సక్సెస్ కోసం ఎన్ని అవమానాలు భరించారో..!

First Published 22, May 2019, 12:52 PM IST

మన సినిమాల్లో హీరోలను ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులుగానే చూపిస్తుంటారు.

మన సినిమాల్లో హీరోలను ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులుగానే చూపిస్తుంటారు. లగ్జరీ లైఫ్, కాస్ట్లీ కార్లలో తిరుగుతూ కనిపిస్తుంటారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరోలు జీవితంలో సెటిల్ అవ్వలేక, సక్సెస్ కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ కనిపించారు. వారెవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం!
వెంకటేష్ - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకీ తన తండ్రి మీద ఆధరపడి బ్రతుకుతుంటాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఇబ్బందిపడే వ్యక్తిగా ఆ పాత్రలో జీవించేశాడు.
రవికృష్ణ - 7/G బృందావన కాలనీ సినిమాలో ఈ హీరో చదువు పూర్తి చేయకుండా చిల్లరగా తిరుగుతూ తండ్రితో, చుట్టుపక్కల వారితో ఎన్నో మాటలు పడుతుంటాడు.
శ్రీవిష్ణు - ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ నేటి తరం అబ్బాయిలకు దగ్గరగా ఉంటుంది. ఏవరేజ్ స్టూడెంట్ అయిన హీరోకి సరైన ఉద్యోగం రాక ఎన్నో అవమానాలు పడుతూ కనిపిస్తాడు.
ధనుష్ - రఘువరన్ బీటెక్ సినిమాలో హీరో ధనుష్ తన చదువుకి సంబంధించిన ఉద్యోగమే చేయాలని నానా కష్టాలు పడుతుంటాడు.
రవితేజ - ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఓ యువకుడు పడే కష్టాలను 'నేనింతే' సినిమాలో చూపించారు. ఈ సినిమాలో రవితేజతో పాటు అన్ని పాత్రలు కూడా సక్సెస్ కోసం పరితపిస్తుంటారు.
సునీల్ - మర్యాద రామన్న సినిమాలో హీరో సునీల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బందిపడుతూ కనిపిస్తాడు. తనకు సంబంధించిన ల్యాండ్ అమ్మి సెటిల్ అవ్వాలనే ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడతాడు.
విజయ్ దేవరకొండ - పెళ్లిచూపులు సినిమాలో ఈ హీరోకి చదువురాక ఫుడ్ ట్రక్ బిజినెస్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు.
నితిన్ - తన కెరీర్ ఆరంభంలో 'సంబరం' వంటి సినిమాలో నటించాడు ఈ హీరో. లైఫ్ లో ఏం చేయాలో తెలియక తనలో ఉన్న టాలెంట్ ని తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేస్తుంటాడు.
సుమంత్ - 'సత్యం' సినిమాలో రైటర్ గా తనను తానూ నిరూపించుకోలేక ఇబ్బంది పడే హీరో పాత్రలో సుమంత్ జీవించేశాడు.
నాగచైతన్య - 'మజిలీ' సినిమాలో ప్రేమలో ఫెయిల్ అయిన తరువాత తన కెరీర్ ని సాగించలేక అందరితో అవమానాలు పడే పాత్రలో హీరో క్యారెక్టర్ లో నాగచైతన్య మంచి పెర్ఫార్మన్స్ కనబరిచాడు.
సాయి ధరం తేజ్ - 'చిత్రలహరి' సినిమాలో సాయి ధరం తేజ్ క్యారెక్టర్ కి నేటితరం అబ్బాయిలు బాగా కనెక్ట్ అయిపోయారు. సక్సెస్ అందుకోవడం కోసం ఎన్నో అవమానాలు పడుతూ ఫైనల్ గా తన సత్తా చాటతాడు.
నాని - రీసెంట్ గా విడుదలైన 'జెర్సీ' సినిమాలో నాని క్యారెక్టర్ ఎంతో హార్డ్ వర్క్ తో కూడుకున్నది. సినిమాలో తన భార్యతో తిట్లు తింటూ మరోపక్క తను కన్న కలను నిజం చేసుకోవడానికి పరితపిస్తుంటాడు.