రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ యానిమల్. శుక్రవారం రోజు విడుదలైన ఈ చిత్రం సందీప్ స్టైల్ లోనే ఉంటూ ఆకట్టుకుంటోందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొంతవరకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ వాటితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద యానిమల్ చిత్రం బీభత్సం సృష్టిస్తోంది.