ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించాడు. తాజాగా బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డులకెక్కాడు. ఐకాన్ స్టార్ తర్వాత 21.3 మిలియన్లతో విజయ్ దేవరకొండ , 20.8 మిలియన్ల తో రామ్ చరణ్, 14.1 మిలియన్లతో దుల్కర్ సల్మాన్ , 13.5 మిలియన్లతో యశ్ , 13.4 మిలియన్లతో మహేశ్ బాబు ప్రభాస్ 11.7 మిలియన్లు, దళపతి విజయ్ 10.8 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.