ఈ 10 సినిమాలు చూస్తే చాలు, మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు

Published : Jan 24, 2025, 12:52 PM IST

దర్శకులు అనేక అంశాలపై కథలు సిద్ధం చేసుకుని చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. డబ్బు అంశంపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. డబ్బు సంపాదించడానికి, కోటీశ్వరులుగా ఎదగడానికి స్ఫూర్తిని నింపే 10 చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
111
ఈ 10 సినిమాలు చూస్తే చాలు, మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు

దర్శకులు అనేక అంశాలపై కథలు సిద్ధం చేసుకుని చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. డబ్బు అంశంపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. డబ్బు సంపాదించడానికి, కోటీశ్వరులుగా ఎదగడానికి స్ఫూర్తిని నింపే 10 చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

211

ది సోషల్ నెట్వర్క్   

ఈ చిత్రం 2010లో డేవిడ్ ఫింఛర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రంగా తెరకెక్కింది. జుకర్ బర్గ్ పాత్రలో జెస్సి ఐసెన్ బర్గ్ నటించారు.   

311

స్టీవ్ జాబ్స్   

స్టీవ్ జాబ్స్ చిత్రం డాన్నీ బోయల్ దర్శకత్వంలో 2015లో విడుదలయింది. యాపిల్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన పాత్రలో మిచెల్ ఫాస్బెండర్ నటించారు. 

 

411

ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ 

ఇది కూడా బయోపిక్ చిత్రమే. అమెరికన్ స్టాక్ బ్రోకర్ జోర్డాన్ బెల్ఫోర్ట్ జీవితం, ఆయన చేసిన ఆర్థిక నేరాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జోర్డాన్ పాత్రలో టైటానిక్ స్టార్ లియోనార్డో డికాప్రియో నటించడం విశేషం. 

511

మనీ బాల్  

ఈ చిత్రం కూడా బయోపిక్ చిత్రమే. ఆక్లాండ్ లో అథ్లెటిక్స్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన బిల్లీ బీన్ చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన పాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించారు. ఈ చిత్రం డబ్బు, క్రీడలు, అథ్లెటిక్స్ చుట్టూ తిరుగుతుంది. 

611

ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ 

అమెరికాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్రిస్ గార్డెనర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన పాత్రలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగపతి బాబు మా నాన్న చిరంజీవి అనే టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 

711

ది పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వాలీ 

ఇది కూడా బయోపిక్ తరహా చిత్రమే. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ ఇద్దరూ 20వ శతాబ్దాన్ని ఎలా ప్రభావితం చేశారు అనే అంశాలని ఈ చిత్రంలో చూపించారు. మార్టిన్ బుర్కే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

811

జాయ్ 

అమెరికన్ మహిళా వ్యాపారవేత్త జాయ్ మాంగానో జీవితం ఆధారంగా డైరెక్టర్ డేవిడ్ రస్సెల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. జాయ్ పాత్రలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ నటించారు.భర్తతో విడాకుల తర్వాత సొంతంగా ఎదగడానికి ఆమె పడ్డ కష్టాలు, వ్యాపారంలో రాణించి బిలీనియర్ గా ఎలా ఎదిగింది అనే అంశాలని ఈ చిత్రంలో చూపించారు. 

911

రాకెట్ మాన్ 

బ్రిటీష్ మ్యుజీషియన్ ఎల్టన్ జాన్ లైఫ్ ఆధారంగా 2019లో రాకెట్ మాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎల్టన్ పాత్రలో టరాన్ ఎగెర్ టోన్ నటించారు. 

1011

ది ఫౌండర్  

అమెరికాకు చెందిన దివంగత వ్యాపారవేత్త రే క్రోక్ జీవితం ఆధారంగా డైరెక్టర్ జాన్ లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రే క్రోక్ పాత్రలో మిచెల్ కేటోన్ నటించారు. 

1111

స్టార్ట్ అప్ డాట్ కామ్ 

స్టార్ట్ అప్ డాట్ కామ్ అనేది డాక్యుమెంటరీ చిత్రం. గొవ్ వర్క్స్ సంస్థకి ఎదురైన సమస్యలు, 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ బబుల్ వల్ల ఎదురైనా తీవ్ర ఇబ్బందుల గురించి ఈ చిత్రంలో చూపించారు. 

Read more Photos on
click me!

Recommended Stories