అభిషేక్‌ బ్రేకప్‌కి కారణం ఆమె.. వైరల్‌ అవుతున్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్

First Published | Aug 28, 2020, 1:55 PM IST

ఇండియన్‌ సినిమాను ఏళుతున్న అమితాబ్ బచ్చన్‌ ఇంట్లో పెత్తనమంతా ఆయన భార్య జయా బచ్చన్‌దే. ఆమె ఏది చెపితే అదే ఇంట్లో అంతా ఫాలో అవుతారు. గతంలో ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య కూడా ప్రస్తావించింది. జయా బచ్చన్‌ స్ట్రిక్ట్ అత్తగారు అంటూ కామెంట్ చేసింది ఐష్. అయితే గతంలో అభిషేక్‌ బచ్చన్‌, రాణీ ముఖర్జీల మధ్య రిలేషన్‌ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వారి బ్రేకప్‌కు కూడా జయా బచ్చనే కారణం అన్న ప్రచారం జరిగింది.

అభిషేక్‌ బచ్చన్‌, రాణీ ముఖర్జీలు చాలా సినిమాలో కలిసి నటించారు. యువ, బంటీ ఔర్‌ బబ్లీ, బ్లాక్‌ బస్టర్ లాంటి సినిమాలో వీరి కెమిస్ట్రీకి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఆ సమయంలో అభిషేక్‌ తల్లి జయా బచ్చన్‌ కూడా రాణీని ఇష్టపడింది.
అయితే యవ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్‌, రాణీ మధ్య తెర వెనుక కూడా ఏదో జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.

లగా చునారీ మే దగ్ సినిమా వీరి జీవితాలను మార్చేసింది. ఈ సినిమా తరువాత అభిషేక్‌, రాణీ ముఖర్జీలు దూరమయ్యారు.
రాణీ ముఖర్జీ జయ బచ్చన్‌కు నచ్చినట్టుగా ఓ బెంగాళీలా మారలేకపోయింది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా వీరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. దీంతో అభిషేక్‌, రాణీలు విడిపోక తప్పలేదు.
ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే మనస్పదర్థలు రావటంతో వారు మాట్లాడుకోకుండానే ఈ సినిమాను పూర్తి చేశారు.
రాణీ ముఖర్జీ ఫ్యామిలీ అభిషేక్‌తో పెళ్లి గురించి మాట్లాడిన, జయా బచ్చన్‌ కారణంగా ఆ పెళ్లి రాణీ ముఖర్జీ అంగీకరించలేదు.
ఆ తరువాత అభిషేక్‌ ఐశ్వర్యల పెళ్లిక కూడా రాణీ ముఖర్జీకి ఆహ్వానం పంపించలేదు. అయితే ఘటనపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రాణీ ముఖర్జీ అందుకు అభిషేకే సమాధానం చెప్పాలని చెప్పింది.
ఆ తరువాత అభిషేక్‌కు కరీష్మా కపూర్‌తో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ కరీష్మా తల్లి కారణంగా ఆ పెళ్లి కూడా పీటల వరకు రాలేదు.
ఫైనల్‌గా ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు అభిషేక్‌. వీరిద్దరిక ఆరాధ్య అనే కూతురు ఉంది.

Latest Videos

click me!