మాస్ మహారాజ రవితేజ (Raviteja) చిత్రంతోనే ఏప్రిల్ నెలలో సినిమా పండగ షురూ కానుంది. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న మాస్ రాజా ‘రావణసుర’ Ravanasuraతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ సంస్థలు నిర్మించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అదించారు. సుశాంత్, హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సాయంత్రం హైటెక్ సిటీ శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.