టాలీవుడ్ భాక్సాఫీస్: “3 నెలల్లో 6 హిట్స్”..అవేమిటంటే...

Published : Apr 10, 2023, 04:14 PM IST

  వాల్తేరు వీరయ్య, వీరసింహా, దసరా సహా 2023లో టాలీవుడ్‌లో హిట్ స్టేటస్ అందుకున్న మూవీస్..మరి కొన్ని ఉన్నాయి. అవేమిటంటే...

PREV
17
టాలీవుడ్ భాక్సాఫీస్: “3 నెలల్లో 6 హిట్స్”..అవేమిటంటే...
Tollywood 2023


 2023లో మూడు నెలలు గడిచిపోవటంతో టాలీవుడ్ ట్రేడ్ లెక్కలు వేసుకుంటోంది . ఈ మూడు నెలల్లో అత్యంత కీలకమైన సంక్రాంతి సీజన్‌ ఉండటం విశేషం. ఈ నేపధ్యంలో ఎన్ని సూపర్ హిట్స్, ఎన్ని యావరేజ్ లు అనేది లెక్క తేల్చుకుంటున్నారు.  సంక్రాంతికి  రెండు డైరెక్ట్ చిత్రాలు.. రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టం పరీక్షించుకున్నాయి. అందులో బాలయ్య .. వీరసింహారెడ్డితో నూ .. చిరంజీవి.. వాల్తేరు వీరయ్యతోనూ పలకరించారు. భాక్సాఫీస్ వద్ద పోటీపడ్డ ఈ రెండు సినిమాలు పోటీ కలెక్షన్స్ తో భాక్సాఫీస్ వద్ద  దుమ్ము దులిపాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘రైటర్ పద్మభూషణ్’, సార్ చిత్రాలు సక్సెస్ సాధిస్తే.. మార్చి నెలలో ‘బలగం’, చివర్లో ‘దసరా’ అదిరిపోయే టాకే సొంతం చేసుకున్నాయి. మొత్తంగా 2023 మొదటి మూడు నెలల్లో ఆరు చిత్రాలు  బాక్సాఫీస్ విజేతలుగా నిలిచాయి.

27


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహరెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి, బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా నిలిచింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లోవరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ లు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
 

37


మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు రూ.230 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్‌కే కాదు, చిరంజీవికి సైతం ‘వాల్తేరు వీరయ్య’ స‌క్సెస్ మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకునేలా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు ఆడియెన్స్ మెచ్చేలా ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమానుత తెర‌కెక్కించారు.

47
writer padmabhushan


కలర్ ఫొటో సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకుని సూపర్ హిట్ అందుకున్న కమెడియన్ సుహాస్.. ఇటీవలే తన రెండో చిత్రం రైటర్ పద్మభూషణ్‌తో సందడి చేశాడు. థియేటర్లలో ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సుహాస్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఫిబ్రవరిలో విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది.

57


తమిళ్ స్టార్ హీరో ధనుష్(dhanush) నటించిన సార్ మూవీ(Sir movie) మార్చి 5 న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ(venky atluri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా సంయుక్త మీనన్(samyuktha menon) నటించింది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో నేరుగా వచ్చిన ధనుష్ మొదటి చిత్రం ఇదేనని చెప్పవచ్చు. గతంలో అనువాద చిత్రాలు మాత్రమే తెలుగులో విడుదలయ్యేవి. సార్ మూవీని తమిళంలో వాతి పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది.

67


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెద్ నటీ నటులు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ విలేజ్ డ్రామా “బలగం”. తెలుగు రాష్ట్రాల్లో ఫామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో కదిలించిన ఈ సినిమాకి అంతర్జాతీయ లెవెల్లో పలు అవార్డులు వరుసగా వస్తూ ఉండడం విశేషం. కాగా లేటెస్ట్ గా మరో ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఈ సినిమా మెరిసింది. ఇండో ఫ్రెంచ్ మూవీ ఫెస్టివల్ లో ఈ సినిమాకి క్రిటిక్స్ ఛాయిస్ లో వేణుకి అలాగే హీరో ప్రియదర్శికి బెస్ట్ పెర్ఫామర్ గా రెండు అవార్డులు దక్కాయి. దీనితో ఈ విషయాన్నీ దిల్ రాజు నిర్మాణ సంస్థ వారు షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రియదర్శి కూడా ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
 

77


నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు. మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.దీంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. రెండో వీకెండ్ కు కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. ముఖ్యంగా నైజాంలో ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగుంది.

click me!

Recommended Stories