స్వాతంత్ర వేడుకలు: పవన్, గోపీచంద్, అల్లు అరవింద్.. టాలీవుడ్ సెలెబ్రిటీలని చూశారా

First Published | Aug 15, 2021, 4:40 PM IST

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారులు, సినీ తారలు ఇలా సెలెబ్రిటీలంతా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. 

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారులు, సినీ తారలు ఇలా సెలెబ్రిటీలంతా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. 

టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్యానల్ మెంబర్స్ తో ప్రకాష్ రాజ్ ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు. 


ఇక వరుణ్ తేజ్ గని చిత్ర యూనిట్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సెలెబ్రేట్ చేసింది. ఈ వేడుకల్లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. 

హీరో గోపీచంద్ న్యూ మూవీ 'పక్కా కమర్షియల్' చిత్ర సెట్స్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సెలెబ్రేషన్స్ లో గోపీచంద్, హీరోయిన్ రాశి ఖన్నా, దర్శకుడు మారుతి, నటుడు సత్యరాజ్ ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. 

నేషనల్ రియల్ హీరో సోనూసూద్ కూడా స్వాతంత్ర వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. 

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. మనం పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో వీరుల త్యాగ ఫలం అని చిరంజీవి అన్నారు. వారందరి వెలకట్టలేని త్యాగాలకు విలువ ఇవ్వాలని కోరారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విటర్ వేదికగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మనందరం ఐక్యంగా మెలిగి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరాడు. 

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు. 

Latest Videos

click me!