వెంకీ, నితిన్, చైతూ సినిమాల దసరా పోస్టర్స్ ఇవిగో.. ఆదర్శ కుటుంబం, ఎల్లమ్మ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్

Published : Oct 20, 2026, 08:51 PM IST

Tollywood Posters: విజయదశమి సందర్భంగా టాలీవుడ్ నుంచి పలు ఆసక్తికరమైన చిత్రాల పోస్టర్లు, రిలీజ్ డేట్ అప్‌డేట్లు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
17
విజయదశమి శుభాకాంక్షలతో టాలీవుడ్ నుంచి అప్‌డేట్లు

విజయదశమి శుభాకాంక్షలతో టాలీవుడ్ నుంచి పలు క్రేజీ సినిమాల అప్‌డేట్లు, రిలీజ్ డేట్లు ఒకేసారి సందడి చేశాయి. వెంకటేష్ "ఆదర్శ కుటుంబం" నుంచి దేవి శ్రీ ప్రసాద్ "ఎల్లమ్మ" వరకు అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేలా ఈ ప్రత్యేక పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..

27
ఆదర్శ కుటుంబం

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ కుటుంబ కథా చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

37
అలియాస్ రుక్మిణి

నాని సమర్పణలో, మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "అలియాస్ రుక్మిణి". రుక్మిణి వసంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట త్వరలోనే రానుండగా, చిత్రాన్ని డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

47
వృషకర్మ

నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మైథాలజికల్ థ్రిల్లర్ "వృషకర్మ". అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి రానుంది.

57
ఇడుపు కాయితం

బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మాణంలో, వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "ఇడుపు కాయితం". సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పోస్టర్ గ్రామీణ పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది.

67
రియాలిటీ

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం "రియాలిటీ". భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.

77
ఎల్లమ్మ

వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ప్యాన్-ఇండియా చిత్రం "ఎల్లమ్మ". సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 5, 2027న ఐదు భాషల్లో భారీగా విడుదల కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories