టాలీవుడ్ లో చాలా మంది పెళ్లి కాని బ్యాచిలర్ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంత మంది మాత్రం పెళ్లి వరకూ వచ్చి కాన్సిల్ అయిన వారు ఉన్నారు. ఎంగేజ్ మెంట్ అయినా.. పెళ్లి దగ్గర కు వచ్చే వరకూ కాన్సిల్ అయిన సెలబ్రిటీ కపుల్స్ ఎవరు..?
త్రిష, రష్మిక, విశాల్, అఖిల్.. ఇలా చాలా మంద యంగ్ స్టార్స్ ఎంగేజ్ మెంట్స్ తరువాత తమ పెళ్లిని కాన్సిల్ చేసుకున్నవారే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. మరి ఇలా నిశ్చితార్ధం తరువాత పెళ్ళిని బ్రేకప్ చేసుకున్న స్టార్స్ ఎవరు..?
26
రీసెంట్ ఇయర్స్ లో ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్. టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ఎంగేజ్ మెంట్ యువ నేత భవ్య బిస్ణోయ్ తో గతేడాది జరిగింది. కాని ఆతరువాత ఏం జరిగిందో ఏమో కాని.. ఈ జంట కూడా పెళ్లి కాకుండానే విడిపోయింది. పెళ్లి తరువా మెహ్రీన్ సినిమాలు చేయదని ప్రచారం జరిగింది. కాని కెరీర్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న స్టార్ హీరోయిన్.. కెరీర్ కోసం పెళ్లి వదులుకుందని టాక్.
36
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష కు వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో 2015లో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండానే ఈ జంట విడిపోయింది. ఆతరువాత త్రిష పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి. కాని ఇప్పటి వరకూ ఆమె ఓ ఇంటిది కాలేకపోయింది.
46
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు కూడా ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి కాన్సిల్ అయ్యింది. ముందుగా విశాల్ కు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో ప్రేమ వ్యవహారం నడిచిందని సౌత్ లో టాక్ గట్టిగా నడిచింది. ఆతరువాత అనిషా ఆల్లరెడ్డి తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆరు నెలల తర్వాత ఈ జంట విడిపోయింది.
56
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన గతంలో లో కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో మునిగి తేలింది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు రావడంతో రష్మిక రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. ఇక ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
66
మరో వైపు అక్కినేని యువ హీరో.. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేనికి కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే.. చాలా చిన్నవయస్సులో... తన ప్రియురాలు శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ వీరిద్దరు కూడా పెళ్ళి కాకుండానే విడిపోయారు. వీరు విడిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా చాలా మందిస్టార్స్ పెళ్లి వరకూ వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు