Top 5 Female Villains: గ్లామర్‌తో కాదు, క్రూరత్వంతో అదరగొట్టారు.. విలన్లుగా మారిన బెస్ట్ టాప్‌ 5 హీరోయిన్లు వీరే

Published : Mar 08, 2026, 01:47 PM IST

Top 5 Female Villains: పెద్ద తెరపై గ్లామర్‌తోనే కాదు, విలనిజంతోనూ చుక్కలు చూపించారు మన హీరోయిన్లు. అలా క్రూరత్వంతో భయపెట్టించిన బెస్ట్ టాప్‌ 5 హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.   

PREV
16
బెస్ట్ టాప్‌ 5 లేడీ విలన్లు

మహిళా దినోత్సవం సందర్భంగా, పెద్ద పెద్ద స్టార్లు కూడా చేయడానికి భయపడే పాత్రలను పోషించిన బాలీవుడ్ నటీమణుల గురించి ఇప్పుడు చూద్దాం. వీరు గ్లామర్‌తో కాదు, నెగటివ్‌ రోల్్స తో, క్రూరత్వం కలిగిన పాత్రలతో మెప్పించారు. విలనిజంలో బెస్ట్ అనిపించుకున్న టాప్‌ 5 హీరోయిన్లు వీరే. 

26
`అంధాధున్‌`లో విలన్‌గా టబు

2018లో వచ్చిన 'అంధాధున్' సినిమాలో టబు నెగెటివ్ రోల్ చేశారు. ఈ సినిమాలో ఆమె ఒకదాని తర్వాత ఒకటి నేరాలు చేస్తూ, చాలా తెలివిగా ముందుకు సాగుతుంది. ఇందులో అదరగొట్టింది. బెస్ట్ లేడీ విలన్‌ అనిపించుకున్నారు. 

36
`ఐత్రాజ్‌`లో విలన్‌గా ప్రియాంక చోప్రా
2004లో వచ్చిన 'ఐత్రాజ్' చిత్రంలో ప్రియాంక చోప్రా నెగెటివ్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాతో ఆమె ఫీమేల్ విలన్ పాత్రకు కొత్త గుర్తింపు తెచ్చారు. ఆమె నటనకు అప్పట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
46
గుప్త్ లో కాజోల్‌

1997లో వచ్చిన 'గుప్త్' సినిమాలో కాజోల్ విలన్‌గా నటించారు. ఆమె పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందంటే, చూసిన వారి ఒళ్లు గగుర్పొడిచింది. నిజానికి, మొదట ఈ పాత్ర చేయడానికి కాజోల్ ఒప్పుకోలేదు. చాలా మంది నచ్చజెప్పిన తర్వాతే ఆమె ఈ రోల్ చేయడానికి అంగీకరించారు. తర్వాత బెస్ట్ విలన్‌ అనిపించుకున్నారు.

56
ఇష్కియాలో విద్యా బాలన్‌

విద్యా బాలన్ 2010లో వచ్చిన 'ఇష్కియా' చిత్రంలో నెగెటివ్ రోల్ చేశారు. ఆమె గ్రే షేడ్ ఉన్న పాత్ర చేయడం అదే మొదటిసారి. ఈ సినిమాలో ఆమె పాత్ర, నటన రెండూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ విలన్‌ అనిపించుకున్నారు. 

66
జిస్మ్ లో బిపాసా బసు

2003లో వచ్చిన 'జిస్మ్' సినిమాలో బిపాసా బసు నెగెటివ్ రోల్‌లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె చాలా పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఆమె నటనకు అప్పట్లో మంచి ప్రశంసలు దక్కాయి.  బెస్ట్ విలన్‌ అనిపించుకున్నారు. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు నెగటివ్‌ రోల్స్ చేశారు. కానీ వీరి బెస్ట్ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories