VD 12 : విజయ్ దేవరకొండ కోసం త్రిప్తి డిమ్రి, రుక్మిణి వసంత్ మధ్య వార్?

First Published | Feb 16, 2024, 7:00 PM IST

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కు ఇద్దరు ముద్దుగుమ్మలు హ్యాండివ్వగా ఇప్పుడు వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ లో పక్క ఇండస్ట్రీల హీరోయిన్ల సందడి నెలకొంది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్స్ ఇటు బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత సినిమాలను ఆచితూచి చేస్తున్నారు. గతంలో వరుసగా ఐదు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. చివరిగా ‘ఖుషి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో నెక్ట్స్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. 
 


ఇక తాజాగా విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీలా Sreeleela... రష్మిక మందన్న Rashmika Mandannaలు ఈ చిత్రానికి హ్యాండ్ ఇచ్చారు. 
 

ఇప్పుడు క్రేజీ హీరోయిన్లు త్రిప్తి డిమ్రి (Tripti Dimri), ‘సప్తసాగరాలు దాటి సైడ్ - ఏ, బీ’ చిత్రాల హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) విజయ్ దేవరకొండ VD12 సినిమాలో నటించేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. 

ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మించనున్నాయి. మొదటిసారిగా విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండటం విశేషం. 
 

familystar

ఇక విజయ్ దేవరకొండ నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ Family Star చిత్రంతో అలరించబోతున్నారు. ఈ చిత్రం సమ్మర్ లో రాబోతుందని తెలుస్తోంది. ఇంకా ఫైనల్ డేట్ రావాల్సి ఉంది. విజయ్ సరసన బాలీవుడ్ నటి మ్రుణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!