనీయాంశమైంది..

23
ఫ్యాన్ కామెంట్ కి త్రిష రియాక్షన్..

ఈ ఉత్కంఠ నడుమ, త్రిష తన తిరుపతి ప్రయాణం గురించి ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ముందుగానే హింట్ ఇచ్చారు.  కారులో ప్రయాణిస్తూ.. ‘తిరుపతి’ బోర్డును చూపించారు. ఆమె సుప్రభాత సేవ ద్వారా ఆ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఆమె సుప్రభాత సేవ తర్వాత బయటకు వస్తున్న సమయంలో త్రిషను చూసి అక్కడ ఫ్యాన్స్ ఉత్సాహంగా పలకరించారు. అయితే.. అభిమానుల్లో ఒకరు.. ఎన్నికల గురించి కామెంట్ చేయడం విశేషం. ‘ రిజల్ట్ మనవైపే ఉంది’ అని ఒక అభిమాని గట్టిగా అరిచాడు. దానికి త్రిష.. ఎలాంటి కామెంట్ చేయకపోయినా… చిన్నగా నవ్వడం విశేషం. ఆమె నవ్వుతున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

33
బర్త్ డే స్పెషల్..

త్రిష తన 42వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు తిరుమల దర్శనానికి వచ్చారు. కాగా.. ఆమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  విజయ్ గెలుపు కోసమే త్రిష తిరుపతికి వెళ్లారని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, త్రిష నటించిన 'కరుప్పు' సినిమా మే 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె సూర్యకు జోడీగా నటించారు. ఆర్.జె. బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

త్రిష ప్రస్తుతం ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ వదంతులేనని ఆమె స్పష్టం చేశారు. అలాగే, త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. దాన్ని కూడా ఆమె ఖండిస్తూ, తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని తేల్చి చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories