'యానిమల్'లో ఆ సీన్స్ చూసి మా అమ్మానాన్న బాధపడ్డారు, ఎందుకు నటించావు అన్నారు..తృప్తి డిమ్రి

First Published | Dec 11, 2023, 4:39 PM IST

యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో  తృప్తి డిమ్రి యువతకి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. నెటిజన్లంతా ఆమె గురించే చర్చించుకుంటున్నారు.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి ఎగబడుతూనే ఉన్నారు.  

ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ  తృప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. రణబీర్ తో కలసి తృప్తి డిమ్రి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో త్రిప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.   


యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో  తృప్తి డిమ్రి యువతకి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. నెటిజన్లంతా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. అయితే తాను యానిమల్ మూవీలో నటించినందుకు తన ఫ్యామిలీ మాత్రం బాగా ఇబ్బంది పడినట్లు తాజాగా ఇంటర్వ్యూలో తృప్తి తెలిపింది. 

Tripti Dimri

ఆ సన్నివేశాల్లో నన్ను చూసి జీర్ణించుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది. ఇలాంటి సన్నివేశాలని మేమెప్పుడూ చూడలేదు. నువ్వు ఈ చిత్రం చేయకుండా ఉండాల్సింది. ఈ సన్నివేశాల్లో నటించకుండా ఉండాల్సింది. అయినా పర్వాలేదు లే.. మేము కాస్త డిస్ట్రబ్ అయ్యాం అని అన్నారు. ఆ సన్నివేశాలు చూశాక తేరుకోవడానికి వాళ్ళకి సమయం పట్టింది. 

Tripti Dimri

తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వృత్తిలో భాగంగా ఆ పాత్రకు న్యాయం చేయాలి. తాను అదే చేసినట్లు వాళ్ళకి చెప్పా. సందీప్ నాకు ఈ చిత్రం గురించి ముందే చెప్పారు. రణబీర్ తో శృంగార సన్నివేశంలో నటించాలి అని అన్నారు. 

కథ విన్నప్పుడే ఇందులో ఆ సన్నివేశం అవసరం అని అర్థం అయింది. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు కానీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తృప్తి పేర్కొంది. 

Latest Videos

click me!