Kriti Shetty : ఫస్ట్ టైమ్ కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్... నడుమును బొంగరంలా తిప్పిన బేబమ్మ!

First Published | Feb 9, 2024, 8:59 PM IST

యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) ఫస్ట్ టైమ్ బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది. కోలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత సరికొత్తగా కనిపిస్తోంది. ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. 

తెలుగు ప్రేక్షకులను ‘ఉప్పెన’ చిత్రంతో బాగా పరిచయం అయ్యింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. తనదైన పెర్పామెన్స్ తో ఆకట్టుకుంది. అందం, అభినయంతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

కృతి శెట్టి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే తొలి మూడు చిత్రాలు ఉప్పెన, బంగార్రాజు, శ్యాంసింగరాయ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. 


దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఇక్కడ తగ్గింది. ఫలితంగా సినిమా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. వెంటనే బేబమ్మ ఫోకస్ కోలీవుడ్ పైకి మళ్లీంది. తనకు కూడా అక్కడి నుంచి ఆఫర్లు రావడంతో ప్రస్తుతం తమిళ చిత్రాల్లోనే  నటిస్తూ బిజీగా ఉంది. 

కానీ కృతి శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బెల్లీ డాన్స్ తో మతులు పోగొట్టింది. ఫస్ట్ టైమ్ నడుమును బొంగరంలా తిప్పుతూ ఆకట్టుకుంటుంది. ‘బీస్ట్’లోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది. 

అలాగే నడుము అందం, నాభీ సొగసును చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. మరింత నాజుగ్గా తయారైన కృతి శెట్టి తన అందంతో కట్టిపడేస్తోంది. ఏదేమైనా తను పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

సినిమాల విషయానికొస్తే.. తమిళంలో Vaa Vaathiyaare, Genieతో పాటు ప్రదీప్ రంగనాథన్ సరసన  ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.  తెలుగులో ‘శర్వా35’, మలయాళంలోనూ ఒక సినిమాలో నటిస్తోంది. 

Latest Videos

click me!