Dil Raju: మహేష్ తో అనుకున్న వారసుడు విజయ్ తో అందుకే చేయాల్సి వచ్చింది!

First Published Dec 16, 2022, 5:44 PM IST

ఒక నెలరోజులుగా దిల్ రాజు పేరు అందరి నోళ్లలో నానుతుంది. ఆయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారసుడు సంక్రాంతి విడుదలతో మొదలైన వివాదం అనేక మలుపులు తీసుకుంది. ఈ క్రమంలో దిల్ రాజు మీడియా వేదికగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వారసుడు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయకూదంటూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. వారసుడు డబ్బింగ్ చిత్రం నేపథ్యంలో అత్యంత డిమాండ్, కాంపిటీషన్ కలిగిన సంక్రాంతి సీజన్ కి విడుదల చేయడం సరికాదు. థియేటర్స్ సమస్య వస్తుందని నిర్మాతల మండలి అభ్యంతరం చెప్పింది. దీనిపై దిల్ రాజు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే తమిళ దర్శక నిర్మాతల నుండి టాలీవుడ్ కి హెచ్చరికలు జారీ అయ్యాయి. వారసుడు మూవీ తెలుగు రాష్ట్రాల్లో అడ్డుకుంటే తమిళనాడులో తెలుగు సినిమాలు విడుదలకానీయం అంటూ అల్టిమేటం జారీ చేశారు. 

వారసుడు(Varasudu) సంక్రాంతి బరిలో దించాలనే తన పంతం దిల్ రాజు నెగ్గించుకున్నారు. అదే సమయంలో దిల్ రాజు మైత్రీ మూవీ మేకర్స్ పై కత్తి కట్టాడు అనేది ప్రధాన ఆరోపణ. మైత్రీ స్వయంగా నిర్మించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల కలెక్షన్స్ దెబ్బతీసేందుకు ఆయన స్కెచ్ వేసిపెట్టాడట. మైత్రీ తమ సినిమాలు దిల్ రాజు చేతిలో పెట్టకుండా స్వయంగా విడుదల చేసుకోవడమే దీనికి కారణమట . వారసుడు మూవీ కోసం పెద్ద ఎత్తున థియేటర్స్ లాక్ చేసి ఉంచిన దిల్ రాజు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు థియేటర్స్ పూర్తి స్థాయిలో లభించకుండా చేసే ప్రణాళికలు రచించారట. 
 


ఈ ఆరోపణల నేపథ్యంలో దిల్ రాజు స్పందించారు. శుక్రవారం `డీఆర్‌పీ` పేరుతో కొత్త ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు దిల్‌రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మైత్రీ మూవీ మేకర్స్ తో నాకు ఎలాంటి విబేధాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో నాకు దాదాపు ఒక 70 సినిమా థియేటర్స్ ఉన్నాయి. వాటిని నేను గ్రౌండ్ లీజ్ కి తీసుకోవడం జరిగింది. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ థియేటర్స్ ని రీమోడలింగ్ చేయించాను. మరి నా సినిమా విడుదల ఉన్నప్పుడు మంచి థియేటర్లో విడుదల చేయాలి అనుకుంటాను కదా... 


వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలకు థియేటర్స్ దొరకవు అనడంలో నిజం లేదు. అన్ని సినిమాలకు థియేటర్స్ లభిస్తాయి. ఇంకా ఈ లెక్క తేలలేదు. నేను కొన్ని థియేటర్స్ నా మూవీ కోసం లాక్ చేసిన ఉంచిన మాట వాస్తవమే. జనవరి మొదటివారంలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ అనేది తెలుస్తుంది. ఇదంతా అవగాహనతో సరిదిద్దుకోవాల్సిన వ్యవహారం. సి.కళ్యాణ్ రెండు సింగిల్ స్క్రీన్స్ ఉన్న సెంటర్స్ లో వారసుడు ఒక స్క్రీన్ లో ఆడితే మరో స్క్రీన్ లో చిరంజీవి లేదా బాలయ్య సినిమాకు మాత్రమే అవకాశం ఉంటుంది, అన్నారు. అది నిజం కాదు.
 

 
రెండుసింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రోజుకు పది షోలో పడతాయి. అప్పుడు మూడు సినిమాలకు షోస్ పంచుకోవచ్చు. కొందరు నాపై కక్ష కట్టారు.  లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారు. దిల్ రాజు అనేవాడు ఎదిగాడు. గ్లామర్ ఉన్న పర్సన్, అందుకే ఇవన్నీ చేస్తున్నారు. వారసుడు సినిమా విడుదల ఆపాలంటే నాతో మాట్లాడాలి. కానీ వీరు ప్రెస్ మీట్ పెడతారు. ప్రజలకు సంబంధం లేని పరిశ్రమ అంతర్గత వ్యవహారం జనాలకు చెప్పాల్సిన పని లేదు. 
 


మైత్రీ వాళ్ళ చిత్రాలను, ఆ సంస్థను తొక్కేయాలని చూస్తున్నాను అనడం నిరర్ధకం. అది ఒక సంస్థ. అలాగే పరిశ్రమలో ఎవరిని ఎవరూ తొక్కలేరు. నిర్మాణం చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. సినిమా విడుదలకు ముందే అందరికీ డబ్బులు ఇచ్చేయాలి. నిర్మాత మాత్రం ప్రేక్షకుడు నుండి రాబట్టాలి. బ్యాడ్ టాక్ వస్తే ఫస్ట్ షోకే సినిమా ఢమాల్. ఒక సినిమాకు రెండు కోట్లు నష్టం వస్తే... రెండో మూవీ విడుదల చేసే నాటికి అది వడ్డీతో ఐదు కోట్లు అవుతుంది. మరో రెండు ప్లాప్స్ పడితే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవాలి. 
 


కోలీవుడ్ హీరో విజయ్ తో వారసుడు చేయడానికి కారణం... టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేకపోవడమే. మొదట ఈ స్క్రిప్ట్ మహేష్(Mahesh babu) తో అనుకున్నాము . ఆయన వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తో చేద్దాం అనుకున్నాం. చరణ్ మా బ్యానర్ లోనే శంకర్ సినిమాకు ఫిక్స్ అయ్యాడు. అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఖాళీగా లేరు. దాంతో వారసుడు విజయ్ తో చేయాల్సి వచ్చింది, అని దిల్ రాజు పలు విషయాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 
 

click me!